The full review of andhra pori movie | Akash puri Debut movie | Ulka Gupta | Puri Jagannadh

Teluguwishesh ఆంధ్రాపోరి ఆంధ్రాపోరి andhra pori movie telugu review : The full review of Director Puri Jagannadh Son Akash puri debut movie andhra pori. In this movie Ulka Gupta pairing with akash for the first time. Product #: 64891 1.25 stars, based on 1 reviews
  • చిత్రం  :

    ఆంధ్రాపోరి

  • బ్యానర్  :

    ప్రసాద్ ప్రొడక్షన్స్

  • దర్శకుడు  :

    రాజ్ మాదిరాజ్

  • నిర్మాత  :

    రమేష్ ప్రసాద్

  • సంగీతం  :

    జోశ్యభట్ల

  • సినిమా రేటింగ్  :

    1.25  1.25

  • ఛాయాగ్రహణం  :

    ప్రవీణ్ వనమాలి

  • ఎడిటర్  :

    శ్రీకర్ ప్రసాద్

  • నటినటులు  :

    ఆకాష్ పూరీ, ఉల్కాగుప్తా, పూర్ణిమ, శ్రీముఖి, ఈశ్వరిరావు, ఉత్తేజ్ తదితరులు

Andhra Pori Movie Telugu Review

విడుదల తేది :

2015-06-05

Cinema Story

1990లో సినిమా ప్రారంభమవుతుంది. పేద కుటుంబంలో పుట్టి, ఎందుకు పనికిరానివాడిగా అందరితో అనిపించుకునే కుర్రాడు నిజామాబాద్ నర్సింగ్ యాదవ్(ఆకాష్ పూరీ). 10వ తరగతిలో కంటిన్యూగా ఫెయిల్ అవుతాడు. అలాగే నర్సింగ్ తల్లి ఇచ్చిన టిఫిన్ బాక్సులను కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ లో పనిచేసేవారికి ఇవ్వడంలో ప్రతిసారి ఫెయిల్ అవుతుంటాడు. దీంతో నర్సింగ్ ను వాళ్ల అమ్మ ఇంటి నుంచి వెళ్లగొడుతుంది. అలా బయటకు వచ్చిన నర్సింగ్ ఓ థియేటర్ లో పనికి చేరుతాడు. ప్రతి ఒక్కరి జీవితంలో ఓ గర్ల్ ఫ్రెండ్ వుండాలని, ప్రతి మగాడి సక్సెస్ వెనుక ఓ ఆడది వుంటుందని నర్సింగ్ ఫ్రెండ్ చెబుతాడు. దీంతో అప్పర్ కాస్ట్ అమ్మాయైన ప్రశాంతి(ఉల్కాగుప్తా)ను చూసి ప్రేమలో పడతాడు. అసలు వీరిద్దరూ ప్రేమలో పడటానికి గల కారణాలేంటి? ప్రేమలో పడ్డ తర్వాత వచ్చిన వీరికి ఏర్పడిన సమస్యలేంటి? అసలు వీరి జీవితంలో ఏం జరిగింది? మరి వీరి ప్రేమ చివరకు ఏమయ్యింది? అనే అంశాలను వెండితెరపై చూసి తెలుసుకుంటేనే బాగుంటుంది.

cinima-reviews
ఆంధ్రాపోరి

పూరీ జగన్నాధ్ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఆంధ్రాపోరి’. ప్రసాద్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రమేష్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి రాజ్ మదిరాజ్ దర్శకత్వం వహించారు. జోశ్యభట్ల సంగీతం అందించిన పాటలు ఇటీవలే మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. అలాగే ట్రైలర్లకు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఆకాష్ పూరీ సరసన ఉల్కాగుప్తా హీరోయిన్ గా నటించింది. మాస్ లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని ఈనెల 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి హీరోగా ఆకాష్ పూరీకి ఈ ‘ఆంధ్రాపోరి’ ఎలాంటి విజయాన్ని అందించనుందో త్వరలోనే తెలియనుంది.

