The Full Telugu Review Of Vinavayya Ramayya Movie | Tollywood Movies | Telugu Movie Reviews

Teluguwishesh వినవయ్యా రామయ్యా వినవయ్యా రామయ్యా Vinavayya Ramayya Movie Telugu Review : The Full Telugu Review Of Vinavayya Ramayya Movie In Which Nag Anvesh and Kritika Paired. Product #: 65338 3 stars, based on 1 reviews
  • చిత్రం  :

    వినవయ్యా రామయ్యా

  • బ్యానర్  :

    సరస్వతి ఫిలిమ్స్

  • దర్శకుడు  :

    జి.రాంప్రసాద్

  • నిర్మాత  :

    సింధుర పువ్వు కృష్ణారెడ్డి

  • సంగీతం  :

    అనూప్

  • సినిమా రేటింగ్  :

    333  3

  • ఛాయాగ్రహణం  :

    రసూల్ ఎల్లోర్

  • ఎడిటర్  :

    ప్రవీణ్ పూడి

  • నటినటులు  :

    నాగాన్వేష్, కృతిక, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, ఆలీ, నరేష్ తదితరులు

Vinavayya Ramayya Movie Telugu Review

విడుదల తేది :

2015-06-19

Cinema Story

సీన్ ఓపెన్ చేస్తే వీరయ్య పాలెం.. అక్కడ ఎన్ని ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా తనకేమీ తెలియదన్నట్టుగా అల్లరిగా తిరిగే తిరిగే చంటి (నాగ అన్వేష్) అనే అబ్బాయి వుంటాడు. అతనికి తన ఎదురింట్లో ఉండే జానకి (కృతిక) అంటే ఎంతో ఇష్టం. చిన్నప్పట్నుంచీ కలిసి పెరగడం, కలిసే ఆడుకోవడం వల్ల జానకిపై తన ఇష్టాన్ని ప్రేమగా మార్చుకుంటాడు.

జానకి తండ్రి చౌదరి (ప్రకాష్ రాజ్) ఆ ఊరికే పెద్దమనిషి. చౌదరి, జానకికి ఓ పెద్ద జమీందారునిచ్చి పెళ్ళి చెయ్యాలని ఓ సంబంధం కుదురుస్తాడు. ఈ విషయం తెలుసుకున్న చంటి, జానకికి తన ప్రేమ విషయాన్ని చెప్పగా, తనకలాంటి ఆలోచనలు లేవని తేల్చి చెప్పేస్తుంది. ఆ తర్వాత ప్రేమ విఫలమవ్వడాన్ని తట్టుకోలేని చంటి పరిస్థితి అయోమయంగా తయారవుతుంది. అటువంటి సమయంలో చంటి పరిస్థితిని చూసిన అతడి ఫ్రెండ్స్ అప్పటికప్పుడే పెళ్ళి వేడుకకు వెళ్లి అక్కడ నుంచి జానకిని కిడ్నాప్ చేస్తారు. ముందుగా చంటి, జానకి ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారేమోనని ఫ్రెండ్స్ అనుకుంటారు. కానీ.. చంటి మాత్రమే జానకిని ప్రేమిస్తున్నట్లుగా నిజం వాళ్లు తెలుసుకుని, తాము చేసిన తప్పు తెలుసుకుంటారు.

ఇక ఆ తర్వాత వారేం చేశారు? జానకి ఇంట్లో నుంచి లేచిపోయిందని అనుకున్న అతడి కుటుంబం మళ్ళీ ఆమెను దగ్గరకు రానిస్తుందా? చంటి ప్రేమను జానకి అర్థం చేసుకుంటుందా? వీరిద్దరి ప్రేమ చివరకు ఏమైంది? అనే విషయాలు తెలియాలంటే వెండితెరపై సినిమా చూడాల్సిందే!

cinima-reviews
వినవయ్యా రామయ్యా

నాగ అన్వేష్, కృతిక హీరోహీరోయిన్లుగా ప్రముఖ దర్శకుడు జి.రాంప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘వినవయ్యా రామయ్యా’. ఈ చిత్రాన్ని సీనియర్ నిర్మాత ‘సింధురపువ్వు’ కృష్ణారెడ్డి అత్యంత భారీ నిర్మాణ విలువలతో నిర్మించారు. ఈ చిత్రాన్ని జూన్ 19న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో మరికొద్ది రోజుల్లో తెలియనుంది. హీరోహీరోయిన్లుగా ఎంట్రీ అవుతున్న నాగ అన్వేష్, కృతికలకు ఈ సినిమా ఏ మేరకు విజయం సాధించిందో తెలుసుకుందామా..

