Lakshmi parvathi warning to chandrabau and kcr

lakshmi parvathi warning to chandrabau and kcr, lakshmi parvathi warning to kcr, lakshmi parvathi warning to chandra babu, sonia gandhi, state division, tdp, congress party, andhara pradesh, ntr, ntr wife lakshmi parvathi,

lakshmi parvathi warning to chandrabau and kcr

అల్లుడికి లక్ష్మీ పార్వతి వార్నింగ్.. సోనియా గాంధీ షాక్

Posted: 08/19/2013 01:42 PM IST
Lakshmi parvathi warning to chandrabau and kcr

సమైక్యవాదిగా పేరుపడ్డ నందమూరి తారక రామారావు రెండో భార్య లక్ష్మి పార్వతి తన అల్లుడి పై నిప్పులు కురిపించారు. మామను వెన్నుపోటుపడిచి అందలమెక్కిన అల్లుడు పై పార్వతి ఫైర్ అయ్యింది. అల్లుడు పాటించే రెండు కళ్ల సిద్దాంతం పై లక్ష్మీపార్వతి వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. సమైక్యాంద్ర ఉద్యమానికి మద్దతుగా ఆమె నారా చంద్రబాబు నాయుడు పై మండిపడ్డారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం మంటకలిసి పోతుంటే.. చంద్రబాబు ఏసీ రూమ్ లో ఏం చేస్తున్నారని ఆమె తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబు, చంద్రశేఖర్ రావు ఇద్దరు కలిసి.. తెలుగు జాతిని రెండుగా విడగొట్టేందుకు ప్లాన్ వేసుకున్నారని ఆమె అన్నారు. ఈ ఇద్దరు అధికారం కోసం, పదవుల కోసం, రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా విడగొట్టేందుకు ఇటలీ భామ సోనియా గాంధీతో చేతులు కలిపారని ఆమె ఆవేధన వ్యక్తం చేసినట్లు సమాచారం. తెలుగుజాతిని సమన్వయ పరిచి, తెలుగు భాషా సంస్కృతులను విశ్వవ్యాప్తం చేసిన మహా నాయకుడు ఎన్టీఆర్ అన్నారు. రాష్ట్రం విడిపోతే శ్మశానం అవుతుందని ఆమె ఆందోళన చెందారు. రీసెంట్ గా ఎన్టీఆర్ సమాధి వద్ద లక్ష్మీ పార్వతి కన్నీరు పెట్టిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడితే.. ఎన్టీఆర్ సమాధాని ఏం చేస్తారో అని ఆమె ఆవేదన వ్యక్తం చేయటం జరిగింది. ఎవరో పనికిమాలిన వారు అడిగితే సోనియా గాంధీ రాష్ట్ర విభజనకు పూనుకోవటం మంచిది కాదని ఆమె అన్నారు.

 

సోనియా ఆడుతున్న రాజకీయ రాక్షస క్రీడలో ఆంధ్రప్రదేశ్ బలయిపోయిందన్నారు. ఇటలీ సోనియా గాంధీ, కేరళ ఆంటోని, కర్ణాటక వీరప్ప మొయిలీ, మధ్యప్రదేశ్ దిగ్విజయ్ సింగ్, తమిళనాడు చిదంబరం ఆంధ్రప్రదేశ్‌ను విభజించాలని నిర్ణయించుకోవటం అన్యాయమన్నారు. అసలు రాష్ట్రాన్ని విడదీసే అధికారం వీరికి ఎక్కడుందని ప్రశ్నించారు. అయిన లక్ష్మీ పార్వతి అరుపులు, వార్నింగ్ లు పట్టించుకునే వారే కరువైన విషయం ఆమెకు తెలియటం లేదని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. కొత్త జెండ కనిపిస్తే.. వెంటనే మెడలో వేసుకొని తిరిగే లక్ష్మీ పార్వతి తెలుగు జాతి గురించి మాట్లాడటం చాలా ఆశ్చర్యంగా ఉందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తెలుగు జాతి పై అభిమానం, ప్రేమ ఉంటే, తెలుగు దేశం పార్టీని వదిలిపెట్టి ఇలా బయట పార్టీల పంచన చేరుతుందా? అని తెలుగు దేశం సీనియర్ నాయకులు అంటున్నారు. అయితే లక్ష్మీ పార్వతి చంద్రబాబు పై మండిపడిన విధానంతో కాంగ్రెస్ నాయకులకు, సోనియాగాంధీలు షాక్ తిన్నట్లు కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more