Teluguwishesh వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ Venkatadri Express Telugu Movie Review, Venkatadri Express Movie Review and Rating, Venkatadri Express Review, Telugu Venkatadri Express Movie Review, Venkatadri Express Movie Stills, Venkatadri Express Movie Gallery, Venkatadri Express Movie Wallpapers, Venkatadri Express Movie Posters, Venkatadri Express Movie Trailers, Videos, Venkatadri Express Movie Release Date and more on Teluguwishesh.com Product #: 48851 3/5 stars, based on 1 reviews
 • చిత్రం  :

  వెంకటాద్రి ఎక్స్ ప్రెస్

 • బ్యానర్  :

  ఆనంది ఆర్ట్ర్స్ క్రియేషన్

 • దర్శకుడు  :

  మేర్లపాక గాంధీ

 • నిర్మాత  :

  జెమిని కిరణ్

 • సంగీతం  :

  రమణ గోకుల

 • సినిమా రేటింగ్  :

  3/53/53/5  3/5

 • ఛాయాగ్రహణం  :

  చోటా.కె. నాయుడు

 • ఎడిటర్  :

  గౌతమ్ రాజు

 • నటినటులు  :

  సందీప్ కిషన్, రాకుల్ ప్రీత్ సింగ్, బ్రహ్మాజీ, తదితరులు

Venkatadri Express Movie Review

విడుదల తేది :

2014-11-29

Cinema Story

శ్రీ క్రుష్ణుడు మహాభారతంలో వందతప్పులు చేసిన శిశుపాలుడ్ని చంపేసినట్లు మీరు ఇదివరకే చదివింటారు. అలానే ఈ సినిమాలో హీరో (సందీప్ కిషన్) సందీప్ తండ్రి (నాగినీడు) గవర్నమెంట్ ఉద్యోగం చేసి పదవి విరమణ చేసి హాయిగా జీవితాన్ని గడుపుతుంటాడు. వ్రుత్తి లో ఎంతో క్రమశిక్షణ తో ఉండే ఈయన జీవితంలో కుటుంబం విషయంలో కూడా అంతే క్రమశిక్షణతో ఉంటాడు. ఎవరైనా వంద తప్పులు చేస్తే వాళ్ళను ఇంట్లో నుండి బహిష్కరిస్తాడు. సందీప్ కిషన్ తొంభై తొమ్మిది తప్పులు చేసి వుంటాడు. నూరో తప్పు ఎట్టి పరిస్ఢితుల్లోనూ చేయకూడదనుకుంటున్న తరుణంలో, అన్న(బ్రహ్మాజీ) పెళ్లి కోసం వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ లో తిరుపతి బయల్దేరతాడు. పెళ్లి కోసం కొన్న తాళిబొట్టు తల్లి మరిచిపోవడంతో, రైలు దిగాల్సి వస్తుంది. తిరిగి రైలు అందుకోవాలని ప్రయత్నాలు మొదలు పెడతాడు. ఈ క్రమంలో పరిచచం అయిన ప్రార్థన(రాకుల్ ప్రీత్ సింగ్ ) తో కలిసి పెళ్లి టైంకి అక్కడికి చేరుతాడా ? మధ్యలో జరిగిన సంఘటనలు ఏంటనేవి తెలియాలంటే థియేటర్ కి వెళ్లి ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ ’ చూడాల్సిందే.

cinima-reviews
వెంకటాద్రి ఎక్స్ ప్రెస్

ఇప్పటి వరకు చాలా సినిమాల్లోనే నటించినా తన కంటూ ఓ స్టార్ ఇమేజ్ క్రియేట్ చేసుకోలేక పోయినా కానీ మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న సందీప్ కిషన్ ఆత్రం లేకుండా ఆచితూచి కథలు ఎంచుకుంటూ సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఆడియో విడుదల టైంలో ‘ఆ నలుగురు ’ సినిమాని పూరి జగన్నాథ్‌ డైరెక్ట్‌ చేస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా అలా ఉంటుంది... అంటూ వర్ణించాడు సందీప్‌ కిషన్‌. కానీ చాలా సింపుల్ స్టోరీని ఎంచుకొని ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ ను గమ్యం చేర్చాడు.


ప్రముఖ రచయిత మేర్లపాక మురళి తనయుడు అయిన గాంధీ తన ఆసక్తి కొద్ది దర్శకత్వంలోకి వచ్చి మొదటిసారి తీసిన సినిమా అయినా మంచి కంటెంట్ , లాజిక్ ఉన్న స్టోరీతో వచ్చి సక్సెస్ అయ్యాడనే చెప్పవచ్చు. చిన్న లాజిక్ తో సినిమాను అంతా చూపించి దాన్ని ప్లాష్ బ్యాక్ లో చూపించి ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాడు. అక్కడక్కడా సాగదీసినా కానీ కమేడియన్స్ తో దాన్ని కవర్ చేశాడు. సెకండాఫ్ లో కొంత గాడి తప్పినా మళ్ళీ ఎక్స్ ప్రెస్ ను పట్టాల పై ఎక్కించాడు. అల్లరి న‌రేష్ వాయిస్ ఓవ‌ర్‌తో సినిమా మొద‌ల‌వుతుంది. కానీ హుషారు మాత్రం త‌క్కువే. తిరుప‌తి ప్రయాణం ద‌గ్గర నుంచీ క‌థ పాకాన ప‌డుతుంది.

