Sachin tendulkar is safe

Sachin Tendulkar,Sachin,Sandeep Patil,retirement

There is no imminent threat to Sachin Tendulkar’s position in the Indian team. The remarks of former captains — that the selectors should ask the little master his future plans — has not cut much ice with Sandeep Patil & Co.

Sachin Tendulkar is safe.png

Posted: 11/28/2012 12:26 PM IST
Sachin tendulkar is safe

Sachin

'భారత క్రికేట్ చరిత్రలోనే ఇక ఏ ఆటగాడు సృష్టించని రికార్డ్లు, ఈ ఆటగాడి సొంతం. 19 ఏళ్ళకే భారత క్రికెట్ జట్టులో ఒకడిగా స్థానం సంపాదించి, ఆటగాడిగా తోలి నాళ్ళ నుండే ఎన్నో సంచలనాలు సృష్టించి, సెంచరీలు తన ఖాతాలో వేసుకున్న ఆటగాడు, ప్రతీ క్రికెట్ ఆటగాడికి, అభిమానికి ఆదర్శం, సచిన్ టెండూల్కర్. ఈ 'మాస్టర్' ని భగవంతునిగా కొలిచేవారు కోకొల్లలు. మ్యాచ్ కీలక స్తితిలో ఉన్నా, అత్యవసర స్థితి లో, ప్రత్యర్ధుల బౌలింగ్ ను తట్టుకొంటూ, చాకచక్యంగా బ్యాటింగ్ చేస్తూ, పరుగుల ప్రభంజనం సృష్టించాలి అంటే, సచిన్ బరిలో దిగాల్సింది... అతి కీలకమైన మ్యాచుల్లో సెంచరీలు చేస్తూ కూడా అవుట్  అవ్వని ఘనత, 'మాస్టర్' ది.

భారత క్రికెట్ జట్టు ఏమాత్రం ఫార్మ్లో లేని సమయం లో కూడా, సచిన్ బరిలోకి దిగుతున్నాడు అంటే, అభిమానుల గుండెల్లో ఆనందం, ఇతర దేశాల జట్టులకు గుబులు పుట్టేది. ఇక ఇండియా - పాకిస్తాన్ మ్యాచుల్లో 'మాస్టర్' పరుగులు, సిక్ష్సర్లు, సెంచరీలు, అభిమానుల ఆనందోత్సాహాలతో నిండిపోయేది, స్టేడియం. అయితే అన్ని రోజులు ఒకలా ఉండవు అన్న చందంగా, నలభైలకు దగ్గరవుతున్న 'మాస్టర్', ఇంతకూ ముందులా కాదు కదా కనీస ఫామ్ లో ఉండడానికే నానా తంటాలు పడుతున్నాడు.

సచిన్ ఆట తీరులో ఈ మార్పు, 2012 ప్రపంచ కప్ కన్నా ముందే ఒచ్చినా, కప్ కొట్టిన ఆనందంలో, ఈ విషయం కొద్ది రోజులు ఎవ్వరూ పట్టించుకోలేదు. కాని, తరువాతి T20, ఇతర టెస్ట్ సీరీస్ లో, మాస్టర్ ఆట తీరు అత్యంత నిరుత్సాహంగా ఉండటమే కాక, జట్టు ఓటమికి దారి తీసింది. ఇక విశ్లేషకులు, ప్రపంచ కప్ లో సచిన్ ఆట తీరు దగ్గరి నుండి, ఇప్పటి వరకు ఆడిన, ఆడుతున్న మ్యాచుల్లో మాస్టర్ ఆట తీరు పై, పూర్తీ స్థాయి నివేదికనే తయారు చేసారు. భారత జట్టు మళ్ళీ పుంజుకోవాలంటే ఇతర అంశాలతో పాటు మాస్టర్ ఇక జట్టు నుండి తప్పుకోవాలని, టెస్ట్ సీరీస్ లో కూడా తన పనితనం చూబించక, రిటయర్మేంట్ ప్రకటించాలని సూచిస్తున్నారు.

సచిన్ కు గురువుగా వ్యవహరించిన సునీల్ గవాస్కర్ సైతం ఇదే మాటను వల్లిస్తున్నాడు... ఈ మాధ్య జరిగిన ఇంగ్ల్యాండ్ టెస్ట్ సీరీస్లో కూడా సచిన్ తీసిన 4, 6, 8 పరుగుల స్కోర్ మాస్టర్ ఇక రెస్ట్ తీస్కోవాలి అనే ఆలోచనని బలోపేతం చేస్తున్నాయి.అయితే సచిన్ మాత్రం ససేమీరా అంటున్నాడు, 'ఆట లో చేరాలి అని నా స్వంత నిర్ణయం పై నేను క్రికెట్లో అడుగుపెట్టినప్పుడు, ఎప్పుడు వేళ్లిపోవాలో కూడా నిర్ణయించుకోవలసింది నేనే', అంటూ స్టేట్మెంట్లు ఇస్తున్నాడు... 'మాస్టర్' మాస్టర్ ప్లాన్ ఏంటో మరి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Apsrtc sub charges
Ntr demands rajamouli plan a film  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more