నిర్మాత, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ నారాయణ్ దాస్ కె నారంగ్ (76) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఏషియన్ మల్టీప్లెక్స్ , ఏషియన్ థియేటర్స్ అధినేతగా ఉన్న ఆయన.. పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు.ఇటీవల నాగచైతన్య ‘లవ్‌స్టోరీ’,నాగశౌర్యతో ‘లక్ష్య’ సినిమాలను నిర్మించారు. ప్రస్తుతం నాగార్జునతో ‘ఘోస్ట్’, అలాగే ధనుష్‌తో ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆయన కుమారులు సునీల్ నారంగ్, భరత్ నారంగ్ కూడా నిర్మాతలే. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా మూవీ ఫైనాన్షియర్ గా చిత్ర పరిశ్రమకు ఎనలేని సేవలను అందించిన నారాయణ దా కె నారంగ్ మృతిపట్ల సినీ ప్రముఖులు…