Teluguwishesh రామయ్యా వస్తావయ్యా రామయ్యా వస్తావయ్యా Ramayya Vasthavayya Telugu Movie Review, Ramayya Vastavayya Movie Review and Rating, Jr. Ntr Ramayya Vastavayya Review, Directed by Harish Shankar, Cast and Crew Jr. Ntr , Shruti Haasan , Samantha and more Product #: 47799 3/5 stars, based on 1 reviews
  • చిత్రం  :

    రామయ్యా వస్తావయ్యా

  • బ్యానర్  :

    శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్

  • దర్శకుడు  :

    హరీశ్ శంకర్

  • నిర్మాత  :

    దిల్ రాజు

  • సంగీతం  :

    ఎస్.ఎస్. థమన్

  • సినిమా రేటింగ్  :

    3/53/53/5  3/5

  • ఛాయాగ్రహణం  :

    చోటా కె. నాయుడు

  • ఎడిటర్  :

    గౌతమ్ రాజు

  • నటినటులు  :

    ఎన్టీఆర్, సమంతా, శ్రుతి హాసన్ తదితరులు

Ramayya Vasthavayya Telugu Movie Review

విడుదల తేది :

అక్టోబర్ 11, 2013

Cinema Story

ఎన్టీఆర్ (నందు) కాలేజ్ స్టూడెంటుగా ఉంటాడు. కానీ కాలేజికి వెళ్లడు. బయట బాతాఖానీ కొట్టుకుంటూ ప్రక్క కాలేజి అమ్మాయి అయిన అక్షర (సమంతా) తో ప్రేమలో పడతాడు. తనను తన ట్రాక్ లో పడేసి, ఆ తరువాత తన ఇంట్లో వాళ్లకి కూడా దగ్గరై వాళ్ల అక్క పెళ్లి కారణంతో అక్కడికి వెళతాడు. అక్కడి ఎందుకు వెళతాడు ? అక్షరకి ఎందుకు దగ్గరవుతాడు ? అసలు నందు వెనక ఉన్న కథంటి ? ఫ్లాష్ బ్యాక్ లో శ్రుతి హాసన్ పాత్ర ఏమిటి ? అక్షర వాళ్ళ నాన్నను ఎందుకు చంపుతాడు ? చివరికి అక్షర ప్రేమను గెలుస్తాడా అన్నదే రామయ్యా వస్తావయ్యా స్టోరీ.

cinima-reviews
రామయ్యా వస్తావయ్యా

టాలీవుడ్ యంగ్ టైగర్ గా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్ స్టార్ హీరోలలో ఒకరు. ఈయన నటించిన సినిమాలు బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తాయి. అలాంటి ఎన్టీఆర్ కి చాలా కాలం నుండి తన స్థాయికి తగ్గ హిట్టు రావడం లేదు. అప్పుడెప్పుడో వచ్చిన  ‘బ్రుందావనం ’ సినిమా తరువాత చేసిన సినిమాలు బాక్సాఫీసు వద్ద కలెక్షన్లు కురిపించాయి కానీ తన స్థాయికి తగ్గ సినిమాలు అనిపించుకోక పోయాయి. దీంతో హరీష్ శంకర్ తో  ‘రామయ్యా వస్తావయ్యా ’ సినిమాకు కమీట్ అయ్యాడు. గబ్బర్ సింగ్ హిట్ తరువాత మంచి ఫాంలో ఉన్న హరీశ్ శంకర్ ఈ సినిమాను ఎన్టీఆర్ కు తగినట్లు తెరకెక్కించాడని, తన కెరియర్లోనే హైలెట్ సినిమాగా నిలుస్తుందని చెప్పుకొచ్చిన ఆయన ప్రేక్షకుల్ని ఏ మాత్రం మెప్పించాడో ఈ సినిమా రివ్యూ ద్వారా చూద్దాం.

ఈ సినిమా లో హరీష్ శంకర్ ఎన్టీఆర్ ని ప్రతి విషయంలో హైలెట్ చేయాలని ప్రయత్నించాడు. ఎల్లప్పుడు కొత్తగా చూపించాలనే తాపత్రయం తెర పై కొట్టచ్చినట్లు కనిపిస్తుంది. ఇంత వరకు ఎవరూ చూపించిని విధంగా చూపించాలని చేసిన ప్రయత్నం ఫలించింది. కానీ ఎన్టీఆర్ ని హైలెట్ చేయడం పై చూపించిన శ్రద్ద కథ, కథనం పెడితే బాగుండేది. ఎంచుకున్న కథ పాత చింతకాయ పచ్చడిలా ఉంది. ఫస్టాఫ్ ని కామెడీతో, ఇంటర్వెల్ ముందు ఇచ్చిన ట్విస్టుతో ప్రేక్షకులు ఓ ఫీల్ లోకి వెళ్లిపోతారు. సెకండాఫ్ కూడా ఇలానే ఉంటుందని అనుకుంటారు. కానీ తీరా రెండవ భాగం కథ నడుస్తున్న కొద్ది కథను ప్రక్క ట్రాక్ పట్టించి, ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ కి తగ్గట్లు నరకడాలు మొదలు పెట్టడంతో ప్రేక్షకులకు విసుగు వచ్చేస్తుంది. ఇలాంటి తరహా నరకడాలు గతంలో చాలా సినిమాల్లో చేశాడు. కానీ ఇందులో ఎన్టీఆర్ నరకడం చూసిన జనాలు బెంబేలెత్తి పోతారు. సెకండాఫ్ లో కామెడీ లేకుండా పోయింది. దీంతో ప్రేక్షకులకు ఫస్టాఫ్ అనిపించిన కొత్తదనం సెకండాఫ్ లో కానరాదు. మొదటి భాగం అన్ని వర్గాల ఆడియన్స్ కోసం తీస్తే... ద్వితియార్థం మాత్రం ఎన్టీఆర్ అభిమానుల కోసమే అనే ఫీలింగ్ వస్తుంది. మల్టిప్లెక్సుల్లో జనాలకు ఈ సినిమా అంతగా రుచించదు. బి, సి క్లాస్ సెంటర్లలో అలరించవచ్చు. అసలే సెంటిమెంటు తేదీగా విడుదలయిన ’రామయ్యా, ’ మొదటి వారం వసూళ్ళ పరంగా బాగున్నా, ఎన్టీఆర్ భారీగా ఆశలు పెట్టుకున్నంత రేంజ్ లో ఈ సినిమా లేదని చెప్పవచ్చు. మొత్తానికి ‘రామయ్యా ’ ఏ మేరకు లాగించగలడన్నది వేచి చూడాలి.

