Teluguwishesh చెన్నయ్ ఎక్స్ ప్రెస్ చెన్నయ్ ఎక్స్ ప్రెస్ Chennai Express, Chennai Express Movie Review, Chennai Express Review, Chennai Express Hindi Movie Review, Hindi Chennai Express Movie Review, Chennai Express Rating, Chennai Express Trailer, Chennai Express Wallpapers, Chennai Express Movie Stills, Shahrukh Khans Chennai Express, SRK Chennai Express, Deepika Padukone Chennai Express, Chennai Express Teaser, Chennai Express U/A, Chennai Express Movie News. Product #: 46607 4/5 stars, based on 1 reviews
  • చిత్రం  :

    చెన్నైయ్ ఎక్స్ ప్రెస్

  • బ్యానర్  :

    రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్మెంట్

  • దర్శకుడు  :

    రోహిత్ శెట్టి

  • నిర్మాత  :

    గౌరీ ఖాన్ , సిద్దార్థ్ రాయ్ కపూర్

  • సంగీతం  :

    విశాల్ శేఖర్

  • సినిమా రేటింగ్  :

    4/54/54/54/5  4/5

  • ఛాయాగ్రహణం  :

    డూడ్లీ

  • ఎడిటర్  :

    స్టీవెన్ హెచ్. బెర్నాడ్

  • నటినటులు  :

    షారూఖ్ ఖాన్, దీపికా పడుకునే, సత్యరాజ్, ప్రియమణి

Chennai Express Chennai Express Movie Review

విడుదల తేది :

09 ఆగష్టు 2013

Cinema Story

రాహుల్ (షారూఖ్ ఖాన్ ) ముఖ్యమైన పని అంటే తాత అస్థికలను రామేశ్వరంలో కలిపి, అటునుండి అటే గోవా వెళ్ళాలనుకొని చెన్నై ఎక్స్ ప్రెస్ ఎక్కేస్తాడు. కానీ ట్రైన్ లోకి తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం నిరాకరించి ఇంటి నుంచి పారిపోయిన మీనాలోచిని (దీపికాపదుకునే) ఆలియాస్ మీనమ్మ అదే ట్రైన్ లోకి ఎక్కుతుంది. ఆమె కారణంగా కొన్ని తప్పని పరిస్థితుల్లో ఆమెతో పాటు ఆమె స్వంత గ్రామానికి వెళ్ళాల్సి వస్తుంది. మీనా తండ్రి అక్కడ లోకల్ డాన్. మీనమ్మను ఓ వ్యక్తికి ఇచ్చి పెళ్ళి చేయడానకి చూస్తాడు. అది నచ్చకే ఇంట్లోనుండి పారిపోయిన మీనా రాహుల్ ని తీసుకొని వచ్చి ఇతన్ని ప్రేమించానని చెబుతుంది. ఆ తరువాత రాహుల్, మీనాల మధ్య ఎలా ప్రేమ చిగురించింది. రాహుల్, మీనాలు పెద్దవారిని ఎలా ఒప్పించారు, రాహుల్ ఎన్ని పాట్లు పడ్డాడు అనేదే ఈ సినిమా స్టోరి.

cinima-reviews
చెన్నయ్ ఎక్స్ ప్రెస్

బాలీవుడ్ కింగ్ ఖాన్ గా పేరు తెచ్చుకున్న షారూఖ్ ఖాన్ తనస్ధాయి చిత్రాలను ప్రేక్షకులకు అందించి చాలా కాలం అయింది. కెరియర్ తొలినాళ్లలో షారుక్ యాక్షన్, కామెడి నేపథ్యం ఉన్న చిత్రాలను తీసి మంచి జనాదరణ పొందాడు. ఆయన నటించిన బాద్షా, డూప్లికేట్, ఫిర్‌బీ దిల్ హై హిందుస్థానీ చిత్రాల తర్వాత కామెడీ, యాక్షన్ చిత్రాల్లో తరహా చిత్రాలు చేసి పరాజయాలు చవిచూసిన షారూఖ్ తన పాత పద్దతినే ఎన్నుకొని, ఇటీవలి కాలంలో బాలీవుడ్ కి వందకోట్లు వసూలు చేసే సినిమాలను అందిస్తూ పోతున్న రోహిత్ శెట్టి దర్శకత్వంలో ‘చెన్నై ఎక్స్ ప్రెస్ ’ చిత్రంలో నటించాడు. అందరి ఖాన్ ల లాగా విజయాల్లో వెనకబడిన షారూఖ్ మరి ఈ సినిమాతోనైనా విజయాన్ని అందుకున్నాడో లేదో ఈ సినిమా రివ్యూ ద్వారా చూద్దాం.

