The full telugu review of nara rohith latest flick asura movie | priya benerjee | telugu movie reviews

Teluguwishesh అసుర అసుర asura movie telugu review nara rohith priya benerjee : The full telugu review of nara rohith latest flick asura movie. In this nara rohith romance with priya benerjee. Product #: 64893 2.5 stars, based on 1 reviews
  • చిత్రం  :

    అసుర

  • బ్యానర్  :

    దేవాస్ మీడియా అండ్ ఎంటర్ టైన్మెంట్, కుషాల్ సినిమా, ఆరన్ మీడియా వర్క్స్

  • దర్శకుడు  :

    కృష్ణ విజయ్

  • నిర్మాత  :

    శ్యామ్ దేవభక్తుని, కృష్ణ విజయ్

  • సంగీతం  :

    సాయికార్తీక్

  • సినిమా రేటింగ్  :

    2.52.5  2.5

  • ఛాయాగ్రహణం  :

    యస్.వి.విశ్వేశ్వర్

  • ఎడిటర్  :

    ధర్మేంద్ర కాకరాల

  • నటినటులు  :

    నారా రోహిత్, ప్రియా బెనర్జీ తదితరులు

Asura Movie Telugu Review Nara Rohith Priya Benerjee

విడుదల తేది :

2015-06-05

Cinema Story

రాజమండ్రి సెంట్రల్ జైల్ జైలర్ ధర్మతేజ(నారా రోహిత్). తన పని తాను చేసుకుంటూ పోయే వ్యక్తి. చాలా పవర్ ఫుల్ ఆఫీసర్. రూల్స్ ఫాలో అవడం తెలియదు కానీ తప్పు చేస్తే ఎలాంటి రూల్స్ నైనా మార్చేసి న్యాయం జరిగేలా చూస్తాడు. అనాధైన ధర్మతేజకు హారిక(ప్రియా బెనర్జీ) అంటే ప్రాణం. ధర్మతేజ లవర్ హారిక. ఇలా వుండగా ధర్మ జీవితంలోకి చార్లీ(రవివర్మ) ఎంట్రీ ఇస్తాడు. చార్లీ ఓ కరుడుగట్టిన హంతకుడు. ఉరిశిక్ష ఎదుర్కొనే వ్యక్తి చార్లీ.

చార్లీని వేరే జైలు నుంచి ధర్మ పనిచేస్తున్న జైలుకు ట్రాన్స్ ఫర్ చేస్తారు. అక్కడ పాండు అనే వ్యక్తితో చార్లీ ఓ ఒప్పందం కుదుర్చుకుంటాడు. తనను జైలు నుంచి తప్పిస్తే ఎంతో విలువైన 50 వజ్రాలు ఇస్తానని పాండుతో చార్లీ ఒప్పందం కుదుర్చుకుంటాడు. ఇక అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. ఈ ప్రయత్నంలో హారిక కూడా ఇరుక్కుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ధర్మతేజ ఏం చేసాడు? అసలు హారిక ఇందులో ఎలా ఇరుక్కుంది? ధర్మతేజ ఈ సమస్యను ఎలా పరిష్కరించాడు? అసలు చార్లీకి ఉరిశిక్ష పడిందా లేదా? అనే ఆసక్తికర అంశాలు వెండితెర మీద చూస్తేనే బాగుంటుంది.

cinima-reviews
అసుర

‘రౌడీ ఫెల్లో’ సినిమా తర్వాత నారా రోహిత్ నటించిన తాజా చిత్రం ‘అసుర’. పేరుకు తగ్గట్లుగానే ఈ చిత్ర టైటిల్ లోగో అద్భుతంగా వుంది. అలాగే పోస్టర్లు, ట్రైలర్స్ కూడా బాగున్నాయి. నారా రోహిత్ సమర్పణలో దేవాస్ మీడియా అండ్ ఎంటర్ టైన్మెంట్, కుషాల్ సినిమా, ఆరన్ మీడియా వర్క్స్ పతాకాలపై శ్యామ్ దేవభక్తుని, కృష్ణ విజయ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సాయికార్తీక్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. నారా రోహిత్ తన మొదటి చిత్రం నుంచి కూడా విభిన్న కథలనే ఎంపిక చేసుకుంటూ కొనసాగుతున్నాడు. ఇటీవలే ‘అసుర’ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని U/A సర్టిఫికెట్ ను దక్కించుకుంది.

నారా రోహిత్ సరసన ప్రియా బెనర్జీ హీరోయిన్ నటించింది. ఇందులో నారా రోహిత్ ఓ పవర్ ఫుల్ జైలర్ పాత్రలో నటించాడు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్లకు మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రాన్ని నేడు(జూన్ 5) ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేసారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో, ఈ సినిమా ఎలా వుందో ఒకసారి చూద్దామా!

