Cbi vehicle no 5678

Telugu News, Telugu Cinema News, Andhra News, Telugu Cinema Videos, Andhra Political News, Telugu Cinema Actress Photos, Hot Gossips, Tollywood Gossips and Tv Shows

Telugu News, Telugu Cinema News, Andhra News, Telugu Cinema Videos, Andhra Political News, Telugu Cinema Actress Photos, Hot Gossips, Tollywood Gossips and Tv Shows

Dongalabani 5678.gif

Posted: 02/27/2012 01:51 PM IST
Cbi vehicle no 5678

AP09-BP-5678

నాలుగు చక్రాల బండి... పుట్టిస్తుంది అధికారుల గుండెల్లో గుబులు... అదంటే అందరికి దడ.. దాని నెంబర్ 5678...  అదేంటో చెప్పుకోండి చూద్దాం...  కారు. ఇదేదో కొత్త పొడుపు కథలా ఉందని అనుకుంటున్నారా ? అవును కొత్త పొడుపు కథే... దీని గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి....

మంత్రులు, పెద్దపెద్ద వ్యాపారవేత్తలు, మేధావులనిపించుకున్న ఐఏఎస్‌లు, కొమ్ములు తిరిగిన ఐపీఎస్‌లు.. సైతం దీనికి భయపడాల్సిందే. ఈ నెంబర్ నెంబర్ వినగానే వారికి జైల్లో ఖైధీ నెంబర్ని  గుర్తొచ్చేలా చేస్తుంది... నిత్యం టీవీల్లో ప్రముఖంగా కనిపిస్తున్న ఈ కారు నెంబర్ పాపులర్ అయిపోయింది. అవినీతి అధికారుల గుండెల్లో ఈ నెంబర్ గుబులు పుట్టిస్తుంది. అదే హైదరాబాద్ సీబీఐ అధికారుల వద్ద ఉన్న మహీంద్రా బొలెరో వాహనం. ఆర్నెల్ల కిందట... కర్ణాటక మంత్రి ఒకరిని బళ్లారి నుంచి హైదరాబాద్‌కు ఏ ముహూర్తాన మోసుకొచ్చిందోగానీ, అప్పట్నుంచీ ఎంతోమంది ప్రముఖులను మోసుకెళ్లడమే దాని పనిగా మారింది.

మంత్రులు, పెద్దపెద్ద వ్యాపారవేత్తలు, మేధావులనిపించుకున్న ఐఏఎస్‌లు, కొమ్ములు తిరిగిన ఐపీఎస్‌లు.. ఇలా వీఐపీలను మోసుకొంటూ సీబీఐ కార్యాలయానికి, అక్రమార్కుల ఇళ్లలో సోదాలకు ఎడాపెడా చక్కర్లు కొడుతోంది!! ఈ కారు వస్తోందంటే చాలు.. అటు సీబీఐ కోర్టులో సెక్యూరిటీ దగ్గరి నుంచి చంచల్‌గూడ జైలు సిబ్బంది దాకా అప్రమత్తమైపోతారు. అది ఆగీఆగకముందే చుట్టుముట్టి రక్షణ కల్పిస్తారు. టీవీల్లో నిత్యం వార్తలు చూసే చాలామందికి తెలిసిన ఈ కారు గత ఏడాది సెప్టెంబర్ 4న బళ్లారి నుంచి కర్ణాటక మంత్రి గాలి జనార్దన రెడ్డి, ఓబుళాపురం మైనింగ్ కంపెనీ ఎండీ శ్రీనివాసరెడ్డిని హైదరాబాద్‌కు మోసుకొచ్చింది. ఆ సమయంలో బళ్లారి నుంచి దారి పొడవునా టీవీ చానెళ్ల రిపోర్టర్ల సెల్‌ఫోన్లకు మహీంద్రా బొలెరో నంబర్ (ఏపీ09 బీపీ5678) మెసేజ్ రూపంలో చేరింది. ఇక్కడికొచ్చాక.. వారిద్దరినీ సీబీఐ అధికారులు ఇదే వాహనంలో కోర్టుకు, జైలుకు, కోఠిలోని సీబీఐ కార్యాలయానికి తీసుకెళ్లారు. దీంతో పదేపదే టీవీల్లో కనిపించి ఈ వాహనం తెగ పాపులర్ అయిపోయింది. అంతేనా..! ఏ పత్రిక చూసినా మొదటిపేజీలో ఆ కారు ఫోటోలే. వారిద్దరి తర్వాత ఈ కారెక్కిన మరో వీఐపీ.. దేశవిదేశాల్లోని ప్రభుత్వాలతో సంబంధాలు పెట్టుకొని వ్యాపారాలు చేసే కోనేరు ప్రసాద్. కోర్టుకు, జైలుకు, దిల్‌కుషా అతిథిగృహానికీ.. అన్నిటికీ ఆయన తిరిగింది ఈ కారులోనే!

