Teluguwishesh పోటుగాడు పోటుగాడు Potugadu Telugu Movie Review, Telugu Potugadu Movie Review, Potugadu Movie Review, Potugadu Movie Rating, Potugadu Review, Potugadu Rating, Potugadu Live Updates, Story, Cast and Crew on Teluguwishesh.com Product #: 47381 3/5 stars, based on 1 reviews
 • చిత్రం  :

  పోటుగాడు

 • బ్యానర్  :

  రామాలక్ష్మి సినీ క్రియేషన్స్

 • దర్శకుడు  :

  పవన్ వాడేయర్

 • నిర్మాత  :

  శిరీష, శ్రీధర్

 • సంగీతం  :

  అచు

 • సినిమా రేటింగ్  :

  3/53/53/5  3/5

 • ఛాయాగ్రహణం  :

  శ్రీకాంత్

 • ఎడిటర్  :

  ఎం.ఆర్.వర్మ

 • నటినటులు  :

  మంచు మనోజ్, అను ప్రియ, సాక్షి చౌదరి, సిమ్రన్ కౌర్

Potugadu Movie Review

విడుదల తేది :

14 సెప్టెంబర్ 2013

Cinema Story

గోవిందం (మంచు మనోజ్ ) తన జీవితాన్ని చాలా సరదాగా గడుపుతూ... అమ్మాలను ప్రేమిస్తూ ఉంటాడు. ఇలా ఒకర్ని కాదు ఇద్దర్ని కాదు ఏకంగా నలుగుర్ని ప్రేమిస్తాడు. చివరికి వారందర్ని వదిలి ఆత్మహత్య చేసేకోవాలని ఫిక్సయ్యి, ఓ స్పాట్ కి వెళతాడు. అక్కడికి ఓ సాఫ్టువేర్ ఇంజనీర్ వెంకటరత్నం (పోసానికృష్ణముర‌ళి) కూడా ఆత్మహత్య చేసుకోవడానికి వస్తాడు. అక్కడ ఒకరి స్టోరీ ఒకరు చెప్పుకుంటారు. తరువాత గోవిందు, వెంకటరత్నంలు ఆత్మహత్య చేసుకుంటారా ? గోవిందును ఆత్మహత్య చేసుకోకుండా వెంకటరత్నం ఏం చెబుతాడు ? ఈ కథలో జరిగిన మలుపులు ఏంటి అనేది తెర పై చూడాల్సిందే.

cinima-reviews
పోటుగాడు

డైలాగ్ కింగ్ గా, కలెక్షన్స్ కింగ్ గా, నిర్మాత గా పేరు తెచ్చుకున్న మోహన్ బాబు నట వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీకి వచ్చిన ఆయన చిన్న కుమారుడు మంచు మనోజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చి పలు చిత్రాల్లో నటించి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నా, తన కంటూ ఓ స్టార్ డమ్ మాత్రం రాలేదు.  అయినా టాలీవుడ్ తెరపై ఎప్పుడూ విభిన్నంగా కనిపించాలని అనుకొని విభిన్న పాత్రల్లో ప్రేక్షకుల్ని అలరించాలని చూస్తాడు. చాలా రోజుల తరువాత ఓ కన్నడ సినిమా రీమేక్ లో వెండితెర పై ‘పోటుగాడు ’ కనిపించబోతున్నాడు. మరి అందరిచేత ‘పోటుగాడు ’ అనిపించుకున్నాడా ? లేదో ఈ సినిమా రివ్యూ ద్వారా చూద్దాం.

Cinema Review

మంచు మనోజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చి చాలా సంవత్సరాలైనా....నటన పరంగా చాలా ఇంప్రూవ్ కావాలనిపిస్తుంది. మొదట్లో పాత్రమేరకు నటించే మనోజ్ రాను రాను శ్రుతిమించి నటించడంతో ప్రేక్షకులు విసుగెత్తి పోయారు. గత రెండు చిత్రాల్లో మనోజ్ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాడు. ఈ చిత్రంలో నాలుగు ఢిఫరెంటు క్యారెక్టర్లు పోషించిన మనోజ్ గతంలో కంటే కాస్తంత మెరిగే అనిపించినా, ఈయన నటనను మైండ్ లో ఫిక్సయిన ప్రేక్షకుడికి మాత్రం పాత నటనే గుర్తుకు తెచ్చే విధంగా నటించాడు. ఈ చిత్రంలో కామెడీని పండించే ప్రయత్నం చేశాడు. కానీ వర్కవుట్ కాలేదు. మాటిమాటికి ఈ చిత్రంలో తన తండ్రిని ఇమిటేట్ చేసేవిధంగా నటించి మరిన్ని మైనస్ మార్కులు వేసుకున్నాడు. ఈ చిత్రంలో చేసింది ఓ మోస్తారు క్యారెక్టరే అయినా, దాన్ని తన నటనతో భ్రష్టుపట్టించాడు. ఇక ఇతని సరసన నటించిన నలుగురు కథానాయికలకు ఏ ఒక్కరికి చెప్పుకోదగ్గ పాత్ర దక్కలేదు. కావున వీరి గురించి చెప్పుకోవాల్సిన పనిలేదు. ఇక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా చేసిన పోసాని అతని రోల్, అతను చేసిన కామెడీ రోల్ ప్రేక్షకుల్ని కాస్తంత ఆకట్టుకోవచ్చు.

సాంకేతిక విభాగం

ఈ చిత్రానికి అచ్చు సంగీతం సగం బలాన్ని చేకూర్చింది. ఇతను అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్లస్ అని చెప్పవచ్చు. ఇక కన్నడలో హిట్ అయిన పాటలను దర్శకుడు యధావిధిగా వాడుకున్నాడు. బుజ్జిపిల్ల‌, ప్యార్‌మే ప‌డిపోయామే పాట‌లు కొన్నాళ్లపాటు వెంటాడ‌తాయి. సినిమాటో గ్రఫీ, ఎడిటింగ్ విభాగాలు రెండు చక్కగా కుదిరాయి. మనోజ్ సినిమా అని చూడకుండా తక్కువ బడ్జెట్ లో సినిమా తీసినా కానీ రిచ్ లుక్ వచ్చే విధంగా ఉంది. మాటల రచయిత తన డబుల్ మీనింగ్ అర్థాలతో ప్రేక్షకుల్ని చంపేశాడు. ఒక సాదాసీదా క‌థ‌ను త‌న‌దైన స్క్రీన్‌ప్లే జ‌మ్మిక్కుల‌తో చ‌క్కగా కథ రాసుకొని స్పీడ్ గా నెరేట్ చేశాడు ద‌ర్శకుడు. సాంకేతిక బృందంలో అత‌నికే ఎక్కువ మార్కులు ప‌డ‌తాయి. అంతా బాగానే ఉన్నా దర్శకుడు లీడ్ రోల్ గా ఉన్న వారి దగ్గరి నుండి సరిగ్గా నటనను రాబట్టుకోలేక పోయాడు. మొదటి భాగం కన్నా, ద్వితియార్థం కాస్తంత నెమ్మదించింది. ఈ చిత్రంలో పాటలు వినసొంపుగా ఉన్నా గుర్తుంచుకునేవిధంగా ఏమీ లేవు.

more