Cinema Review

హీరోల మేనరిజాన్ని ద్రుష్టిలో పెట్టుకొని వారికి తగ్గట్లు సినిమాలు తీసే హరీశ్ శంకర్ ఈ సినిమాలో కూడా ఎన్టీఆర్ ను హైలెట్ గా చూపించాడు. యంగ్ టైగర్ అన్న పదానికి నిర్వచనంగా అతన్ని చాలా గ్లామరస్ గా, యూత్ ఫుల్ గా చూపించాడు. హీరో ఇమేజ్ ని తెర పై ఏ మాత్రం తగ్గకుండా చూసుకున్నాడు. ఇక ఎప్పుడు అభిమానుల్ని అలరించే ఎన్టీఆర్ ఇందులో కూడా అన్ని విభాగాల్లో ఆకట్టుకున్నాడు.  సినిమాలో ఎన్.టి.ఆర్ నటుడిగా తనలోని మరో కొత్త కోణాన్ని తెరపై ఆవిష్కరించాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. సినిమాలో సమంత చాలా బ్యూటిఫుల్ గా కనిపించినా పెద్దగా ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర దక్కలేదు. పాటల్లో బాగా గ్లామరస్ గా కనిపించింది.  శృతి హాసన్ చేసింది చిన్న పాత్ర అయినా,  పల్లెటూరు అమ్మాయిగా చూపించినా మోడ్రన్ గా చూపించారు. ఈమె పై చిత్రీకరించిన పాట అంత పెద్దగా ఆకట్టుకోలేదు. సమంతాకి తండ్రి పాత్ర పోషించిన ముఖేష్ రిషి ఎప్పటిలానే చేశాడు. విలన్ పాత్ర పోషించిన రవిశంకర్ ముఖంలో తన హావభావాలతోనే విలనిజాన్ని పండించాడు. రావు రమేష్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పాత్రలో కనిపించాడు. రోహిణి హత్తాంగది కనిపించేది కొద్దిసేపే అయినప్పటికీ బాగా నవ్విస్తుంది. కోట శ్రీనివాసరావు వంటి వారికి పెద్దగా గుర్తింపునిచ్చే పాత్రలు దక్కలేదు. వారి పరిధి మేరకు వారు రాణించారు.

సాంకేతిక విభాగం : ఈ విభాగంలో సినిమాటో గ్రఫీ చాలా బాగుంది. ఎక్కడా వంక పెట్టడానికి లేదు. ఎన్టీఆర్ ని, పాటల చిత్రీకరణకు సంబంధించి తన పనితనం ఏమిటో చూపించాడు. ఇక థమన్ అందించిన సంగీతం ఫర్వాలేదనిపించినా, పూర్తి స్థాయిలో తన సంగీతంతో మెప్పించలేక పోయాడు. ఒక్కటి రెండు పాటలకు బాగా వాయించాడు. ఒకప్పుడు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా ఇచ్చిన థమన్ రాను రాను అందులో పస తగ్గించాడు. చిన్న చిన్న తప్పులు చేస్తూ వస్తున్నాడు. ఎడిటింగ్ ఫస్టాఫ్ వేగంగా పరిగెత్తిన గౌతం రాజు , సెకండాఫ్ కి వచ్చేసరికి నెమ్మదించింది. అందుకు కారణం కథలో వచ్చిన ట్విస్ట్ గా చెప్పవచ్చు. స్ర్కీన్ ప్లే విషయంలో పొరపాట్లు జరిగాయి. కథను రాసుకున్న హరీష్ శకంర్ కాకుండా వేరే వారు చేయడమే ఈ లోపాలకు కారణం. డైలాగ్స్ పరంగా హరీశ్ శంకర్ రాసినవి బాగా పేలాయి. ఈ విషయంలో హరీశ్ శంకర్ సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. కానీ దర్శకుడే రొటీన్ కథను ఎంచుకొని దాన్నే హైలెట్ చేయడంతో సినిమాలో కొత్తదనం లోపించింది. నిర్మాణ విలువల పరంగా దిల్ రాజు తన మార్క్ ని చూపించాడు. ఎక్కడా రాజీపడలేదు.

more