సినిమా పేరు : బస్ స్టాప్
విడుదల తేదీ: 10 నవంబర్ 2012
దర్శకుడు : మారుతి
నిర్మాత : బెల్లంకొండ సురేష్
సంగీతం : జే.బీ
నటీనటులు : ప్రిన్స్, శ్రీ దివ్య
బ్యానర్ : లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్
తెలుగువిశేష్.కాం రేటింగ్ : 3
ఇంట్రడక్షన్ :
దర్శకుడు మారుతి మూడో సినిమా అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ సంస్థలో ఓకే ఐన తర్వాతి రోజే రిలీజైన మూవీ ‘బస్ స్టాప్’. తొలి సినిమా ‘ఈ రోజుల్లో’ సినిమాతో డూపర్ హిట్ కొట్టిన దర్శకుడు మారుతి రెండవ సినిమా ‘బస్ స్టాప్’ తో ఇవాళ మన ముందుకి వచ్చాడు. అనుకున్న తేదీ కంటే ముందుకి వచ్చి సడన్ సర్ప్రైజ్ ఇచ్చిన ఈ మూవీలో నీకు నాకు డాష్ డాష్ ఫేం ప్రిన్స్ హీరో, మనసారా ఫేం శ్రీ దివ్య హీరోయిన్ గా నటించారు. ఈ మూవీ సమీక్ష మీకోసం..
స్టోరీ లైన్:
ప్రస్తుత సమాజంలో యువతరం ఆలోచనావిధానం వారి స్థితిగతులు, పిల్లల ప్రేమల పట్ల తల్లిదండ్రుల విధానం తదితర అంశాల సమ్మేలనమే క్లుప్తంగా ఈ మూవీ. శ్రీను (ప్రిన్స్) శైలజ (శ్రీదివ్య) చిన్నప్పటినుంచి స్నేహితులు కాలేజీ చదువుల టైంకి వీరి స్నేహం ప్రేమగా మారుతుంది. హీరో హీరోయిన్లతో పాటు సాయికుమార్ పంపన, కన్నా, అభి, హాసిక అంతా ఒక బ్యాచ్. ఈ బ్యాచ్ ప్రేమలు, వారికి పేరెంట్స్ నుంచి వచ్చిన ఇబ్బందులు వాటిని గట్టెక్కే పరిక్రమమే సినిమా కథ.
హైలెట్స్ అండ్ డ్రాబ్యాక్స్:
హీరో ప్రిన్స్ నటన ప్రాథమిక దశలో ఉంది. మూవీలో తన పరిది మేరకు మెప్పించాడు. యాక్ట్రస్ శ్రీ దివ్య లుకింగ్ నైస్ నటన కూడా ఓకే. ఇంకా సాయికుమార్ పంపన కామెడీ టైమింగ్ బావుంది. హాసిక, కన్నా ఇద్దరు పర్వాలేదు. రావు రమేష్ తల్లితండ్రులకి, వారి పిల్లలకి మధ్య వారధిలా కనిపించాడు. శైలజ తండ్రిగా చేసిన కోటేశ్వర రావు మంచి ఎమోషన్ పండించారు. సినిమా స్టార్ట్ అయిన మొదటి అరగంట ఎంటర్టైనింగ్ గా, చివరి అరగంట ఎమోషనల్ గా వుంది. క్లైమాక్స్ లో సాయికుమార్ పంపన, శైలజ తల్లితండ్రులని అర్ధం చేసుకునే సీన్స్ పరిణితి చెందిన మనస్తత్వాన్ని చాటాయి. ఇక డబుల్ మీనింగ్ డైలాగ్స్, హాసిక బాత్రూంలో తన బాయ్ ఫ్రెండ్ తో చాటింగ్ సీన్స్ మరికొన్ని ఎబ్బెట్టు సన్నివేశాలు వెగటు పుట్టిస్తాయి.
టెక్కికల్ టీం వర్క్ :
మారుతి ఫస్ట్ మూవీ ‘ఈ రోజుల్లో’ సినిమాతో సంగీత దర్శకుడిగా మారిన జేబీ సంగీతం బావుంది. నేపధ్య సంగీతం కూడా ఓకే. సినిమాటోగ్రఫీ లో క్వాలిటీ లోటు కనిపించింది.
బాటమ్ లైన్ :
యూత్ ప్రేమలకి మెసేజ్ ఇచ్చే ఈమూవీ.. డైలాగ్స్, కామెడీ, ప్రేక్షకులను థియేటర్లవైపు నడిపిస్తుంది.