నటీనటుల పనితీరు:

ఈ సినిమాలో అందరు నటీనటుల పర్ఫార్మెన్స్ అంతంత మాత్రంగానే అనిపించాయి. ఆకాష్ పూరీ నిజామాబాద్ నర్సింగ్ యాదవ్ పాత్రలో చాలా చక్కగా నటించాడు. యూత్ ఆవారాగా, ఓ అమ్మాయిని చూసి ప్రేమలో పడే కుర్రకారుడిగా ఆకాష్ బాగా చేసాడు. కానీ హీరో స్థాయిలో ఆకాష్ తన మేనరిజం చూపించలేకపోయాడు. ఇంకాస్త యాక్టింగ్ నేర్చుకుంటే బాగుండేది. డాన్సులు పర్వాలేదు. ఇక హీరోయిన్ ఉల్కాగుప్తా తన స్మైల్ తో బాగా ఆకట్టుకుంది. కానీ సీరియస్ సన్నీవేశాలలో మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. శ్రీముఖి మరియు అరవింద్ కృష్ణ వారి వారి పాత్రలకు న్యాయం చేసారు. ఇక నర్సింగ్ యాదవ్ తల్లి పాత్రలో నటించిన ఈశ్వరి రావు మంచి నటనను కనబరిచింది. అలాగే హీరోయిన్ ఫాదర్ గా నటించిన శ్రీకాంత్ అయ్యంగర్ బాగా చేసాడు. ఇక మిగతా నటీనటులు వారి వారి పాత్రల మేరకు పర్వాలేదనిపించారు.

ప్లస్ పాయింట్స్:

ప్లస్ పాయింట్స్ అంటే పెద్దగా ఏం లేవు కానీ.... పైన చెప్పినట్లుగా నటీనటులు పర్వాలేదనిపించారు. ఇక సినిమాలో అక్కడక్కడ వచ్చే సింగిల్ లైన్ డైలాగ్స్ బాగున్నాయి. ఆకాష్ యాక్టింగ్ పర్వాలేదు. స్టోరీ లైన్ ఓకే ఓకే.

మైనస్ పాయింట్స్:

మైనస్ పాయింట్స్ అంటే చాలానే వున్నాయి. ముందుగా నటీనటుల విషయంలో హీరోయిన్ ఉల్కాగుప్తా తన పాత్రకు తగిన న్యాయం చేయలేకపోయింది. డబ్బింగ్ అసలు సింక్ అవలేదు. ఇక కథలో అంతపెద్దగా ఏం మ్యాటర్ లేదు. కామెడీ సన్నీవేశాలు కూడా ఏదో కావాలని ఇరికించినట్లుగా వున్నాయి. ఇక అన్నిటికంటే స్లో నెరేషన్. చూసే ప్రేక్షకులకు చాలా బోర్ వస్తుంది. సినిమా మొత్తం బాగా సాగదీసినట్లుగా వుంటుంది.

సాంకేతికవర్గ పనితీరు:

క్యూట్ లవ్ స్టోరీతో సినిమా తీయాలనుకున్న దర్శకుడు రాజ్ మదిరాజ్ పర్వాలేదనిపించాడు. ఎందుకంటే లైన్ బాగున్నప్పటికీ... ఆ ఫీల్ ను మాత్రం ప్రేక్షకులు ఫీల్ అయ్యేలా చేయలేకపోయాడు. ఆడియెన్స్ సినిమాలో ఇన్వాల్వ్ అయ్యే విధంగా, సినిమాకు కనెక్ట్ అయ్యే విధంగా లేదు. సినిమాటోగ్రఫి బాగుంది. సంగీతం పర్వాలేదు. ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. డైలాగ్స్ మరింత ఆసక్తికరంగా రాయాల్సింది. చివరగా ప్రసాద్ ప్రొడక్షన్స్ నిర్మాణ విలువలు పర్వాలేదు.

చివరగా:
ఆంధ్రాపోరి: పర్వాలేదనిపించే సినిమా!