Teluguwishesh 1.png 1.png brothers surya kajal movie review Product #: 38814 stars, based on 1 reviews
  • Movie Reviews

    brothers_wallpapers_6_inner

    సినిమా పేరు : ‘బ్రదర్స్’
    విడుదల తేదీ: 12 అక్టోబర్ 2012

    దర్శకుడు : కె. వి ఆనంద్
    నిర్మాత : బెల్లంకొండ సురేష్
    సంగీతం: హారీష్ జైరాజ్
    నటీనటులు : సూర్య, కాజల్
    తెలుగువిశేష్.కాం రేటింగ్  3.00
    పరిచయం :
            ఒక్క  గజిని సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల హ్రుదయాలను దోచుకున్న హీరో సూర్య. అనంతరం అతని  ఆరు, యముడు సినిమాలు పెద్దగా విజయం సాధించలేకపోయినప్పటికీ సూర్య తెలుగు ప్రేక్షకులకు బాగా  దగ్గరైపోయాడు. తాజాగా అవిభక్త కవలలుగా ద్విపాత్రాభినయంలో కనిపించాడు. దీనికి మూలం ‘రంగం’ సినిమా ద్వారా ఫేమస్ అయిన కే.వి ఆనంద్ డైరెక్షన్లో వచ్చిన తమిళ చిత్రం ‘మాట్రాన్’. మాట్రాన్ సినిమాని తెలుగులో బ్రదర్స్ పేరుతో డబ్ చేసి తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేసారు. సూర్య సరసన కాజల్ అగర్వాల్ నటించిన ఈ సినిమాని తెలుగులో బెల్లంకొండ సురేష్ విడుదల చేసారు. ఈ చిత్ర తీరుతెన్నులు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం...
    కథాంశం క్లుప్తంగా :
          హీరో తండ్రి ఓ ప్రసిద్ధ శాస్త్రవేత్త. అతని చేష్టల పర్యావసానమే క్లుప్తంగా ఈ చిత్రం. జెనెటిక్ శాస్త్రవేత్త అయిన రామచంద్ర (సచిన్ ఖేడేకర్) గర్భవతి అయిన తన భార్య మీద చేసిన ప్రయోగం వికటించి ఆమెకు అవిభక్త కవల పిల్లలు విమల్ (సూర్య 1), అఖిల్ (సూర్య 2) పుడతారు. వారిద్దరూ అవిభక్త కవలలుగా ఉండటం రామచంద్రకి ఇష్టం లేకపోయినా భార్య కోరిక మేరకు వారిని అలాగే పెంచుతారు.
        ఇదే క్రమంలో  రామచంద్ర తన జెనెటిక్ ప్రయోగాలూ చేస్తూ ఎనర్జియోన్ అనే మిల్క్ పౌడర్ కనిపెడతాడు. ఇది అనతికాలంలోనే విపరీతమైన మార్కెట్ పొందటంతో..  ఎనర్జియోన్ ఎలా తయారు చేశారు దీని ఫార్ములా రామచంద్ర నుండి కనిపెట్టడానికి కొంతమంది ప్రయత్నిస్తుంటారు. అలా ఎనర్జియోన్ మీద ఇన్వెస్టిగేట్ చేస్తున్న వారికి అంజలి (కాజల్ అగర్వాల్) కూడా సహాయం చేస్తుంటుంది. ఈ కోణంలో తలెత్తే పరిణామాలే ఈ చిత్ర కథ.
    చిత్రానికి అనుకూల ప్రతికూలాంశాలు :
           సూర్య ఇంటర్నేషన్ స్టార్ అయ్యే లక్షణాలు ఈ చిత్రం ద్వారా వెలుగుచూశాయి.  ద్విపాత్రాభినయంలో సూర్య నటన అమోఘం. విమల్, అఖిల్ రెండు పాత్రల వైవిధ్యం బాగా చూపించగలిగాడు. విమల్ పాత్రకి కార్తి డబ్బింగ్ బావుంది. ఇంటర్వెల్ ముందు అఖిల్ పాత్రలో సూర్య నటన చాలా బావుంది. కాజల్ కి అంజలిగా పెద్ద పాత్రే దక్కింది. నీవే నీవే, రాణి నన్నే, కొమ్మలన్ని పూవై పాటల్లో చాలా అందంగా ఉంది. కే.