Teluguwishesh తఢాఖా తఢాఖా Thadaka review, Thadaka movie review, Thadaka movie rating, Thadaka movie talk, Thadaka movie release, Thadaka movie stills, Thadaka movie trailer, Naga Chaitanya Thadaka movie review, Naga chaitanya sunil Thadaka movie review, Bellam konda suresh Thadaka movie, Thadaka movie review, Thadaka review Product #: 44611 2.75/5 stars, based on 1 reviews
  • చిత్రం  :

    తఢాఖా

  • బ్యానర్  :

    సాయి గణేశ్ ప్రొడక్షన్స్

  • దర్శకుడు  :

    కిషోర్ పార్థాసాని

  • నిర్మాత  :

    బెల్లంకొండ గణేష్‌బాబు

  • సంగీతం  :

    తమన్

  • సినిమా రేటింగ్  :

    2.75/52.75/5  2.75/5

  • ఛాయాగ్రహణం  :

    ఆర్డర్ ఎ.విల్సన్

  • ఎడిటర్  :

    గౌతంరాజు

  • నటినటులు  :

    నాగచైతన్య, సునీల్ , తమన్నా, ఆండ్రియా, అశుతోష్ రాణా, నాగబాబు,తదితరులు

Thadaka Movie Review

విడుదల తేది :

మే 10, 2013

Cinema Story

శివరామకృష్ణ (సునీల్), కార్తీక్ (నాగచైతన్య) అన్నదమ్ములు. పెద్దోడు సునీల్ కి చిన్నప్పటి నుండి భయం, బాగా నెమ్మదస్తుడు కూడా. ఇక చిన్నోడు అయిన నాగచైతన్యకి ధైర్య సాహసాలు ఉండటమే కాకుండా, చాలా క్లాస్ కూడా. శివరామకృష్ణ కి తన తండ్రి పోలీస్ ఉద్యోగం వస్తుంది. అసలే భయస్తుడు అయిన శివ ఓ రౌడీ ముఠా ఉన్న ప్రాంతానికి ఎస్సైగా వెళతాడు ? అక్కడ తన తమ్ముడి సహాయంతో మంచి పేరుతెచ్చుకున్న శివను చంపడానికి రౌడీ గ్యాంగ్ ప్రయత్నిస్తుంటుంది. అయితే వారి నుండి అన్నను కాపాడుకోవడానికి కార్తీ ఏం చేస్తాడు? బయస్తుడిగా ఉన్న శివ ధైర్య సాహసాలు గల వ్యక్తిగా ఎలా మారుతాడన్నది తెరపైనే చూడాలి.

cinima-reviews
తఢాఖా

తమిళ దర్శకుడు లింగుస్వామి తీసిన ‘వెట్టై ’ చిత్రం అక్కడ ఘన విజయం సాధించడంతో అదే చిత్రాన్ని రీమేక్ గా తెలుగులో ‘తడాఖా ’ పేరుతో రీమేక్ చేశారు. తమిళంలో మాధవన్, ఆర్య నటించగా, తెలుగులో నాగ చైతన్య, సునీల్ లు కలిసి నటించారు. ఇందులో నటించన నాగ చైతన్య తెలుగు ప్రేక్షకుల ముందుకు రాక చాలా రోజులు అయింది. అలాగే ఇతడు నటించిన మాస్ సినిమాలు అయిన దడ, బెజవాడ సినిమాలు పెద్ద డిజాస్టర్ కావడంతో ఈ సినిమా నాగచైతన్యకు కీలకం కానుంది. ఇక ‘పూలరంగడు ’ తరువాత మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్న సునీల్  కి కూడా ఇది కీలకమనే చెప్పాలి. మరి పక్కా మాస్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాలో వారిద్దరు ఏమేరకు రాణించారో, ప్రేక్షకులకు ఏ మేరకు ‘తడాఖా ’ చూపించారో చూద్దాం.

