surya rakshasudu telugu movie review | tollywood movies

Teluguwishesh రాక్షసుడు రాక్షసుడు Get information about Rakshasudu Telugu Movie Review, Rakshasudu Movie Review, Surya Rakshasudu Movie Review, Rakshasudu Movie Review And Rating, Rakshasudu Telugu Movie Talk, Rakshasudu Telugu Movie Trailer, Surya Rakshasudu Review, Rakshasudu Telugu Movie Gallery and more Product #: 64674 2.75 stars, based on 1 reviews
  • చిత్రం  :

    రాక్షసుడు

  • బ్యానర్  :

    మేధా క్రియోష‌న్స్

  • దర్శకుడు  :

    వెంకట్ ప్రభు

  • నిర్మాత  :

    కె.ఇ.జ్ఞాన‌వేల్‌ రాజా

  • సంగీతం  :

    యువన్ శంకర్ రాజా

  • సినిమా రేటింగ్  :

    2.752.75  2.75

  • ఛాయాగ్రహణం  :

    ఆర్.డి.రాజశేఖర్

  • ఎడిటర్  :

    ప్రవీణ్.కె.ఎల్

  • నటినటులు  :

    సూర్య, నయనతార, ప్రణీత తదితరులు

Surya Rakshasudu Telugu Movie Review

విడుదల తేది :

2015-05-29

Cinema Story

మధుసూదన్ అలియాస్ మాస్(సూర్య), జెట్టు(ప్రేమ్ జీ అమరెన్) ఇద్దరూ చిన్న చిన్న మోసాలు, దొంగతనాలు చేసుకుంటూ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంటారు. అలా సాఫిగా సాగుతున్న సమయంలో వీరికి ఓ సమస్య వచ్చిపడుతుంది. దాంతో తప్పించుకోవడానికి ప్రయత్నించగా.. మాస్ కి యాక్సిడెంట్ అవుతుంది. దీంతో మాస్ ఓ రెండు క్షణాల్లో చచ్చి బ్రతుకుతాడు. హాస్పిటల్లో కోలుకున్న తర్వాత మాస్ కు ఆత్మలు కనిపించడం మొదలవుతాయి. ఆ ఆత్మలు తమ కోరికలను తీర్చమంటాయి. మాస్ ఇదే అదునుగా భావించి, హెల్ప్ చేయాలంటే తనకు హెల్ప్ చేయాలని చెప్పి, ఆ ఆత్మలను అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదిస్తుంటాడు. ఇదే సమయంలో మాలిని(నయనతార)తో పరిచయం ఏర్పడటం, ప్రేమలో పడటం జరిగిపోతాయి.

సీన్ కట్ చేస్తే... జాలీగా సాగిపోతున్న మాస్ లైఫ్ లోకి అనుకోకుండా శివకుమార్(సూర్య) ఎంట్రీ ఇస్తాడు. ఇక అక్కడి నుంచి మాస్ జీవితం పూర్తిగా మారిపోతుంది. తెలియకుండానే మాస్ పలు మర్డర్ కేసులు, రాబరీ కేసులలో ఇరుక్కుంటాడు. ఇక అక్కడి నుంచి ఏమయ్యింది? అసలు శివ ఎవరు? అసలు మాస్, శివలకు ఏంటి సంబంధం? శివ మనిషా లేక దెయ్యమా? ఈ సమస్యల నుంచి మాస్ ఎలా బయటపడ్డాడు? అనే పలు ఆసక్తికర విషయాలను తెలుసుకోవాలంటే వెండితెరపై ‘రాక్షసుడు’ సినిమా చూడాల్సిందే!

cinima-reviews
రాక్షసుడు

సూర్య నటించిన తాజా చిత్రం ‘మాస్’. ఈ చిత్రాన్ని తెలుగులో ‘రాక్షసుడు’ పేరుతో విడుదల చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సూర్య సరసన నయనతార, ప్రణీతలు హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే విడుదలైన తెలుగు వర్షెన్ పాటలు, ట్రైలర్లకు మంచి స్పందన వస్తోంది. యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా మే 29న భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ చిత్రం ఎలాంటి విజయం సాధించనుందో తెలుసుకుందామా..

Cinema Review

ప్లస్ పాయింట్స్:

ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ సూర్య. మాస్, శివ అనే రెండు విభిన్న పాత్రలలో సూర్య తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు. మాస్ పాత్రలో పూర్తిగా మాస్ లుక్, శివ పాత్రలో చాలా స్టైలిష్ గా కనిపించాడు. ఇక సూర్య ఫ్రెండ్ పాత్రలో నటించిన ప్రేమ్ జీ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇక నయనతార లుక్స్ పరంగా బాగుంది. అందమైన ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకుంది. ఇక ప్రణీత చేసింది చిన్న పాత్రే అయినప్పటికీ చాలా చక్కగా నటించింది. బ్రహ్మానందం కామెడీ బాగుంది. మిగతా నటీనటులు వారి వారి పాత్రల మేరకు బాగానే నటించారు. సినిమా పరంగా చూస్తే... ఫస్ట్ హాఫ్ మొదటి 30 నిమిషాలు సూపర్బ్. అలాగే ఇంటర్వెల్ ఎపిసోడ్ లో వచ్చే శివ ట్విస్ట్ బాగుంది. సినిమాలో వచ్చే పలు ట్విస్టులు, థ్రిల్స్ చాలా బాగున్నాయి.

మైనస్ పాయింట్స్:

సినిమా ప్రారంభమైన మొదటి 30 నిమిషాల తర్వాత చాలా స్లోగా సాగుతుంది. కథలో కొన్ని కొన్ని ట్విస్టులు వున్నప్పటికీ చాలా సన్నీవేశాలు కూడా బోర్ ఫీలయ్యేలా వుంటాయి. ఇక రివెంజ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ చిత్రంలో స్ర్కీన్ ప్లే మ్యాజిక్ అంతగా పనిచేయలేదు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చాలా సింపుల్ వుండటంతో... చూసే ప్రేక్షకులకు ఇంతేనా అనే ఫీల్ కలుగుతుంది. మాములు ప్రేక్షకులు కోరుకునే ఎంటర్ టైన్మెంట్ వాల్యూస్ చాలా తక్కువ.

సాంకేతికవర్గ పనితీరు:

ఈ సినిమాకు కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వ భాధ్యతలను చేపట్టిన వెంకట్ ప్రభు దర్శకుడిగా తన ప్రతిభ చూపించాడు. కానీ.. కథ, స్ర్కీన్ ప్లే విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. రాజశేఖర్ అందించిన సినిమాటోగ్రఫి బాగుంది. విజువల్స్ పరంగా చాలా చక్కగా చూపించాడు. ఇక యువన్ శంకర్ రాజా అందించిన పాటలు పర్వాలేదనిపించినా... బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బాగుంది. ఎడిటింగ్ లో మరింత దృష్టి పెట్టి వుంటే బాగుండేది. ఇక నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా:
రాక్షసుడు: సూర్య మ్యాజిక్ చేయలేకపోయాడు.