The Full Telugu Movie Review Of Vishal Jayasurya Movie | Kajal Agarwal Movie List | Tollywood Movies

Teluguwishesh జయసూర్య జయసూర్య Vishal Jayasurya Telugu Movie Review Kajal Agarwal Tollywood : The Full Telugu Movie Review Of Jayasurya Movie In Which Vishal And Kajal Agarwal Starring. Product #: 67808 2.5 stars, based on 1 reviews
  • చిత్రం  :

    జయసూర్య

  • బ్యానర్  :

    సాయిచంద్ర ఫిలింస్, సర్వంత్ రామ్ క్రియేషన్స్

  • దర్శకుడు  :

    సుశీంద్రన్

  • నిర్మాత  :

    జి.నాగేశ్వర రెడ్డి, ఎస్. నరసింహ ప్రసాద్

  • సంగీతం  :

    డి.ఇమాన్

  • సినిమా రేటింగ్  :

    2.52.5  2.5

  • నటినటులు  :

    విశాల్, కాజల్ అగర్వాల్ త‌దిత‌రులు

Vishal Jayasurya Telugu Movie Review Kajal Agarwal Tollywood

విడుదల తేది :

2015-09-04

Cinema Story

‘జయసూర్య’ స్టోరి గుంటూర్ లో ప్రారంభం అవుతుంది. భవాని అనే ఓ రౌడీ గ్యాంగ్ అక్కడి ధనవంతులైన బిజినెస్ మెన్స్ ను బెదిరించి డబ్బులు వసూలు చేస్తుంటారు. ఈ గ్యాంగ్ ను పట్టుకోవాలని ప్రయత్నించిన ఆల్బర్ట్(హరీష్) అనే పోలీస్ ను చంపేస్తారు. దీంతో ఎలాగైనా ఈ గ్యాంగ్ ను ఫినిష్ చేయాలని సీక్రెట్ మిషన్ మీద వైజాగ్ నుంచి అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ జయసూర్య(విశాల్) రంగంలోకి దిగుతాడు. ఈ సమయంలోనే సౌమ్య(కాజల్ అగర్వాల్)ను చూసి ప్రేమలో పడతాడు జయసూర్య. సౌమ్య కూడా జయసూర్య ప్రేమలో పడటం త్వరత్వరగా జరిగిపోతాయి. ఇదిలా జరుగుతుండగానే జయసూర్య తను వచ్చిన పనిలో భాగంగా భవాని గ్యాంగ్ ను ఫినిష్ చేసేస్తాడు.

ఇక ఇక్కడితో అయిపోయిందనుకుంటే... ఈ గ్యాంగ్ కు మరో హెడ్ వున్నాడని తెలుస్తుంది. దీంతో అదే ఏరియాకు స్పెషల్ ఆఫీసర్ గా ఛార్జ్ తీసుకుంటాడు జయసూర్య. ఈ కేసులో భాగంగా జయసూర్య సంపాదించిన సాక్ష్యాలన్నీ కూడా కనుమరుగవుతూ వుంటాయి. ఇదే సమయంలో శ్రీను(సముద్రఖని) ఎంట్రీ ఇస్తాడు. అసలు ఈ శ్రీను ఎవరు? భవాని గ్యాంగ్ కు హెడ్ ఎవరు? జయసూర్యకు శ్రీనుకు వున్న సంబంధం ఏంటి? ఆ సాక్ష్యాలన్నీ ఎలా కనిపించకుండా పోతున్నాయి? కథలోని అసలు ట్విస్ట్ ఎంటీ? చివరకు జయసూర్య ఏం చేసాడు? అనే ఆసక్తికరమైన అంశాలను వెండితెర మీద చూసి ఆనందించాల్సిందే.

cinima-reviews
జయసూర్య

విశాల్, కాజల్ జంటగా తెరకెక్కిన తాజా చిత్రం ‘జయసూర్య’. తమిళంలో ‘పాయుం పులి’ పేరుతో విడుదల చేస్తున్నారు. తెలుగులో జవ్వాజి రామాంజనేయ సమర్పణలో సాయిచంద్ర ఫిలింస్, సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్స్ పై జి.నాగేశ్వర రెడ్డి, ఎస్. నరసింహ ప్రసాద్ అందిస్తున్నారు.

