Hero Ram Latest Movie pandaga chesko telugu movie review | Rakul Preet | Sonal Chauhan

Teluguwishesh పండగ చేస్కో పండగ చేస్కో Get information about Pandaga Chesko Telugu Movie Review, Pandaga Chesko Movie Review, Ram Pandaga Chesko Movie Review, Pandaga Chesko Movie Review And Rating, Pandaga Chesko Telugu Movie Talk, Pandaga Chesko Telugu Movie Trailer, Ram Pandaga Chesko Review, Pandaga Chesko Telugu Movie Gallery and more Product #: 64673 2.75 stars, based on 1 reviews
  • చిత్రం  :

    పండగ చేస్కో

  • బ్యానర్  :

    యునైటెడ్ మూవీస్

  • దర్శకుడు  :

    గోపిచంద్ మలినేని

  • నిర్మాత  :

    పరుచూరి కిరిటీ

  • సంగీతం  :

    ఎస్.ఎస్.థమన్

  • సినిమా రేటింగ్  :

    2.752.75  2.75

  • ఛాయాగ్రహణం  :

    సమీర్ రెడ్డి

  • ఎడిటర్  :

    గౌతం రాజు

  • నటినటులు  :

    రామ్, రకుల్ ప్రీత్ సింగ్, సోనాల్ చౌహాన్ తదితరులు

Ram Pandaga Chesko Telugu Movie Review

విడుదల తేది :

2015-05-29

Cinema Story

పోర్చుగల్ లోని ఓ పెద్ద బిజినెస్ మెన్ కార్తీక్(రామ్). అక్కడే వుండే మరో పెద్ద బిజినెస్ వుమెన్ అనుష్క(సోనాల్ చౌహాన్)తో  కార్తీక్ కి పరిచయం ఏర్పడుతుంది. అది పెళ్లికి దారితీస్తుంది. తమ బిజినెస్ లు మరింతగా విస్తరించుకోవాలనే వుద్దేశ్యంతో ఇద్దరూ కూడా పెళ్లికి అంగీకరిస్తారు. ఇదే సమయంలో హైదరాబాద్ లోని తన ఫ్యాక్టరీ ఓ కేసులో ఇరుక్కుందని తెలిసి.. కార్తీక్ నగరానికి వస్తాడు. అతని ఫ్యాక్టరీ ఓ కేసులో ఇరుక్కోవడానికి కారణం దివ్య(రకూల్ ప్రీత్ సింగ్). దివ్య పాత్ర కాస్త ఆసక్తికరంగా వుంటుంది.

దివ్య తన మేనమామ సాయిరెడ్డి(సాయికుమార్) దగ్గరే పెరిగినప్పటికీ... ఆమె పెళ్లి బాధ్యతలను మాత్రం దివ్య తండ్రి భూపతి(సంపత్)కే అప్పగిస్తుంది కోర్టు. అయితే సాయిరెడ్డి మాత్రం దివ్య పెళ్లి కూడా తానే చేయాలనుకుంటాడు. ఇలా వీరిద్దరి మధ్య పెళ్ళిగొడవలు సాగుతుండగా.. దివ్య పెళ్లి కోసం కార్తీక్ ను సెలెక్ట్ చేస్తాడు భూపతి. అసలు హైదరాబాద్ లో వున్న కార్తీక్ ఫ్యాక్టరీ కేసుల్లో పడటానికి దివ్య ఎందుకు కారణమవుతుంది? భూపతికి సడెన్ కార్తీక్ ఎలా దొరికాడు? కార్తీక్, భూపతిలకు మధ్య సంబంధం ఏంటీ? మరి అనుష్క, కార్తీక్ ల పెళ్లి ఏమయ్యింది? అనే ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే వెండితెర మీద ‘పండగచేస్కో’ సినిమా చూడాల్సిందే!

cinima-reviews
పండగ చేస్కో

దర్శకుడు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘పండగ చేస్కో’. రామ్, రకుల్ ప్రీత్ సింగ్, సోనాల్ చౌహాన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. కమర్షియల్ యాక్షన్ లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని యునైటెడ్ మూవీస్ బ్యానర్లో నిర్మాత పరుచూరి కిరిటీ నిర్మిస్తున్నారు. గతకొన్నాళ్ల నుంచి సక్సెస్ లభించక సతమతమవుతున్న హీరో రామ్ కి ఈ చిత్రం విజయాన్ని అందిస్తుందో.. లేదో.. వేచి చూడాల్సిందే

Cinema Review

ప్లస్ పాయింట్స్:

ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ కామెడీ, కుటుంబ సంబంధాల సెంటిమెంట్. సినిమా మొత్తం ఎంటర్ టైనింగ్ గా సాగుతుంది. ఇక నటీనటుల విషయానికొస్తే.. రామ్ తన పాత్రకు సరైన న్యాయం చేశాడు. బిజినెస్ మాన్ కు వుండాల్సిన పొగరు, స్టైలిష్ పాత్రలో అదరగొట్టడంతోపాటు తర్వాత సెకండ్ హాఫ్ లో మరో సాధారణ వ్యక్తిగా రామ్ చాలా చక్కగా నటించాడు. ఇక రకూల్ ప్రీత్ సింగ్ హాట్ హాట్ అందాల ప్రదర్శన చేస్తూ.. దివ్య పాత్రకు రకూల్ పూర్తి న్యాయం చేసింది. మరో హీరోయిన్ సోనాల్ చౌహన్ తన పాత్ర మేరకు బాగానే నటించింది. గ్లామర్ ఒలకబోయడంలో ఒకరికొకరు పోటీపడ్డారని చెప్పుకోవచ్చు. ఇక రామ్-రకూల్ ల మధ్య వచ్చే సన్నీవేశాలు, అలాగే రామ్-సోనాల్ ల మధ్య వచ్చే సన్నీవేశాలు చాలా బాగా ఆకట్టుకుంటాయి.

వీకెండ్ వెంకట్రావు పాత్రలో బ్రహ్మానందం తనదైన శైలిలో కామెడీతో తెగ నవ్వించేసాడు. ఇక సాయికుమార్, సంపత్... ఇలా చెప్పుకుంటే.. సినిమా అంతా కూడా చాలామంది నటీనటులు, రకరకాల పాత్రలతో గోలగోలగా, సందడిగా వుంటుంది. ‘పండగ చేస్కో’ సినిమా అంతా కూడా ఫస్ట్ హాఫ్ కామెడీ ఎంటర్ టైనర్ తో సాగితే... సెకండ్ హాఫ్ ఫ్యామిలీ సెంటిమెంట్, ఎమోషన్స్ తో కొనసాగుతుంది.

మైనస్ పాయింట్స్:

నటీనటుల పరంగా పెద్దగా మైనస్ పాయింట్లు ఏం లేవు కానీ.. హీరోయిన్ సోనాల్ చౌహాన్ పాత్ర విషయంలో మరింత బాగా తీర్చిదిద్దితే బాగుండేది. అలాగే మరికొన్ని పాత్రలకు సరైన జస్టిఫికెషన్ లేనట్లుగా అనిపిస్తోంది. ఇక సినిమాకు మేజర్ మైనస్ పాయింట్స్ కథ, స్ర్కీన్ ప్లే. ఎందుకంటే... ఇలాంటి కథలతో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం ఎంటర్ టైనింగ్ గా సాగడం, సెకండ్ హాఫ్ ఫ్యామిలీ సెంటిమెంట్ లోకి షిఫ్ట్ అవ్వడం, కుటుంబ సంబంధాలు, వారి మధ్య వుండే తగాదాలను పరిష్కరించడం అనే ఫార్ములాతో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయి. పాత కథకే రంగులేసి, కాస్త కామెడీ అద్ది జనాల మీదకు వదిలినట్లుగా అనిపిస్తోంది.

సాంకేతికవర్గ పనితీరు:

ఈ చిత్రాన్ని అందంగా చూపించిన సినిమాటోగ్రఫి చాలా బాగుంది. అటు పోర్చుగల్ అందాలను, ఇటు బొబ్బిలి ప్రాంతాలను చాలా చక్కగా, అందంగా చూపించాడు. థమన్ అందించిన పాటలు శరా మాములే. అయితే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపించాడు. ఎడిటింగ్ పర్వాలేదు. కానీ సెకండ్ హాఫ్ లో మరింత ఎడిటింగ్ చేసుంటే బాగుండేది. ఇక కోన వెంకట్ డైలాగ్స్ బాగున్నాయి. దర్శకుడిగా గోపిచంద్ మలినేని మరోసారి తానేంటో నిరూపించుకున్నాడు. కానీ కథ, స్ర్కీన్ ప్లే విషయంలో మాత్రం ఫెయిల్ అయ్యాడనే చెప్పుకోవచ్చు. నిర్మాత పరుచూరి కిరిటీ నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. సినిమాను చాలా గ్రాండ్ గా నిర్మించారు.

చివరగా:
పండగ చేస్కో: రొటీన్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్