Teluguwishesh చిన్నదాన నీకోసం చిన్నదాన నీకోసం Get Chinnadana Nee Kosam Movie Review, Chinnadana Nee Kosam Telugu Movie Review, Chinnadana Nee Kosam Movie Ratings, Nitin Chinnadana Nee Kosam Movie Review, Mishti Chakraborty Chinnadana Nee Kosam Movie Review Product #: 59330 2.5 stars, based on 1 reviews
  • చిత్రం  :

    చిన్నదాన నీకోసం

  • బ్యానర్  :

    శ్రేష్ట్ మూవీస్

  • దర్శకుడు  :

    కరుణాకరణ్

  • నిర్మాత  :

    నిఖితా రెడ్డి, సుధాకర్ రెడ్డి

  • సంగీతం  :

    అనూప్ రూబెన్స్

  • సినిమా రేటింగ్  :

    2.52.5  2.5

  • ఛాయాగ్రహణం  :

    ఐ.ఆండ్రూ

  • ఎడిటర్  :

    ప్రవీణ్ పూడి

  • నటినటులు  :

    నితిన్ (హీరో), మిస్ర్తీ ( హీరోయిన్) నరేష్, నాజర్ తదితరులు

Chinnadana Nee Kosam Movie Review

విడుదల తేది :

2014-12-25

Cinema Story

బాగా డబ్బున్న నితిన్ (నితిన్) ఓ సారి ఓ అమ్మాయిని కాపాడి హైదరాబాద్ లో పాపులర్ అయిన రెడ్డి(నాజర్)కు శ్రేయోభిలాషి అవుతాడు. ఓ సారి నందిని(మిస్తీ)ని చూసి ప్రేమలో పడతాడు. నందిని నితిన్ ను ప్రేమించకపోయినా.., రెడ్డికి దగ్గరివ్యక్తి అని తెలిసి స్నేహం చేస్తుంది. అయితే ఇప్పటి స్నేహం రేపటి ప్రేమగా మారుతుందని నితిన్ భావించి ఊహల్లో ఉండగానే.., రెడ్డితో నందిని బార్సిలోనా వెళ్తుంది. ఈ షాక్ నుంచి కోలుకున్న నితిన్ కూడా అమ్మాయి ఉన్న దేశానికి వెళ్తాడు. అక్కడ నితిన్ కు మరో షాక్ తగులుతుంది. నందిని బార్సిలోనా ఎందుకు వెళ్ళింది?, రెడ్డితో ఆమెకు ఉన్న సంబంధం ఏమిటి?, చివరకు నందిని ఎలా నితిన్ ను ప్రేమిస్తుంది అనేది థియేటర్ లో చూడండి.

cinima-reviews
చిన్నదాన నీకోసం

ఫస్ట్ ఆఫ్ లో లవ్, యాక్షన్ సినిమాలు తీసి కాస్త గ్యాప్ తీసుకున్న నితిన్.., సెకండ్ ఆఫ్ లో అన్ని లవ్ సినిమాలనే ఎంచుకుంటున్నాుడు. ఆ కోవలోనే ‘చిన్నదాన నీకోసం’ సినిమాలో నటించాడు.కరుణాకరణ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘ఇష్క్’, ‘గుండెజారి గల్లంతయిందే’ తర్వాత నితిన్ కాంబినేషన్ తో శ్రేష్ట్ మూవీస్ నిర్మించిన మూడవ సినిమా ఇది. మిస్తీ ఈ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అవుతోంది. ప్రేమ కథా సినిమాలకు ట్రేడ్ మార్కులా ఉండే కరుణాకరన్ తీసిన ‘చిన్నదాన నీకోసం’ ఎలా ఉందో చూద్దాం.

Cinema Review

ప్లస్ పాయింట్స్ :

లవర్ బాయ్ సినిమాలు అలవాటున్న నితిన్ ఈ మూవీలో మరింత బాగా నటించాడు. గతంతో పోలిస్తే నటన, డాన్స్ కాస్త ఇంప్రూవ్ అయింది. టాలీవుడ్ లో తొలి సినిమాతోనే మిస్తీ ఆకట్టుకుంది. ట్రెడిషనల్, మోడ్రన్ డ్రస్సుల్లో ఆకట్టుకుంది. హీరో-హీరోయిన్ మద్య కెమిస్ట్రి బాగుంది. నితిన్ తండ్రిగా నరేష్ పాత్ర, తాగుబోతు రమేష్ నటన బాగుంది. నాజర్ సహా మిగతా నటీనటులు పాత్రలకు న్యాయం చేశారు. సినిమా పాటలతో పాటు, విజువలైజేషన్ బాగుంది. సినిమాటోగ్రఫీ గ్రాండ్ లుక్ తో ఆకట్టుకుంటోంది.

మైనస్ పాయింట్స్ :

ఈ మూవీకి సెకండ్ ఆఫ్ మైనస్. ఇంటర్వల్ తర్వాత ఏదేదో ఊహించుకుని వచ్చిన ప్రేక్షకులను సెకండ్ ఆఫ్ నిరాశ పరుస్తుంది. సెకండ్ ఆఫ్ లో చెప్పాల్సిన కథ పెద్దగా లేకపోవటంతో బాగా సాగదీశాడు. సినిమాలో ఏదో చూపించాలనే కాన్సెప్టు మైండ్ లో పెట్టుకుని కథను సొంతంగా చెడగొట్టుకున్నారు. గే కామెడి చిరాకుపెడుతుంది. కథ అంతగా ఆసక్తి కల్గించదు. కొత్తదనం తక్కువగా ఉండటంతో తర్వాతి సీన్ ఏమిటో చెప్పేయవచ్చు.

కళాకారుల పనితీరు :

ప్రేమకథా సినిమాలు తీయటంలో నిపుణుడు అన్పించుకున్న కరుణాకరన్ పై పెట్టుకున్న ఆశలను నెరవేర్చలేకపోయాడు. గత సినిమాల్లో ఏదో ఒక కొత్తదనం చూపే ఆయన ఈ మూవీలో ఏది చూపలేకపోయాడు. హీరోయిన్ ఇంట్రడక్షన్ కూడా గత సినిమాలతో పోలిస్తే బాగోలేదు. ముఖ్యంగా సెకండ్ ఆఫ్ ను చాలా చెడగొట్టాడు. ఇదే సినిమాకు పెద్ద మైనస్ పాయింట్ గా మిగిలింది. ఇక ప్రేక్షకులు స్క్రీన్ వైపే చూసేలా చేసిన క్రెడిట్ సినిమాటోగ్రాఫర్ కు దక్కింది. ప్రతిసీన్ ను చాలా గ్రాండ్, బ్యూటిఫుల్ లుక్ తో చూపించాడు. ఇక సంగీతం కూడా బాగుంది. పాటలకు గతంలోనే హిట్ టాక్ వచ్చింది. సినిమాలో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. హర్షవర్ధన్ డైలాగ్స్ బాగున్నాయి. ఎడిటర్ ప్రవీణ్ సెకండ్ ఆఫ్ పై కేర్ తీసుకుని ఉండాల్సింది. శ్రేష్ట్ మూవీస్ నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

చివరగా : ఫస్ట్ ఆఫ్ ఎంజాయ్ చేయాలి.. సెకండ్ ఆఫ్ భరించాలి.

 

కార్తిక్

Movie TRAILERS

చిన్నదాన నీకోసం

play