బాలీవుడ్ లో తెరకెక్కిన ఈ సినిమాలో ఎక్కువ తమిళ ఫ్లేవర్ కనిపిస్తుంది. కామెడీ రొమాన్స్ మిలితంగా రూపొందిన ఈ సినిమాలో పలు తెలుగు, తమిళ సినిమాల సీన్స్ ని కాపీ కొట్టి పెట్టేశారు. ఆ రెండు భాషల చిత్రాలను చూసే వారికి ఈ చిత్రం కొత్తగా అనిపించక పొవచ్చు. ఎలాంటి అంచనాలు లేకుండా షారుక్, దీపికా కెమిస్ట్రీని ఎంజాయ్ చేయాలనే టేస్ట్ ఉన్న అభిమానులకు, రిలాక్స్ కోసం ధియేటర్‌కు వెళ్లాలనుకునే ఫ్యామిలీ కేటగిరి ప్రేక్షకులకు మాత్రమే చెన్నై ఎక్స్‌ప్రెస్ చిత్రం నచ్చుతుంది. కామెడీ చిత్రాలను తనదైన శైలిలో తెరకెక్కించే రోహిత్ శెట్టి కామెడీ కొన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కానీ షారూఖ్ అభిమానులను, సామాన్య జనాలను ఎలా ఆకట్టుకోవాలో తెలుసు కాబట్టి దాన్ని మాత్రం తూచా తప్పకుండా పాటించాడు. ఈ సినిమాలో తమిళ తంబీల యాసలో ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఫస్టాఫ్ లో కాస్తంత నెమ్మదించినా, సెకండాఫ్ మాత్రం ఎక్స్ ప్రెస్ రేంజ్ లో పరిగెత్తించాడు. ఇక ఈ చిత్రం ఘనవిజయం సాధిస్తే ఆ ఘనత షారుక్, దీపికాలకే దక్కుతుంది. సినిమాను వారే భుజ స్కందాల పై వేసుకున్నారు. షారుక్, దీపికలకు తగ్గట్టుగా కథను సిద్ధం చేసుకోవడంలో దర్శకుడు తడబాటు పడ్డాడు.   కామెడీ రొమాన్స్ తో ఓ కొత్త ప్రయోగం చేశాడనిపిస్తుంది. లాస్ట్ లో వచ్చే ఫైట్స్, లుంగీ వేశాధారణ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. కథ పాత చింతకాయ పచ్చడిలాగానే ఉన్నా రోహిత్ శెట్టి దానికి కామెడీ జోడించి సినిమాకు కావాల్సిన కమర్షియల్ హంగులు జోడించి తీశాడు కాబట్టి వసూళ్ళ పరంగా ఈ సినిమా ఎక్స్ ప్రెస్ లా దూసుకెళ్లడం ఖాయం. 

Cinema Review

కళాకారుల పనితీరు : ఈ సినిమాలో కింగ్ ఖాన్ షారూఖ్ తనదైన శైలిలో నటించి సినిమాకు ప్రాణం పోవాడు. ఇటువంటి పాత్రల్లో నటించడంతో షారూఖ్ దిట్ట. రొమాంటిక్ టచ్‌తో యాక్షన్ హీరోగా షారుక్ చార్మింగ్‌గా కనిపించాడు. రొమాంటిక్ లవర్ బాయ్ పాత్రలో షారుక్ తప్ప మరొకర్ని ఊహించుకోవడం కష్టమనే రీతిలో చెన్నై ఎక్స్‌ప్రెస్ చిత్రంలో నటనను ప్రదర్శించాడు. ఈ సినిమాలో బాలీవుడ్ నటులు అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తారు. ఎక్కువగా తమిళ ఘాటు దట్టించారు. షారూఖ్ కామెడీ, రొమాన్స్ ని బ్యాలెన్స్ చేస్తూ నటించాడు. ఇక మీనా(మీనమ్మ)పాత్రలో దీపిక పదుకొనే అమాయకత్వంతోపాటు, చెలాకీతనంతో అద్బుతంగా ప్రదర్శించింది. తమిళ సాంప్రదాయ నేపథ్యం ఎక్కువగా ఉన్న ఈ చిత్రంలో దీపికా కట్టు,బొట్టు, క్యాస్టూమ్స్ ఓహో అనిపించేలా ఉన్నాయి. ఈ సినిమాలో దీపికా పూర్తి స్దాయి నటనను ప్రదర్శించి షారూఖ్ ఖాన్ ని ధీటుగా నిలించింది. కామెడీ కూడా పండించింది. ఇక విలన్ పాత్ర లో కనిపించిన సత్యరాజ్ పాత్రకు అంత పెద్దగా ప్రాముఖ్యత లేకపోయినా, గంభీరంగా కనిపించి ఆకట్టుకున్నాడు. మిగతా వారి గురించి చెప్పుకోవాల్సినంతగా ఏమీ లేదు. ప్రియమణి ఫ్రీగా ఐటెం సాంగులో నటించినా అదరగొట్టింది.

సాంకేతిక వర్గం : ఈ సినిమాకు సంగీతం అందించిన విశాల్ శేఖర్ ఫర్వాలేదనిపిస్తుంది. కొన్ని పాటలకు మాత్రం తమిళ తంబీల ఫ్లేవర్ ని దట్టించి తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ నేపథ్యంగా తైలవర్ (లుంగీ డ్యాన్స్) పాట, కాశ్మీర్ మే తూ  కన్యాకుమారి పాటలకు మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఇక ముఖ్యంగా ఈ సినిమాలో స్క్రీన్ ప్లే, కేరళ అందాలు, అద్బుతమైన దూద్లే ఫోటోగ్రఫీలు సినిమాపై ప్రేక్షకుడు పట్టు సాధించేలా చేశాయి. ఎడిటింగ్ విషయానికి వస్తే మొదటి భాగంలో కాస్తంత అటూ ఇటూగా ఉన్న రెండో భాగంలో మాత్రం బాగా చేశాడు. ఇక దర్శకుడు రోహిత్ శెట్టి కామెడీ ట్రాక్ ను తనదైన శైలిలో తెరకెక్కించాడు.  దక్షిణాది కామెడీ ట్రాక్‌కు షారుక్ రొమాంటిక్ ఇమేజిని కలిపి తెరకెక్కించడం కాస్త కష్టమైన విషయమే. కానీ ఈ విషయంలో రోహిత్ శెట్టి సఫలం అయ్యాడు. 

chivaraga

 ‘చెన్నై ఎక్స్ ప్రెస్ ’ తమిళ ఫ్లేవర్ ఎక్కువైంది

 
more