ప్లస్ పాయింట్స్:

ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ నారా రోహిత్ అని చెప్పుకోవాలి. ఇందులో నారా రోహిత్ అద్భుతంగా నటించాడు. పవర్ ఫుల్ జైలర్ గా ధర్మతేజ పాత్రలో చింపేసాడు. ఇక నారా రోహిత్ వాయిస్ నుంచి వచ్చే డైలాగ్స్ బాగున్నాయి. నారా రోహిత్ తన డైలాగ్స్ తో బాగా ఆకట్టుకున్నాడు. ఇక ప్రియా బెనర్జీ నటన పరంగా పర్వాలేదనిపించింది. ఇక విలన్ చార్లీ పాత్రలో నటించిన రవివర్మ బాగా ఆకట్టుకున్నాడు. తనదైన శైలిలో విలనిజం చూపించే ప్రయత్నం చేసాడు. ఇక మిగతా నటీనటులు వారి వారి పాత్రల మేరకు పర్వాలేదనిపించారు.

సినిమా పరంగా ప్లస్ పాయింట్స్ అంటే ఇందులో ట్విస్టులు బాగున్నాయి. ఇంటర్వెల్ కు ముందు వచ్చే ట్విస్ట్ సెకండ్ హాఫ్ మీద హైప్ క్రియేట్ చేస్తుంది. ఇక క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ మరింత బాగుంది. నారా రోహిత్ ఇప్పటి వరకు చేసిన చిత్రాలన్నిటి కంటే ఈ చిత్రం మరింత డిఫరెంట్ గా వుంది. రొటీన్ కమర్షియల్ సినిమాలకు కాస్త విభిన్నం అనే చెప్పుకోవచ్చు.

మైనస్ పాయింట్స్:

‘అసుర’ చిత్రానికి మేజర్ మైనస్ పాయింట్ కూడా నారా రోహిత్. ముందుగా పోలీస్ ఆఫీసర్ గెటప్ అంటేనే చాలా స్లిమ్ గా వుండాలి. బాడీ ఫిట్ గా వుండాలి. అంతే కానీ బాణాడు పొట్టేసుకొని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తే ప్రేక్షకులకు అంతగా నచ్చదు. నారా రోహిత్ బాగా లావుగా వుండటం వల్ల చూసే ప్రేక్షకులకు ధర్మతేజ అనే పేరులో వుండే పవర్.. నారా రోహిత్ బాడీని చూసాక కలుగదు. అంత పెద్ద భారీ పర్సనాలిటీతో యాక్షన్ చేస్తే చూడటానికే జనాలకు నచ్చట్లేదు. ఇక హీరోయిన్ పాత్ర మరీ తక్కువైపోయింది. హీరోయిన్ పాత్రకు కూడా మరింత ప్రాధాన్యతనిచ్చి, హీరోహీరోయిన్లు మధ్య నడిచే ప్రేమకథను మరింత బాగా చూపించి వుంటే ఇంకా బాగుండేది.

నారా రోహిత్ లాంటి భారీ పర్సనాలిటీకి రవివర్మ లాంటి సన్నని విలన్ తో మైండ్ గేమ్ అంతగా కనెక్ట్ అవలేదు. ఇక కథ పరంగా చూసుకుంటే సినిమాలో కొన్ని చోట్ల లాజిక్ మిస్సయ్యింది. ఎంటర్ టైన్మెంట్ కోరుకునే ప్రేక్షకులకు ఈ సినిమా చాలా బోర్ కలిగిస్తుంది. కథ పరంగా అంతగా దమ్ములేదు. ఇక అక్కడక్కడ స్లోగా సాగదీసినట్లుగా అనిపిస్తూ వుంటుంది. మొత్తానికి కమర్షియల్ సినిమాలు కోరుకునే ప్రేక్షకులకు కాస్త పర్వాలేదనిపిస్తుంది. కానీ మళ్లీ కమర్షియల్ సినిమాకు వుండాల్సిన హంగులేమి ఇందులో అంతగా లేవు. కేవలం ఫైట్లు, యాక్షన్ తప్ప.

సాంకేతికవర్గ పనితీరు:

అసుర చిత్రం ద్వారా విజయ్ కృష్ణ దర్శకుడిగా మంచి మార్కులు కొట్టేసాడని చెప్పుకోవచ్చు. కానీ కథ, స్ర్కీన్ ప్లే పరంగా మరింత జాగ్రత్తలు తీసుకొని తెరకెక్కిస్తే ఇంకా అద్భుతంగా వచ్చేది. సినిమాటోగ్రఫి సూపర్బ్. కొన్ని సీన్లలో విజువల్స్ చాలా బాగున్నాయి. సాయికార్తీక్ సంగీతం అందించిన పాటలు బాగున్నాయి. ఇందులో నారా రోహిత్ చెప్పే డైలాగ్స్ బాగున్నాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు. ఎడిటింగ్ పర్వాలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. చాలా రిచ్ గా నిర్మించారు.

చివరగా:
అసుర: పవర్ ఫుల్ యాక్షన్ థ్రిల్లర్