Violence over anti islam film

Muslim-Americans: Anti-Islam Film, Violent Protests not Justified,US Government|Omar Al-Mukhtar|AQAP|Anti-Prophet Muhammad Film|Al-Qaida Threat To US Diplomats|Al-Qaida In The Arabian Peninsula|Al-Qaida|Ali Abdullah Saleh

Muslim-Americans: Anti-Islam Film, Violent Protests not Justified

Muslim.gif

Posted: 09/15/2012 05:57 PM IST
Violence over anti islam film

Muslim-Americans: Anti-Islam Film, Violent Protests not Justified

ఒక మతాన్ని రెచ్చగొట్టిన సినిమా? ఆ సినిమాతో  ప్రపంచ దేశాల్లో  సినిమా చిచ్చు రేగుతుంది.  ప్రపంచ దేశాల్లో ఉన్న ముస్లీలు అందరు కన్నెర్ర చేశారు. ఆ నిమా ప్రపంచ దేశాల్లో కలకలం రేపుతోంది. కల్లోలం సృష్టిస్తోంది. ఇస్లాం మతాన్ని కించపరుస్తూ తీసిన ఆ సినిమాపై ముస్లిం దేశాలు కన్నెర్ర చేశాయి. అమెరికాదే ఈ పాపమంటూ దుమ్మెత్తి పోశాయి. ప్రపంచ వ్యాప్తంగా అమెరికన్ రాయబార కార్యాలయాలను ఆందోళనాకారులు ధ్వంసం చేశారు. నిరసనలతో హోరెత్తించారు. మహమ్మద్ ప్రవక్త  స్త్రీలోలుడనీ, ఆయన శిష్య గణం హంతకులనీ చూపిస్తూ తీసిన 15 నిమిషాల నిడివి కలిగిన ఓ సినిమా గత కొన్ని రోజులుగా యూ ట్యూబ్ లో కనిపిస్తోంది. ఈ సినిమాను ఎవరు, ఎందుకు, ఏ ప్రయోజనాలతో తీసారో తెలీదు. దానిని ఎవరు అప్ లోడ్ చేశారో కూడా తెలీదు. అది అమెరికా గడ్డపై నుంచే అప్ లోడ్ అయిందని తెలుసుకున్న ముస్లిం సోదరులు మరింత ఆగ్రహంతో రగిలిపోయారు. జర్మనీ, బ్రిటన్, ట్యునిస్, ఈజిప్టు, యెమన్, లెబనాన్, పాకిస్థాన్ దేశాలు ఆందోళనలతో అట్టుడికిపోయాయి. సూడన్ లో అమెరికా రాయబార కార్యాలయం ఆందోళనాకారుల దాడులతో దద్దరిల్లింది. ఖర్టుంలోని జర్మన్ ఎంబసీ కూడా నిరసనలకు దగ్ధమైంది. కైరోలో ఆందోళనాకారులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దాదాపు 500 మంది నిరసన కారులను అరెస్టు చేశారు. వీధులను ముళ్లకంచెలతో, పోలీసు వాహనాలతో దిగ్బంధించారు.  ఈజిప్టు అధ్యక్షుడు మహమ్మద్ ముర్సీ ఈ సినిమాను వ్యతిరేకించారు. అమెరికా రాయబార కార్యాలయాలముందు ఈజిప్టు ప్రజలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.

Muslim-Americans: Anti-Islam Film, Violent Protests not Justified

విదేశీ రాయబార కార్యాలయాలకు తగిన రక్షణ కల్పిస్తామంటూనే  ముస్లిం సోదరులను బాధపెట్టే ఇలాంటి సినిమాలు తీయడం తగదని ముర్సి అన్నారు. అటు సూడాన్, అఫ్గానిస్థాన్, యెమన్ లు ఆందోళనలతో అట్టుడికాయి.  లిబియాలోని బెంఘాజీలో అమెరికా కాన్సులేట్ కార్యాలయం అగ్నికి ఆహుతైంది. ఈ దాడుల్లో ముగ్గురు అమెరికా రాయబారులు చనిపోయారు.  ఇక మన దేశంలోనూ నిరసనలు వెల్లువెత్తాయి. చెన్నైలోని అమెరికన్ కాన్సులేట్ కార్యాలయంపై ఆందోళనాకారులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఆందోళనాకారుల తాకిడికి  కార్యాలయం గాజు అద్దాలు పగిలిపోయాయి. నిరసన కారులను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీ చార్జి చేశారు. 25 మందికి స్వల్ప గాయాలయ్యాయి.  వివాదస్పదమైన ఈ సినిమాను ఇంటర్నెట్ లో సైతం వీక్షించకుండా నిషేధించాలని భారత్ భావిస్తోంది. ఈ సినిమా అందుబాటులో దొరికే అన్ని వెబ్ పేజీలను నిషేధించాలంటూ జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం చేసిన విన్నపాన్ని హోం శాఖ పరిశీలిస్తోంది. హైదరాబాద్ లోనూ ఈ సినిమాపై నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆందోళనాకారులు అమెరికా జాతీయ జెండాను తగుల బెట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tdp cadres cool to naidus padayatra
Ex minister komatireddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more