వి ఆనంద్ ఆమెని చాలా బాగా చూపించాడు. సూర్య తండ్రిగా నటించిన సచిన్ ఖేడేకర్ విలన్ పాత్రలో బాగా చేసాడు. తెలుగులో చిన్న చిన్న పాత్రలో చేసే రవి ప్రకాష్ కి ఈ సినిమాలో పెద్ద పాత్రే దక్కింది. కథపరంగా మన తెలుగు వరకు ఈ రకమైన కాన్సెప్ట్ కొత్త అనే చెప్పుకోవాలి. స్వతహాగా సినిమాటోగ్రాఫర్ అయిన కే.వి ఆనంద్ నీవే నీవే, రాణి నన్నే పాటల చిత్రీకరణ చాలా బాగా చేశారు.
           ఇంటర్వెల్ ముందు కూడా ఇద్దరితో కలిపి చేయించిన ఫైట్ ఓపికకి పరీక్ష పెట్టింది. సెకండాఫ్ లో ఉక్రెయిన్ ఎపిసోడ్స్ ఆసక్తికరంగా ఉన్నా కాజల్ తో ఉక్రేనియన్ భాషని తెలుగులో చెప్పించి విసుగు తెప్పించాడు. సెకండాఫ్ మొత్తం ఎంటర్టైన్మెంట్ లేకపోవడం వల్ల కొంత బోర్ కొడుతుంది. హీరో హీరోయిన్ల రొమాంటిక్ ట్రాక్ మాత్రం పెద్దగా రక్తి కట్టలేదు.
            టెక్నికల్ టీం వర్క్ విషయానికొస్తే.. సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ పాటల్లో ఉక్రెయిన్ ఎపిసోడ్లో చాలా బావుంది. సినిమాకి పెట్టిన ఖర్చు స్క్రీన్ మీద చూపించడంలో సక్సెస్ అయ్యారు. ఎడిటర్ అంటోనీ తన కత్తెరకు మరింత పనిచెబితే బావుండేది.  హారిస్ జై రాజ్ సంగీతంలో 3 పాటలు బావున్నాయి. నేపథ్య సంగీతం కూడా బావుంది. సొమ్ముకు తగ్గ ప్రతిఫలం స్ర్కీన్ మీద కదలాడింది.
    ముగింపు :
          కొత్త కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ  ఎ క్లాస్ సెంటర్స్ ఆడియెన్స్ ను బాగా ఆకర్షిస్తుంది. బి, సి సెంటర్స్ ప్రేక్షకుల స్పందన బట్టే బాక్సాఫీస్ ఫలితం ఉంటుంది.

    ...avnk
More Movie Reviews
More
Get information about Karthikeya 2 Telugu Movie Review, Nikhil Siddharth Karthikeya 2 Movie Review, Karthikeya 2 Movie Review and Rating, Karthikeya 2 Review, Karthikeya 2 Videos, Trailers and Story and many more on Teluguwishesh.com
Get information about Bimbisara Telugu Movie Review, Kalyan Ram Bimbisara Movie Review, Bimbisara Movie Review and Rating, Bimbisara Review, Bimbisara Videos, Trailers and Story and many more on Teluguwishesh.com
Get information about Sita Ramam Telugu Movie Review, Dulquer Salmaan Sita Ramam Movie Review, Sita Ramam Movie Review and Rating, Sita Ramam Review, Sita Ramam Videos, Trailers and Story and many more on Teluguwishesh.com
Get information about Ante Sundaraniki Telugu Movie Review, Nani Ante Sundaraniki Movie Review, Ante Sundaraniki Movie Review and Rating, Ante Sundaraniki Review, Ante Sundaraniki Videos, Trailers and Story and many more on Teluguwishesh.com