State bjp party leaders fights

state bjp party leaders fights, bjp, bharatiya janata Party, mla kishan reddy, muralidhar rao, vidya sagar, venkaiah naidu,

state bjp party leaders fights

కాషాయంలో రేగిన కలకలం

Posted: 07/17/2013 11:43 AM IST
State bjp party leaders fights

రాష్ట్ర బిజెపిలో సీనియర్ల మధ్య గ్రూపు తగాదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన మురళీధర్ రావు పార్టీలో పట్టు సాధించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టుకున్న మురళీధర్ రావు కరీంనగర్ పార్లమెంటు స్థానంపై కన్నేసినట్లు తెలుస్తోంది. ఇది మాజీ హోంమంత్రి విద్యాసాగర్ రావుకు ఏమాత్రం మింగుడుపడడం లేదు. దీనితో పార్టీ వ్యవహారాలలో విద్యాసాగర్ రావు అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. కరీంనగర్ స్థానంపైనే విద్యాసాగర్ ఎన్నో ఆశలు పెట్టుకున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మురళీధర్ రావు ఏకంగా కిషన్ రెడ్డి కి ప్రత్యామ్నాయంగా ఎదగడానికి పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఇది వెంకయ్యనాయుడు గ్రూపుకు ఏమాత్రం మింగుడుపడడం లేదు. ఒకరు తీసుకొన్న నిర్ణయాలకు మరొకరు అడ్డుతగులుతుండడంతో కమలనాథులకు ఏమి చేయాలో పాలుపోవడం లేదు.

 

తెలంగాణపై దీక్ష చేస్తానన్న మురళీధర్ రావు ప్రతిపాదనకు కిషన్ రెడ్డి తిరస్కరించడంతో వీరి మధ్య వైరం తారాస్థాయికి చేరుతోందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. రానున్న ఎన్నికలలో పార్టీ టికెట్ల విషయంపై పార్టీలో జరుగుతున్న అంతర్గత కలహాలు 70ఎంఎం స్ర్కీన్ పై కనపడుతున్నాయి. దీంతో సీనియర్ల మధ్య వివాదాలు పెరిగిపోతున్నాయి. ఇక సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం దక్కించుకోవడం కోసం కమలనాథులు కయ్యానికి కాలుదువ్వుతున్నట్లు సమాచారం. తన నియోజకవర్గంలో వేగంగా జరుగుతున్న పరిణామాలతో బండారు దత్తాత్రేయ ఖంగుతింటున్నారు. సీనియర్లకు ప్రాధాన్యతనివ్వడం లేదంటూ దత్తాత్రేయ అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

 

కిషన్ రెడ్డి సికింద్రాబాద్ వైపు చూస్తున్నారని ప్రచారం జరుగుతుండడంతో దత్తన్న అలకపూనాడని పార్టీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. మరో వైపు రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఇంద్రసేనా రెడ్డి కూడా ఇదే అసంతృప్తితో రగలిపోతున్నట్లు సమాచారం. మల్కాజిగిరి ఎంపీగా తనకు పోటీగా మరికొందరు నేతలు తెరమీదకు వస్తుండడంతో ఆయనకు రుచించడం లేదు. ఈ విధంగా అంతర్గత కుమ్ములాటలు పెరగడంతో రానున్న ఎన్నికల్లో ఎలా గట్టెక్కగలుగుతామని కాషాయదళాలు తల పట్టుకొంటున్నాయి. రాముడి మాట దేవుడెరుగు..గ్రూపు తగాదాలతో అసలుకే ఎసరు వస్తుందేమోనని వారు మదనపడుతున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more