Teluguwishesh లెజెండ్ లెజెండ్ Legend Telugu Movie Review, Balakrishna Legend Movie Review, Legend Movie Review, Legend Telugu Movie Review and Rating, Legend Review, Legend Rating, Legend Movie Trailer, Teaser, Video, Legend Movie Stills, Wallpapers, Gallery, Legend Audio Launch Stills, Legend Movie songs and more on teluguwishesh.com Product #: 51282 3.5/5 stars, based on 1 reviews
 • చిత్రం  :

  లెజెండ్

 • బ్యానర్  :

  వారాహి చలన చిత్రం సమర్పణలో 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్

 • దర్శకుడు  :

  బోయపాటి శ్రీను

 • నిర్మాత  :

  రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర

 • సంగీతం  :

  దేవిశ్రీ ప్రసాద్

 • సినిమా రేటింగ్  :

  3.5/53.5/53.5/5  3.5/5

 • ఛాయాగ్రహణం  :

  కోటగిరి వెంకటేశ్వరరావు

 • ఎడిటర్  :

  చంద్రశేఖర్ రావిపాటి

 • నటినటులు  :

  బాలకృష్ణ , రాధికా ఆప్టే-సోనాల్ చౌహాన్ లు

Legend Movie Review

విడుదల తేది :

Mar 28, 2014

Cinema Story

బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్వకత్వంలో వారాహి చలన చిత్రం సమర్పణలో 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై రామ్ ఆచంట నిర్మిస్తున్న చిత్రం లెజెండ్. ఈ చిత్రానికి సాయికొర్రపాటి సమర్పకులు. బాలకృష్ణ సరసన రాధికా ఆప్టే-సోనాల్ చౌహాన్ లు నాయికలుగా నటిస్తున్నారు.

 

ఒక పెద్ద కుటుంబంలో పుట్టిన సిద్ధార్థ్ (బాలకృష్ణ) విదేశాల్లో చదువుకుని అక్కడే ఉద్యోగం చేసుకుంటుంటాడు. అయితే అతను వైజాగ్ కు చెందిన ఒకమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమెను కోసం వైజాగ్ వస్తాడు. వైజాగ్ లో ఉన్న రాజకీయ నాయకుడు జితేందర్ (జగపతిబాబు) కొడుకును కొట్టడంతో సిద్ధార్థ్ కు జితేందర్ కు శత్రుత్వం మొదలవుతుంది.

 

జితేందర్ సిద్ధర్థ్ కోసం వెతకడం మొదలు పెడతాడు. ఈ క్రమంలో అనేక ప్రయత్నాల తర్వాత అతని ఆచూకి దొరుకుతుంది. కుటుంబంతో కలిసి సిద్ధార్థ్ జితేందర్ కంట పడతాడు. ఆ కుటుంబాన్ని మొత్తాన్ని జితేందర్ చంప బోతుండగా అడ్డుపడతాడు జైదేవ్.జైదేవ్ ఎవరనేది జితేందర్ తో అతనికి ఉన్న సంబంధేమేంటి జితేందర్ తో పోరాటంతో అతనెలా గెలిచాడు అన్నది కథ.

cinima-reviews
లెజెండ్

లెజెండ్‌’ ఫస్ట్‌లుక్‌తోనే నందమూరి అభిమానుల మరియు ప్రేక్షకుల మనసు దోచాడు. కేవలం మూడు డైలాగ్స్‌తో సినిమా ఎలా ఉంటుందో చెప్పకనే చెప్పాడు. ఈ చిత్రం ఆడియో సందర్బంగా విడుదలయిన ట్రైలర్‌ సినిమాపై అప్పటి వరకు ఉన్న అంచనాలను పదింతలు చేసింది. సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూశారు. వారి ఎదురు చూపులకు తగ్గట్లుగానే ఈ చిత్రం ఉంది.

