విజయనిర్మల పాత హీరోయిన్. వస్తాడు.. నా రాజు ఈ రోజే.. అంటూ అల్లూరి సీతరామరాజు సినిమాలో సుపర్ స్టార్ క్రిష్ట కోసం ఎదురుచూసే సమయంలో సాగిన పాట అది. ఆ పాటలో ఆమె అద్బుతంగా నటించింది. నిజ జీవితంలో కూడా సూపర్ స్టార్ క్రిష్ణ భార్యగా ఇప్పటి వరకు విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే 68 ఏళ్లు పూర్తిగా నిండి .. 69లోకి అడుగుపెట్టిన విజయనిర్మల తన పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు ఒక తీపి కబురు చెప్పారు. విజయనిర్మల నటిగానే కాకుండా.. నిర్మాతగా, దర్శకురాలిగా కూడా సినిమాలు చేసిన విషయం తెలిసిందే. అయితే దర్శకురాలిగా త్వరలోనే హాప్ సెంచరీ పూర్తి చేస్తానని అభిమానులకు మాట ఇవ్వటం జరిగింది. అంటే త్వరలో సూపర్ స్టార్ క్రిష్ణతో ఒక సినిమా చేస్తున్నట్లు టాలీవుడ్ లో పుకార్లు పుట్టాయి. విజయనిర్మల సినిమా తీయ్యటానికి సిద్దమవుతుందని పుకార్లు రాగానే .. ఫిలింనగర్లో కొన్ని కొత్త కొత్త విషయాలు రోడ్లమీదకు వచ్చాయి. అసలు విజయనిర్మల దగ్గర సినిమా తీసే డబ్బులు ఉన్నాయా? వారి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలిగిపోయినట్లే? ఇప్పుడు సినిమా తీయ్యటానికి గల కారణం ఏమిటి అనే ప్రశ్నలు సినీజనాలు మద్య నలుగుతున్నాయి. ఈ విషయం పై నానక్ రామ్ గూడ్ ప్రజలు రకరకాల కథలు చెబుతున్నారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కరుణించటంతో.. విజయనిర్మల కు కాసుల వర్షం కురిసినట్లు నానక్ రామ్ గూడ రైతులు చెబుతున్నారు. అవుటర్ రింగు రోడ్డు వేసే సమయంలో నానక్ రామ్ గూడ వద్ద విజయనిర్మల కు కొన్ని భూములు ఉన్నాయట. అయితే రింగు రోడ్డు వారి భూమిని కలుపుకోని వెళ్లాల్సిన రోడ్డు.
అయితే రాజశేఖర్ రెడ్డి కాళ్లు, గడ్డలు, పట్టుకొని, హీరో మహేష్ బాబు ను తీసుకువెళ్లి .. ఆయనతో మాట్లాడించి, ఆ రోడ్డు ను కాస్త.. పక్క రైతుల భూమిలోకి తిప్పటంతో.. విజయనిర్మల స్థలానికి మంచి రేటు వచ్చినట్లు నానక్ రామ్ గూడ రైతులు చెబుతున్నారు. మా భూముల్లోకి రోడ్డును నెట్టి .. ఆమె ఇప్పుడు సినిమాలు తీస్తుందా అని నానక్ రామ్ గూడ ప్రజలు మండిపడుతున్నారు. ఆ స్థలాలను కొన్ని సంస్థలకు లీజు కు ఇవ్వటం జరిగింది. ప్రతి నెల ఆ సంస్థల నుండి వచ్చే సొమ్ముతో ఏం చెయ్యాలో ఆమెకు తెలియటం లేదని సినీజనాలు అంటున్నారు. ఆ డబ్బుతోనే సినిమా తీయ్యటానికి సిద్దమైనట్లు టాలీవుడ్ టాక్. డబ్బులు ఎక్కువుగాఉంటే ఏం చేస్తారు .. ఇలా సినిమాలు తీసి చేతులుకాల్చుకున్న సినీ పెద్దలు చాలా మంది ఇండస్ట్రీలో ఉన్నారనే విషయం విజయనిర్మల తెలియదేమోనని సినీజనాలు అంటున్నారు. ఆమె తీసే సినిమాలో ఐటమ్ సాంగ్ లో విజయనిర్మల నటించిన ఆశ్చర్యం లేదని ఫిలింనగర్లో జోకులు పేలుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more