తమిళంలో లింగుస్వామి దర్శకత్వం వహించిన కమర్షియల్ సినిమా తన దర్శకత్వ ప్రతిభతో పెద్ద హిట్ గా నిలిపాడు. అయితే అదే సినిమాను తెలుగులో రీమేక్ చేసేటప్పుడు ఎంతో జాగ్రత్త తీసుకోవాలి. దీనిని తెలగులోకి కాస్తన్ని మార్పులు చేసి అనువదించిన దర్శక, రచయితలు పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేకపోయారని చెప్పవచ్చు. దీంతో ఈ సినిమా పై ఉన్న అంచాలను వారు పూర్తి స్థాయిలో అందుకోలేక పోయారు. ఫస్టాఫ్ లో కామెడీతో సినిమాని బోరింగ్ లేకుండా తీసిన దర్శకుడు, సెకండాఫ్ మొదట్లో కాస్త నెమ్మదించింది. మళ్ళీ సునీల్ ధైర్య వంతుడిగా మారిన సినిమా రక్తికట్టిస్తుంది. రెండో భాగంలో సినిమా పడుతూ లేస్తూ ఉంటుంది. అన్నదమ్ముల మధ్య ఉన్న విలువలను కాస్తంత ఎక్కువగా చూపించాల్సి ఉండేదనిపిస్తుంది. యాక్షన్ సీన్స్ బాగానే తీసినా, మరికొంత శ్రద్ద పెట్టి కామెడీ, పాటలను తీర్చి దిద్దితే ఈ సినిమా రిజల్టు వేరేలా ఉండేది. కొంత మంది మాస్ ప్రేక్షకులకు ఈ చిత్రం రొటీన్ గా అనిపించినా, మొత్తంగా చూస్తే యావరేజ్ సినిమా అని చెప్పవచ్చు.

Cinema Review

కెరియర్ మొదట్లో లవర్ బాయ్ పాత్రలు చేసి మంచి పేరు తెచ్చుకున్న నాగచైతన్య తన తరువాతి సినిమాల్లో మాస్ క్యారెక్టర్ వేసి మెప్పించలేక పోయాడు. అయితే ఈ సినిమాలో కూడా మాస్ పాత్రనే చేసిన చైతూ అప్పటికి, ఇప్పటికి చాలా మెరుగయ్యాడని చెప్పవచ్చు. ఈ సినిమాలో త పాత్రకు అనుగుణంగా బాగానే నటించాడు. కానీ ఇంకా మెరుగవ్వాలి. ఇక అన్న పాత్రలో, పోలీస్ ఆఫీసర్ పాత్రలో సునీల్ సరిగ్గా ఒదిగిపోయాడు.  పాత్రకు అయినా సరిపోయే నటుడు సునీల్ అని ఈ సినిమాతో అతను నిరూపించుకున్నాడు. చివర్లో సునీల్ నటన ఆకట్టుకుంటుంది . చైతూ ప్రక్కన నటించిన తమన్నా, సునీల్ ప్రక్కన నటించిన ఆండ్రియా పాత్రలకు పెద్ద స్కోపు లేదు. అందాలతోనే వారిని సరిపెట్టారు. ఇక ఇందులో విలన్ గా నటించిన ఆశుతోష్ రాణా తన పాత్రకు 100% న్యాయం చేయగలిగాడు. బ్రహ్మనందం, వెన్నెల కిషోర్ నవ్వించడానికి తమ వంతు ప్రయత్నం చేశారు. అక్కడక్కడ కిషోర్, శ్రీనివాస్ రెడ్డిల పంచ్ డైలాగులు పేలాయి. కానీ బ్రహ్మానందం అంతగా ఆకట్టుకోలేక పోయారు. మిగిలిన వారు తమ పాత్రల పరిధిలో నటించారు.

సాంకేతిక వర్గం : ఈ సినిమాకు సంగీతం అందించిన తమన్ తన మ్యూజిక్ ని ఇంప్రూ చేసుకున్నట్లు అనిపించలేదు. అతడు అందించిన సంగీతం అంత పెద్దగా ఆకట్టుకోలేదు. ఓటి రెండు పాటలు మినహా పాటలు పెద్దగా వినసొంపుగా లేవు. నేపథ్య పంగీతం అక్కడక్కడా ఆకట్టుకున్నా, కొన్ని చోట్ల పేవలంగా ఉంది. ఫోటోగ్రఫీ బాగుంది. ప్రతి ఫ్రేమ్ ని బాగా తీశారు. మాటలు అక్కడక్కడ ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి. తొలి సినిమాతో ప్రేక్షకులు ‘కొంచెం ఇష్టం, కొంచెం కష్టంగా ’నే పరిచయం అయిన కిషోర్ ఈ సినిమాని కంప్లీట్ ఢిపరెంట్ గా చేశాడు.  తమిళంలో పక్కా కమర్షియల్ గా తెరకెక్కి హిట్ అయిన ఈ సినిమాను అదే రేంజ్ లో తీయడంలో సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. ట్విస్ట్ లు లేకుండా ఒక సీన్ తరువాత ఒక సీన్ పేర్చుకుంటూ వెళ్లాడు. ఫ్యూచర్లో కమర్షియల్ సినిమాలను తాను కూడా తీయగలనని నిరూపించుకున్నాడు.

» ఇంగ్లీష్ రివ్యూ కోసం క్లిక్ చెయ్యండి

 

chivaraga

తమిళంలో చూపినంత  ‘తడాఖా ’ తెలుగులో చూపలేదు

 
more