Teluguwishesh రౌడీ రౌడీ Rowdy Telugu Movie Review, Rowdy Telugu Movie Review and Rating, Rowdy Movie Review, Mohan Babu Rowdy Movie Review, Rowdy Review, Rowdy Rating, Rowdy Telugu Movie Stills, Rowdy Telugu Movie Trailers, Videos, Rowdy Telugu Movie Songs, Rowdy Telugu Movie Wallpapers, Rowdy Telugu Movie Posters and more on teluguwishesh.com Product #: 51476 2.5/5 stars, based on 1 reviews
  • చిత్రం  :

    రౌడీ

  • బ్యానర్  :

    24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, ఎవి పిక్చర్స్.

  • దర్శకుడు  :

    రామ్ గోపాల్ వర్మ

  • నిర్మాత  :

    ఆర్.విజయ్ కుమార్, పి.గజేంద్ర నాయుడు, ఎమ్.పార్థసారథి నాయుడు

  • సంగీతం  :

    సాయి కార్తిక్

  • సినిమా రేటింగ్  :

    2.5/52.5/5  2.5/5

  • ఛాయాగ్రహణం  :

    సతీష్ ముత్యాలా

  • నటినటులు  :

    మోహన్ బాబు, విష్ణు, జయసుధ, శాన్వీ.

Rowdy Movie Review

విడుదల తేది :

April 4th, 2014

Cinema Story

అమెరికాలో 3 వ తేదీ రాత్రి 8.00 గంటలకు, భారత్ లో 4 వ తేదీ ఉదయం 9.30 కి విడుదలైన రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన రౌడీ చిత్రం మోహన్ బాబు వర్మల కాంబినేషన్ తో తయారైన మొదటి సినిమా కావటం విశేషం. సర్కార్, గాడ్ ఫాదర్, నాయకుడులాగానే ఉండకుండా ఈ సినిమాకు ప్రాంతీయ రంగును అద్దటం కోసం రాయలసీమ నేపథ్యంలో సాగిన కధగా మలిచారు దర్శకుడు వర్మ.

 

"అన్నగారు" గా అందరికీ న్యాయం చెయ్యటం కోసం చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకునే మంచి రౌడీ పాత్రలో మోహన్ బాబు ధనం కంటే మానమే ముఖ్యమని నమ్మే పెద్ద మనిషిగా రెస్పెక్ట్ నే కోరుకుంటాడు దానికే విలువిస్తాడు కానీ ఇతరులు ఆశ చూపే డబ్బుకి కాదు. సర్కార్ లో లాగానే అన్నగారి పెద్ద కొడుకు విప్లవభావాలతో ఉంటాడు, చిన్న కొడుకు విధేయుడిగా మెలుగుతుంటాడు. 30, 40 గ్రామాలకు కీడు చేసే నందనవనం ప్రాజెక్ట్ చేపట్టి డబ్బు మూటగట్టుకునే ఆఫర్ తో వచ్చినవారికి వ్యతిరేకంగా ఆ గ్రామాల సంక్షేమంలో పోరాటం సాగిస్తాడు అన్నగారు మోహన్ బాబు. వాళ్ళంతా అన్నగారి ముందు బలహీనులే కానీ, అన్నగారి బలహీనతైన సంబంధీకులతో ఉన్న బంధాన్ని వాళ్ళు వాడుకుంటారు. ఆయన కుటుంబీకులకు ఆశచూపుతారు. పోరాటంలో ఎవరు నెగ్గుతారు, ఎలా నెగ్గుతారన్న వివరాలు దృశ్యరూపంలో సినిమా థియేటర్ లో చూస్తేనే ఎక్కువ ఆనందం కలుగుతుంది.

 

 

 

 

cinima-reviews
రౌడీ

హీరో స్థాయిని ప్రేక్షకుల మదిలో పెంచేయటం కోసం అమ్మోరుని మించిన అయ్యవు నీవు లాంటి పాటలు, యాక్షన్ సన్నివేశాలతో పాటు సెంటిమెంట్ ని కూడా పండించటానికి మోహన్ బాబు, జయసుధలకు షష్టి పూర్తి లాంటి సన్నివేశాలను కూడా చిత్రీకరించటం జరిగిందీ చిత్రంలో. ముందుగానే ప్రచారంలోకి వచ్చిన 11 నిమిషాల యాక్షన్ సన్నివేశం రౌడీలతో మోహన్ బాబు, విష్ణులు చేసిన పోరాటం ఆసక్తి కరంగా ఉత్కంఠ భరితంగా సాగింది. యాక్షన్ సీన్లన్నీ చక్కగా పండాయనే చెప్పుకోవచ్చు. అయితే, సర్కార్, సర్కార్ రాజ్, గాడ్ ఫాదర్ లాంటి సినిమాలను చూసిన తర్వాత అదే విధంగా ఉన్న కథలో రసాస్వాదం కొరవడటం సహజమే. అన్నగారి ఇంట్లో విషాదం, కొత్త డాన్ అవతారంలో విష్ణు వచ్చిన తర్వాత సాగిన క్లైమాక్స్ లోని దృశ్యాలను ఇంకా బాగా తీస్తే బాగుండేదేమో అనిపిస్తుంది.

 

 

 

 

Cinema Review

కళాకారులందరూ బాగా చేసారనేదానికంటే, రామ్ గోపాల్ వర్మ వాళ్ళ నుంచి నటనను పూర్తిగా పిండుకున్నారని చెప్పుకుంటేనే సరిగా ఉంటుంది. సినిమా మొత్తంలో మోహన్ బాబు తన నటజీవితంలోనే విభిన్న మైన పాత్రలో అందరినీ ఆకట్టుకున్నారనటంలో సందేహం లేదు. జయసుధ తనకిచ్చిన మేరకు చక్కగా నటించినా ఆమెను కాని, హీరోయిన్ శాన్విని కాని పూర్తిగా ఉపయోగించలేదేమో అనిపిస్తుంది. విష్ణుని చూస్తే సర్కార్ లో అభిషేక్ బచ్చన్ గుర్తుకొస్తాడు. డైలాగ్స్, ఫైటింగ్స్, కథాగమనం చాలా బావుంది. ఇంటర్వెల్ తర్వాత కథలో కాస్తంత పట్టు తప్పుతున్నట్లనిపించినా, యాక్షన్ సీన్లు వాటిని కవర్ చేసాయి.

చివరి మాట..

మోహన్ బాబు, వర్మల గొప్ప అభిమానులైతే తప్ప ప్రేక్షకులకు ముఖ్యంగా గాడ్ ఫాదర్, సర్కార్, నాయకుడు చూసినవాళ్ళకి ఈ సినిమాలో కొత్తగా ఆశించదగ్గదేమీ ఉండదు.

-శ్రీజ