ట్రైలర్‌లో చూపించినట్లుగానే సినిమా మొత్తం బాలయ్య పవర్‌ ఫుల్‌ డైలాగ్స్‌తో అభిమానులతో కేకలు పెట్టించాడు. బాలయ్య రెండు పాత్రల్లో కూడా అద్బుత నటనను కనబర్చి ఆకట్టుకున్నాడు. ఇక విలన్‌గా జగపతి బాబును తీసుకోవడం సినిమాకే హైలైట్‌గా ఉంది. కొన్ని రాజకీయ డైలాగ్స్‌ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. తనకే సాధ్యం అనిపించేలా బాలయ్య డైలాగ్‌ డెలవరి ఉంది. దర్శకుడు బోయపాటి బాలయ్యను రెండు పాత్రల్లో కూడా పవర్‌ఫుల్‌గా ప్రజెంట్‌ చేశాడు. మొత్తంగా ఈ చిత్రం నందమూరి అభిమానులకు విందు బోజనంలా ఉంది.

Cinema Review

నందమూరి అభిమానులు భావించినట్లుగానే ఈ చిత్రంలో తన నటన విశ్వరూపంను బాలకృష్ణ చూపించాడు. రెండు పాత్రల్లో నటించిన బాలయ్య రెండు పాత్రల్లో కూడా అద్బుత నటనను కనబర్చి ఆకట్టుకున్నాడు. తనదైన డైలాగ్‌ డెలవరితో అభిమానులను సీట్టలో కూర్చోకుండా చేశాడు. బాలయ్య ఒక్కొ డైలాగ్‌కు నందమూరి అభిమానులు పరవశించి పోతున్నారు. డ్యాన్స్‌ల్లో కూడా బాలయ్య తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు. ఇక యాక్షన్‌ సన్నివేశాల్లో, ఎమోషనల్‌ సన్నివేశాల్లో బాలయ్య నటన అద్బుతంగా ఉంది.

పవర్‌ ఫల్‌ బాలయ్యకు ఒక పవర్‌ఫుల్‌ విలన్‌ జగపతి బాబు రూపంలో దొరికాడు. ‘లెజెండ్‌’కు గట్టి పోటీ ఇచ్చాడు జగపతి బాబు. ఈయ న హీరోగానే కాదు విలన్‌గా కూడా మెప్పించగలను అని ప్రూవ్‌ చేశాడు. పక్కా విలనిజంతో జగపతి కల్లతోనే కోపంను పలికించి ఆకట్టుకున్నాడు.

ఇక హీరోయిన్‌ సోనాల్‌ చౌహాన్‌ తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. నటనలో కూడా మెప్పించింది. అయితే డ్యాన్స్‌లో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. మరో హీరోయిన్‌ రాధిక ఆప్టే పాత్ర నిడివి తక్కువగా ఉంది. అయితే ఉన్నంతలో ఆకటుకుంది. మాణిక్యంగా బ్రహ్మానందం నవ్వించే ప్రయత్నం చేశాడు. ఈ చిత్రంలో ఎంతో మంది ప్రముఖ నటీనటులు ఉన్నారు. అయితే అందులో కొందరి పాత్రకు నిడివి తక్కువ ఉంది, మరి కొందరి పాత్రకు ప్రాముఖ్యం లేదు. మొత్తంగా వారి వారి పాత్రలకు ఈ చిత్రంలో నటించిన వారు న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం

‘సింహా’ చిత్రం తర్వాత బాలయ్యతో బోయపాటి సినిమా అనగానే అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగానే ఈ చిత్రం తెరకెక్కించాడు బోయపాటి శ్రీను. తనదైన దర్శకత్వ స్టైల్‌ ఉన్న బోయపాటి ఈ చిత్రంతో నందమూరి అభిమానులను ఫుల్‌గా సంతోష పెట్టాడు. తమ అభిమాన హీరో నుండి ఏదైతే ఆశించారో అభిమానులకు అదే ఇచ్చాడు బోయపాటి. కథ, కథనంలో కూడా ఆకట్టుకున్నాడు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం ఆకట్టుకునే విధంగా ఉంది.