సందీప్ అగ‌చాట్టు థ్రిల్‌క‌లిగిస్తే, రైలులో స‌ప్తగిరి అండ్ కో వేసిన వేషాలు వినోదం పండిస్తాయి. దాంతో ప్రేక్షకుల‌కు టైమ్ పాస్ అయిపోతుంది. వీలున్న చోటల్లా కామెడీ ఇరికించాలని వేసిన ఎత్తులు పారలేదు. తొలిసారి దర్శకత్వం వహించినప్పుడు ఇలాంటివి ఓవర్ లుక్ లో చూసుకుంటూ పోవాలి. దర్శకుడిగా ఎదగాలని చూస్తున్న గాంధీ ఈ సినిమాను గమ్యం చేర్చడంలో సఫలీక్రుతం అయ్యాడని చెప్పవచ్చు. చిన్న సినిమాగా విడుదలయిన ఈ సినిమాను పబ్లిసిటీ చేసి ముందుకు తీసుకెళ్తే మంచి వసూళ్లను సాధించే అవకాశం ఉంది.

Cinema Review

సహజ నటనను అలవాటు చేసుకున్న సందీప్ కిషన్ గత చిత్రాల్లో లాగే ఈ చిత్రంలో కూడా తన క్యారెక్టర్ కి తగ్గట్లు నటించాడు. ఎమోషన్స్ సీన్స్ లో అక్కడక్కడ తడబడ్డా అతని సింపుల్ సిటీ నటన ముందు అవన్నీ తేలిపోతాయి. ఇంత వరకు నటుడిగానే ప్రూవ్ చేసుకున్న సందీప్ కిషన్ ఈ సినిమాతో హీరో రేంజ్ కి ఎదిగిపోతాడనటంలో సందేహం లేదు . ఓవ‌రాల్‌గా బాగానే చేశాడు. రాకుల్ ప్రీత్ సింగ్ మొదట్లో కాస్త తడబడ్డా తరువాత సర్దుకుంది. క్యారెక్టర్ కి తగ్గట్లు ఎక్స్ ప్రెషన్స్ లేకపోయినా ముఖంలో కళ ఉంది కాబట్టి తెలుగు సినిమాల్లో రాణించే అవకాశం ఉంది. ఇక ఇందులో కమేడియన్ పాత్రలు పోషించిన తాగుపోతు రమేష్, సప్తగిరి తమ పాత్రల్లో బాగా చేసి ప్రేక్షకుల్ని నవ్వించారు. నాగినీడు షరా మామూలే. ఎమ్మెస్‌ నారాయణ, బ్రహ్మాజీ తదితరులంతా తమ వంతు పాత్ర పోషించారు.  వీరందరి కామెడీతో సినిమా అలా సాగిపోతుంది.

 

కళాకారుల పనితీరు

చాలా రోజుల తరువాత మళ్లీ తెర పైకి వచ్చిన సంగీత దర్శకుడు రమణ గోగుల ఈ చిత్రానికి అందించిన సంగీతం సోసోగా ఉన్నా, నేపథ్య సంగీతం బాగా అందించాడు. ఎంతో అనుభవం ఉన్న ఛోటా కెమెరా ప‌నిత‌న‌నానికి మరింత పదును పెట్టాడు. చిన్న చిత్రం అయినా రిచ్ చిత్రంగా చూపించడంలో సక్సెస్ అయ్యాడు. సినిమా పిక్చరైజేషన్ క్రెడిట్ ఆయనకే దక్కుతుంది. ఎడిటింగ్ విభాగానికి వచ్చే సరికి కాస్త మొహమాట పడ్డారో ఏమో కానీ సినిమా లెన్త్ ని పెంచుకుంటూ పోయి అక్కడక్కడ ప్రేక్షకులకు బోర్ కొట్టించే విధంగా చేశారు.

వీలైనంత వరకు కత్తిరించి ఉంటే మరిన్ని మంచి మార్కులు పడేవి. తొలిసారి దర్శకత్వం వహించిన మేర్లపాక గాంధీ ఈ సినిమాని వీలయినంత ఎంటర్‌టైనింగ్‌గా ప్రెజెంట్‌ చేసేందుకు చూశాడు. కొన్ని పాత్రల్ని తీర్చి దిద్దడంలో, కొన్ని సన్నివేశాలు పండించడంలో గాంధీ బాగానే సక్సెస్‌ అయ్యాడు. గాంధీకి ఇదే తొలి సినిమా. కానీ అత‌నికి మంచి భ‌విష్యత్తు ఉంద‌నిపిస్తోంది.


చివరగా :

రెడ్ సిగ్నల్స్ పడ్డా.... సాఫీగా గమ్యం చేరిన ఎక్స్ ప్రెస్