యశ్‌రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న సినిమా ద్వారా ప్రియాంక చోప్రా కజిన్ హీరోయిన్గా పరిచయమవుతున్నదని తెలిసినప్పుడు బాలీవుడ్ ఆసక్తిగా ఎదురుచూసింది. అది జరిగి చాలా రోజులే గడిచింది. ప్రస్తుతానికి వస్తే ఆమె 'ప్రియాంక చోప్రా కజిన్' అనే ముద్రనుంచి బయటపడి తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకుంది. ఆమే పరిణీతి చోప్రా. 2011 డిసెంబర్లో విడుదలై హిట్టయిన 'లేడీస్ వర్సెస్ రిక్కీ బెహల్' సినిమాలో డింపుల్ చద్దా పాత్రలో ఆమె గొప్పగా రాణించింది.
ఆ సినిమాలో అనుష్క శర్మ, దీపనిత శర్మ, అదితి శర్మ కూడా హీరోయిన్లుగా నటించినప్పటికీ పరిణీతికి మంచి పేరు రావడం గమనార్హం. అందుకే ఆమెకు ఉత్తమ నూతన తారగా ఫిల్మ్‌ఫేర్, స్టార్ స్క్రీన్, జీ సినీ, అప్సర ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రొడ్యూసర్స్ గిల్డ్, స్టార్‌డస్ట్, కాస్మోపాలిన్ అవార్డులు రావడం ఆశ్చర్యం కలిగించదు. ఒకే సినిమాతో ఇన్ని అవార్డుల వచ్చాయంటే తెరపై ఆమె అభినయం ఎలా ఉందో అర్థం చేసుకోవాల్సిందే. "ఆ సినిమాలో చేసేప్పుడు నా మైండ్లోకి అవార్డుల సంగతే రాలేదు.
అయితే అవార్డులకి నా పేరు నామినేట్ అయినట్లు తెలిసినప్పుడు మాత్రం గెలిస్తే బాగుండుననుకున్నా. గెలిచాక ఎంత ఆనందపడ్డానో'' అని తెలిపింది పరిణీతి. ఇక ఈ నెల 11న రాబోతున్న రెండో సినిమా 'ఇష్క్‌జాదే' మీద ఆమెకు చాలా అంచనాలే ఉన్నాయి. దీన్ని కూడా యశ్‌రాజ్ ఫిలిమ్స్ సంస్థే నిర్మించింది. ఇందులో హీరోగా పరిచయమవుతున్న అర్జున్ కపూర్ (బోనీ కపూర్ కొడుకు) సరసన సోలో హీరోయిన్గా ఆమె కనిపించబోతోంది.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more