Teluguwishesh వీరుడొక్కడే వీరుడొక్కడే Veerudokkade Telugu Movie Review, Veerudokkade Movie Review, Ajith Veerudokkade Movie Review, Veerudokkade Movie Review and Rating, Veerudokkade Movie Stills, Veerudokkade Movie Wallpapers, Veerudokkade Movie Songs, Videos, Trailer and more on teluguwishesh.com Product #: 51162 2.5/5 stars, based on 1 reviews
  • చిత్రం  :

    వీరుడొక్కడే

  • బ్యానర్  :

    'శౌర్యం' ఫేమ్‌ విజయా ప్రొడక్షన్స్

  • దర్శకుడు  :

    శివ

  • నిర్మాత  :

    శ్రీనుబాబు

  • సంగీతం  :

    దేవిశ్రీప్రసాద్

  • సినిమా రేటింగ్  :

    2.5/52.5/5  2.5/5

  • నటినటులు  :

    అజిత్, తమన్నా

Veerudokkade Movie Review

విడుదల తేది :

Mar 21, 2014

Cinema Story

అజిత్ తన నలుగురు తమ్ముళ్ళతో పాటుగా, తనను నమ్మిన కుటుంబాన్ని ఎలా కాపాడాడు అన్న చిన్న అంశానికి యాక్షన్ మరియు ప్రేమ సమ్మిలితాలతో అల్లుకుని తెరకెక్కించిందే “వీరుడొక్కడే” కథ.

అజిత్ కు బాలా, విద్యార్థి, సుహాయిల్, మునిష్ లు నలుగురు అన్నదమ్ములు. తనకి తన తమ్ముల్లే ప్రపంచం. తమ్ముళ్ళ కోసం పెళ్లికుడా చేసుకోకుండా ఉంటాడు. తమ్ముళ్ళతో పాటుగా తనకు దగ్గరివారికి ఏ కష్టం వచ్చిన ఆదుకుంటూ ఉంటాడు. ఆక్రమంలో తనకు ఎదురయ్యే కేసులు వాదించడానికి సంతానం అనే లాయర్, సలహాలకు చిన్ననాటి స్నేహితుడు అక్కడి కలెక్టర్ సుబ్బులు తోడుగా ఉంటూ ఉంటారు.

అజిత్ తమ్ముళ్ళు ప్రేమలోపడి, తమ అన్నకు ఎలాగైనా పెళ్ళిచేసి, తాము ఒకింటి వాళ్ళం అవ్వాలని సంతానం, సుబ్బుల సలహాలతో.. తన అన్నకు ఒక అమ్మాయిని సెలెక్ట్ చేస్తారు. ఆ అమ్మాయే తమన్న. ఈ అమ్మాయి అయితేనే అన్నయ్యకి కరెక్ట్ అని వీళ్ళిద్దరిని కలపాలని ప్రయత్నిస్తుంటారు. అదే సమయంలో అక్కడ ప్రతి ఏడాది లాగే జరిగే యార్డ్ వేలంపాటలో ప్రదీప్ రావత్ కు పోటిగా అజిత్ నిలబడి గెలుస్తాడు.

అది తట్టుకోలేక ప్రదీప్ రావత్, అజిత్ ని, అతని తమ్ముళ్ళను చంపాలని ప్రయత్నిస్తుంటాడు. మొత్తానికి తమన్నతో ప్రేమలో పడిన అజిత్ వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడటానికి తమన్నతో కలిసి వెళ్తుండగా, వీళ్ళని చ౦పడానికి కొందరు ప్రయత్నిస్తుంటారు. అప్పుడు అజిత్ వాళ్ళని చ౦పడం దగ్గరగా చూసిన తమన్న, ఒక్కతే తన ఇంటికి వెళ్ళిపోతుంది.

తనమీద ఉన్న ప్రేమతో అజిత్ తమ్ముళ్ళతో కలిసి తమన్న వాళ్ళ ఇంటికి వెళ్తాడు. తమన్న తండ్రి నాజర్. వాళ్ళది రక్తపాతాలు వంటివి నచ్చని కుటుంబం. కానీ, నాజార్ వాళ్ళ ఇంటికి వచ్చాక, రౌడీలు తనను చంపడానికి రాలేదని, ఆఇంటి కుటుంబం మీద పగతో అతుల్ కులకర్ణి ఇదంతా చేయిస్తున్నాడని తెలుసుకుంటాడు.

ఇంతకీ అతుల్ కులకర్ణి కి, నాజర్ ఉన్న పగ ఏంటి.? రక్తపాతం అంటే నచ్చని కుటుంబం అజిత్ ప్రేమని ఒప్పుకుందా.? ఇతకి యార్డ్ లో అజిత్ ని చంపేయాలనుకున్న ప్రదీప్ రావత్ ఏమయ్యాడు..? అన్న ఇంట్రెస్టింగ్ థీంతో ముందుకు సాగే అంశాలని తెర మీద చూడాల్సిందే.

cinima-reviews
వీరుడొక్కడే

దర్శకుడు శివ, అంతకుముందు వచ్చిన కొన్ని సినిమాలని కలిపి ఒక కొత్తకథలా మలచడానికి ప్రయత్నించాడు. చిత్రం ఆపర్యాంతం యాక్షన్ దృష్టిలోనే చూపించాలనుకున్న దర్శకుడు, తెరమీద హీరో కనపడిన ప్రతీసారి పవర్ ఫుల్ డైలాగ్ కానీ, పోరాట సన్నివేశ౦ కానీ ఉండేలా చూపారు. సెంటిమెంట్ మాటలకు మాత్రమే పరిమితం అయ్యింది. కమెడియన్ సంతానం నుండి హాస్యాన్ని రాబట్టడంలో మాత్రం విజయం పొందారు దర్శకుడు శివ.

Cinema Review

ఈ చిత్రంలోని కథానాయకుడు అజిత్ తననటనతో మరోసారి మెప్పించాడు. ఒక అన్నగా, ఒక కుటుంబాన్ని కాపాడే వ్యక్తిగా.. రెండు పాత్రలు సమర్దవంతంగా పోషించాడు. హాస్యనటుడు సంతానం మరోసారి కడుపుబ్బ నవ్వించాడు. తమన్న, నాజర్ లు తమ పాత్రలకు న్యాయం చేశారు. అతుల్ కులకర్ణి ప్రతినాయకుడిగా కొన్ని సందర్భాలలో మాత్రమే కనిపించినా,  మెప్పించడానికి ప్రయత్నించాడు. మిగిలిన వారు తమ తమ పాత్రలకు తగినట్టుగా నటించారు.

సాంకేతిక వర్గం:

ఈ చిత్రానికి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కెమెరా. యాక్షన్ సన్నివేశాలలో ‘వెట్రి’ పనితనం బాగుంది. స్టంట్స్ అలరించాయి. ఎడిటర్ ‘కాశి విశ్వనాథన్’ ఎడిటింగ్ బాగుంది.

ప్లస్ పాయింట్స్:

హీరో నటన, కెమెరా పనితనం, యాక్షన్ సన్నివేశాలు మరియు కామెడి.

మైనస్ పాయింట్స్:

పాత కథల సమ్మేళనం అనిపించేలా కనిపించే కథ.

చివరి మాట:

తమిళ ప్రేక్షకులకు బాగా ఆకట్టుకున్న అజిత్ సినిమా  తెలుగు ప్రేక్షకులకు అంతగా ఎక్కలేదు.