సుశీంద్రన్ దర్వకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి డి.ఇమాన్ సంగీతం అందించారు. ఈ సినిమాలో విశాల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. లవ్, మాస్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం భాషలలో సెప్టెంబర్ 4వ తేదిన విడుదల చేసారు. మరి ఈ సినిమా ఎలా వుందో ఒకసారి చూద్దామా!

Cinema Review

ప్లస్ పాయింట్స్ :

జయసూర్య పాత్రలో విశాల్ చాలా చక్కగా నటించాడు. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా అదరగొట్టాడు. యాక్షన్ సన్నివేశాలలో ఇరగదీసాడు. ఇక కాజల్ కేవలం గ్లామర్ పాత్రకు మాత్రమే పరిమితమయ్యింది. కొన్ని సీన్లలో పర్వాలేదనిపించింది. పాటలు మరియు లవ్ సీన్లలో బాగుంది. ఇక శ్రీను పాత్రలో సముద్రఖని చాలా బాగా నటించాడు. తన యాక్టింగ్ తో అదరగొట్టాడు. ఒకవైపు కూల్ గా కనిపిస్తూ... మరోవైపు నెగెటివ్ షెడ్స్ లో చాలా చక్కగా నటించాడు. ఇక కమెడియన్ సూరి తన పాత్ర మేరకు పర్వాలేదనిపించాడు. మిగతా నటీనటులు వారి వారి పాత్రల మేరకు పర్వాలేదనిపించారు. ఇక సినిమా పరంగా స్టోరీ లైన్ బాగుంది. కొన్ని ట్విస్టులు బాగా వర్కౌట్ అయ్యాయి. సెకండ్ హాఫ్ లో పలు యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి. అలాగే క్లైమాక్స్ సీన్స్ బాగున్నాయి.

మైనస్ పాయింట్స్:

ఈ సినిమాలో చాలా మైనస్ పాయింట్లు వున్నాయి. ఇప్పటికే ఇలాంటి కథలతో చాలా సినిమాలొచ్చాయి. దర్శకుడు సుశీంద్రన్ అనుకున్న స్టోరీలైన్ బాగున్నప్పటికీ, స్ర్కీన్ ప్లే మాత్రం ఘోరంగా దెబ్బతీసింది. కథనం విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. సినిమాలో ట్విస్టు బాగున్నప్పటికీ, వాటిని అనవసరమైన సమయంలో రివీల్ చేసారు. దీంతో తర్వాత ఏం జరుగనుందో ప్రేక్షకులు ముందుగానే ఊహించేయవచ్చు. అంతే కాకుండా నెరేషన్ కూడా చాలా స్లో గా సాగుతుంది. ఇక సినిమాలోని పాటలు చాలా చిరాకుపెడుతుంటాయి. నిఖితతో చేయించిన స్పెషల్ సాంగ్ సినిమాకు ఏ మాత్రం హెల్ప్ అవలేదు. అలాగే ఫస్ట్ హాఫ్ లో వచ్చే కామెడీ అంతగా వర్కౌట్ అవలేదు. అలాగే హీరోహీరోయిన్ల మధ్య వచ్చే లవ్ ట్రాక్ లో రెండు, మూడు సీన్స్ తప్ప మిగతావన్నీ కూడా బోర్. ఇక సినిమా లెంగ్త్ కూడా బాగా ఎక్కువయ్యింది. మరింత ఎడిట్ చేసి వుంటే బాగుండేది.

సాంకేతికవర్గ పనితీరు:

ఈ సినిమాకు డి.ఇమాన్ అందించిన పాటలు అంతగా బాగోలేవు కానీ... బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సూపర్బ్. సినిమాలోని ఎమోషన్ ను ఇమాన్ తన రీరికార్డింగ్ తో చాలా బాగా చూపించాడు. సినిమాటోగ్రఫి బాగుంది. కొన్ని కొన్ని విజువల్స్ చాలా బాగున్నాయి. ఎడిటర్ ఆంథోని ఎడిటింగ్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకొని వుంటే బాగుండేది. ఇక దర్శకుడు సుశీంద్రన్ తీసుకున్న స్టోరీ లైన్ బాగుంది కానీ కథనం విషయంలో ఫెయిల్ అయ్యాడని చెప్పుకోవచ్చు. ఇక నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా:
జయసూర్య: పాత సైలెంట్ పోలీస్ కథే!