నేపథ్య సంగీతం చాలా బాగా వచ్చింది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్‌ ఇంకా చేయాల్సి ఉంది. కొన్ని అనసర సన్నివేశాలతో పాటు, కొన్ని సీన్స్‌ లెంగ్త్‌ ఎక్కువ అయ్యాయి. రెండు ప్రముఖ నిర్మాణ సంస్థలు ఈ చిత్రంను నిర్మించడంతో ఈ చిత్రం నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి

ప్లస్ పాయింట్స్ :

‘లెజెండ్’ సినిమాకి వన్ అండ్ ఓన్లీ హీరో మరియు బిగ్గెస్ట్ ప్లస్ అంటే అది నందమూరి బాలకృష్ణ మాత్రమే… బాలకృష్ణ పెర్ఫార్మన్స్, ఎమోషన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఆడియన్స్ ని కట్టి పడేస్తాయి. రెండు పాత్రల్లో మూడు విభిన్న గెటప్స్ లో బాలకృష్ణ చూపించిన వైవిధ్యానికి ఆయనకి హ్యాట్సాఫ్ చెప్పాలి. ముఖ్యంగా చాలా రియలిస్టిక్ గా కనిపించే జయదేవ్ పాత్రలో అతని పెర్ఫార్మన్స్ చాలా పవర్ఫుల్ గా ఉంది. కృష్ణ గా కూడా మంచి నటనని కనబరిచాడు.

ముఖ్యంగా ఈ వయసులో కూడా అయన వేసిన డాన్సులు అభిమానులని బాగా అలరించాయి. నెగటివ్ షేడ్స్, అహం ఉన్న స్టైలిష్ విలన్ పాత్రలో జగపతి బాబు నటన బాగుంది. జగపతి బాబు బాలకృష్ణకి గట్టి పోటీనే ఇచ్చారని చెప్పాలి.

సెకండాఫ్ లో వచ్చిన రాధిక ఆప్టే ఎక్కువ సేపు ఉండకపోయినా ఉన్నంత వరకూ తన పాత్రకి న్యాయం చేసింది. ఫస్ట్ హాఫ్ లో కనిపించిన సోనాల్ చౌహాన్ కి నటన పరంగా చేయడానికి ఏమీ లేకపోయినా బాగా గ్లామరస్ గా కనిపించి అందరినీ ఆకట్టుకుంది. సుమన్, సుహాసిని, సితార తదితరులు తమ పరిధి మేర నటించారు. మహిళలపై షూట్ చేసిన సీన్స్ మరియు కొన్ని సెంటిమెంట్ సీన్స్ మహిళా ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటాయి.

ఈ సినిమాకి ప్రధాన హైలైట్ సెకండాఫ్. సెకండాఫ్ లో జయదేవ్ పాత్ర ప్రేక్షకులని ఆద్యంతం ఆకట్టుకుంటుంది. అలాగే బాలకృష్ణ డైలాగ్స్ కి చాలా బాగున్నాయి. సెకండాఫ్ లో బాలకృష్ణ – జగపతి బాబు ఒకరితో డీ కొట్టాలనుకునే సీన్స్ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ చాలా బాగుంది. అలాగే ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఎత్తైతే ఇంటర్వల్ ఎపిసోడ్ మాత్రం ఒక ఎత్తు. ఆ ఎపిసోడ్ థియేటర్ లో చూస్తున్న ఆడియన్స్ ని ఒక రేంజ్ కి తీసుకెళుతుంది. బాలకృష్ణ ఎలివేషన్ సీన్స్ కి దేవీశ్రీ ప్రసాద్ సూపర్బ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించాడు.

మైనస్ పాయింట్స్ :

థ్రిల్స్ మాణిక్యంగా వచ్చే బ్రహ్మానందం పాత్రని కాస్త కట్ చేసి ఉంటే బాగుండేది. ఎందుకంటే ఆయన పాత్ర పెద్దగా నవ్వు తెప్పించకపోగా కథని సాగదీసినట్టు ఉంటుంది. దానివల్ల ఫస్ట్ హాఫ్ అక్కడక్కడా బాగా స్లో అయినట్టు అనిపిస్తుంది. సినిమా అంతా ఓ రేంజ్ లో ఉన్నప్పుడు ఆడియన్స్ క్లైమాక్స్ పై కూడా ఆడియన్స్ కి అంచనాలుంటాయి. కానీ ఆ అంచనాలను అందుకునే రేంజ్ లో క్లైమాక్స్ లేకపోవడం చెప్పదగిన మైనస్ పాయింట్. హంసా నందిని ఐటెం సాంగ్ ఆడియన్స్ ని పెద్దగా ఆకట్టుకోలేదు.

చివరి మాట.. 

నందమూరి నటసింహం బాలకృష్ణ , బొయపాటి శ్రీను తెలుగు ప్రజలకు ఒక సమ్మర్  విందు ఇవ్వటం జరిగింది.