గనులశాఖ అధికారి రాజగోపాల్‌ని.. మరో ఐఏఎస్ శ్రీలక్ష్మిని.. జగతి పబ్లికేషన్స్ వైస్‌చైర్మన్ విజయసాయిరెడ్డిని, ఎమ్మార్ ఉన్నతోద్యోగి విజయ రాఘవను సీబీఐ కోర్టుకు, చంచల్‌గూడ జైలుకు, దిల్‌కుషా అతి«థిగృహానికి మోసుకుంటూ తిరి గింది ఈ వాహనమే! సాయిరెడ్డివారికి ఈ కారులో కూర్చోగానే ఎక్కడ లేని హుషారూ వచ్చేస్తుంది. ఇందులో వెళ్లేటప్పుడు ఆయన చిరునవ్వుతో మీడి యా ప్రతినిధులకు చేయి ఊపుతారు. ఇక.. ఎర్రబుగ్గ కారులో తిరిగే హోంశా ఖ సెక్రటరీ బీపీ ఆచార్యను సైతం కోర్టుకు, నిమ్స్ ఆస్పత్రికి, బంజారాహిల్స్‌లో ఉండే జడ్జి క్వార్టర్స్‌కు, చివరకు జై..లు..కు మోసుకొచ్చిన ఘనత ఈ వాహన రాజానిదే!

అంతేకాదు.. సామాన్యులకు అంతగా తెలియని సామాన్యుడు, యువనేత అనుచరుడు సునీల్ రెడ్డి ఇంటికి ఓ వేకువజామున వెళ్లి ఆయన్ను సీబీఐ కార్యాలయానికి మోసుకొచ్చిందీ ఈ కారే. కోఠిలోని సీబీఐ కార్యాలయంలోనో.. దిల్‌కుషా అతిథి గృహం వద్దో తరచూ కనిపించే ఈ వాహనంలో సీబీఐ అధికారులు కదిలారంటే మీడియా అప్రమత్తమైపోతుంది!  కెమెరాలన్నీ దీనివైపే ఫోకస్ అవుతాయి. "ఎవర్నో తీసుకు రావడానికి దొంగలబండి (మీడియా ప్రతినిధులు పెట్టుకున్న పేరు) బయలుదేరింది. కాసేపట్లో ఏదైనా అరెస్టు జరగొచ్చు'' అంటూ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఫోన్లలో మెసేజ్‌లు పంపించుకుంటారు. ఫోన్‌కాల్స్ చేసి తమ పైవారిని అప్రమత్తం చేస్తారు. బైకులు స్టార్ట్‌చేసి ఆ వాహనం వెంటపడతారు. సీబీఐ గేలానికి ఏదైనా చేప చిక్కిందా... పండగే! దటీజ్ బొలెరో 5678. ఇప్పుడు ఈ వాహనాన్ని చూసిన అవినీతి నాయకులకు, అధికారులకు  ఫ్యాంట్లు కూడా తడుస్తున్నాయని మీడియా వారు అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tamanna is a hard worker
Allu aravinds mind blowing offer to mahesh babu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more