Cinema Review

ప్లస్ పాయింట్స్ :

నాగ అశ్విన్ కి ఇది మొదటి సినిమా అయినప్పటికీ.. కానీ చైల్డ్ ఆర్టిస్ట్ గా అనుభవం ఉండటంతో కెమరా ముందు ఎలాంటి ఇబ్బంది లేకుండా నటించాడు. రెండు మూడు సినిమాల అనుభవం ఉన్న హీరోలా నటించాడు. తన కామెడీ టైమింగ్ తోపాటు స్టెప్పులు కూడా ఇరగదీశాడు. ఇక ‘దృశ్యం’ ఫేం కృతిక జయకుమార్ లంగా ఓనీల్లో బాగా ఆకట్టుకుంది. కృతిక ఎనర్జీ లెవల్స్ చాలా బాగున్నాయి. పాటల్లో బాగా గ్లామరస్ గా కనిపించిన ఈ భామ ఉన్నతలో బాగానే చేసింది.

ఇక సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ కథకి బలమైన పాత్రలో మంచి నటనని కనబరిచారు. కామెడీ కింగ్ బ్రహ్మానందం పటేల్ పహిల్వాన్ పాత్రలో బాగానే నవ్వించాడు. అలాగే అలీ, సప్తగిరి, షకలక శంకర్, జబర్దస్త్ శీను, హరీష్ లు హీరో ఫ్రెండ్స్ గా బాగా నవ్వించారు. ముఖ్యంగా షకలక శంకర్ తన వైఫ్ తో దెబ్బలు తినే ఎపిసోడ్ బాగా నవ్విస్తుంది. ఓవరాల్ గా సినిమాలో ఫస్ట్ హాఫ్ లోని కొన్ని కామెడీ ఎపిసోడ్స్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తే సెకండాఫ్ లోని కొన్ని ఫ్యామిలీ మోమెంట్స్ అందరినీ ఆకట్టుకుంటాయి.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకి చెప్పదగిన మైనస్ పాయింట్ కథ. ఈ సినిమా కథలో ఎలాంటి కొత్తదనం లేదు. కథ పాతది అయినా కథనంలో కాస్త కొట్టడం ఉండేలా చూసుకొని ఉంటే ఈ సినిమాకి హెల్ప్ అయ్యేది. సినిమాలో ఆడియన్స్ సర్ప్రైజ్ ఫీలయ్యేలా ఒక్కటి కూడా లేదు. ఫస్ట్ హాఫ్ అంతా అసలు కథలోకే వెళ్లరు.

ఇకపోతే ఈ సినిమా కథ మొత్తం తిరిగే ప్రధాన పాయింట్ హీరో – హీరోయిన్ మధ్య నడిచే లవ్ స్టొరీ. కానీ దానిని సరిగా ప్లాన్ చేసుకోలేదు. క్లైమాక్స్ అంత ఎమోషనల్ గా ఉన్నప్పుడు వారిద్దరి మధ్యా లవ్ స్టొరీని డెవలప్ చెయ్యాలి కానీ ఎక్కడా లవ్ ట్రాక్ ని సరిగా చూపలేదు. సెకండాఫ్ లో ఇంకాస్త ఎంటర్టైన్మెంట్ ని ప్లాన్ చేసుకోవాల్సింది. పాటలు, వాటి పిక్చరైజేషన్ బాగుంది కానీ వాటి ప్లేస్ మెంట్ మాత్రం సినిమా వేగాన్ని తగ్గించేలా ఉన్నాయి.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగంలో ఈ సినిమాకి హెల్ప్ చేసిన డిపార్ట్ మెంట్స్ చాలానే ఉన్నాయి. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది.. రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ. సినిమాలోని ప్రతి ఫ్రేంని చాలా కలర్ఫుల్ గా, గ్రాండ్ గా చూపించాడు. అనూప్ రూబెన్స్ అందించిన పాటలు బాగున్నాయి. పాటల కంటే అనూప్ రూబెన్స్ నేపధ్య సంగీతం సినిమాకి బాగా హెల్ప్ అయ్యింది. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ ఇంకాస్త బెటర్ గా ఉండాల్సింది. కొన్ని చోట్ల కత్తిరింపు వేసుంటే సినిమా ఇంకా బెటర్ గా ఉండేది. వీరబాబు బాసిన రాసిన డైలాగ్స్ లో పంచ్ లు ఎక్కువైనా బాగున్నాయి. ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ కుమార్ ఆర్ట్ వర్క్ డీసెంట్ గా ఉంది.

ఇక దర్శకుడు రామ్ ప్రసాద్ విషయానికి వస్తే.. ఆయన కథ విషయంలో ఎక్కువ కేర్ తీసుకోవాల్సింది అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే లో కొన్ని ఆసక్తికర ఎలిమెంట్స్ రాసుకోవాల్సింది. ఇక దర్శకుడిగా మాత్రం కొంతమేర సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ నిర్మాత కృష్ణారెడ్డి. అనవసరమైన ఖర్చులు చేయకుండా.. కథకు తగినట్లుగా చాలా ఉన్నత విలువలతో ఎంతో గ్రాండ్ గా సినిమాని నిర్మించాడు.

తీర్పు :

‘వినవయ్యా రామయ్యా’ : కుటుంబసమేతంగా చూడదగిన ఎంటర్ టైనింగ్ సినిమా