Nayantara re entry into tollywood with nagarjuna

Nayantara Re Entry Into Tollywood With Nagarjuna,ayantara Re Entry into Tollywood With Nagarjuna, Nayantara With Nagarjuna Movie, Nayantara Nagarjuna Movie Name, Nayantara Hot Clips, Nayantara

Nayantara Re Entry Into Tollywood With Nagarjuna

Nayantara.gif

Posted: 02/07/2012 03:46 PM IST
Nayantara re entry into tollywood with nagarjuna

nayanthara

దక్షిణాదిన సిసలైన లవ్ బర్డ్ నయన తార. కేరిర్ లో ఎన్నో ఉత్థానపతనాలను చవి చూసిన ఈ బెంగళూరు భామ దర్శక నటుడు ప్రభుదేవాను ప్రాణసమానంగ ప్రేమించి .. ఓ ఇంటిదవ్వడానికి సిద్దమయ్యారు. అయితే ఈ భామ ప్రస్తుతం సఖుని వీడి సినిమాపైనే ఎక్కువ ప్రేమను చూపిస్తున్నారు. అసలు ప్రభు నయన మధ్య ఏం జరిగిందంటే? ప్రభు ఈ మధ్య ‘ఎంగేయుమ్ కాదల్’ చిత్రానికి దర్శకత్వం వహించే సమయంలో ప్రభు అందాల హన్సికతో ప్రేమలో మునిగి, నయన్ ని సరిగా పట్టించుకోలేదని దాంతో ఈ ఇద్దరి మధ్య దూరం పెరిగిందని ప్రచారం సాగుతోంది. అయితే సినీ కేరీర్ కొనసాగింపుపై నయన్ చూపిస్తున్న ఉత్సాహం కూడా ఇద్దరి మధ్యా దూరం పెరుగుతోందనడానికి ఊతమిస్తోందని కోలివుడ్ వాసులు అంటున్నారు.

ఇన్నాళ్లు ఒకరకమైన ఇబ్బందికర స్థితిలో నయన జీవితం సాగిందని ఇప్పుడు నయన మనసు ప్రశాంతంగా ఉందని అందుకే సినిమాలు ఒప్పుకుంటునని తన మిత్రులతో చెబుతుందని అంటున్నారు. నయనతార తన చివరి సినిమా ‘శ్రీరామరాజ్యం’ అని చెప్పిన ఈ మలబార్ బ్యూటీ ఇప్పుడు కొత్త నాగార్జునతో సినిమా చేయడానికి సిద్దమైందని తెలుస్తుంది.

అది మాత్రమే కాదు... ఇక వరుసగా సినిమాలు చేయాలని కూడా నిర్ణయించుకున్నారట. ఇటు తెలుగు, అటు తమిళ్ భాషల్లో సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యారట. అందుకు కారణం ఉందని నయనతార చెబుతుందట. తమిళ పరిశ్రమ నాకు స్టార్‌డమ్ తెచ్చిపెట్టిందని మరియు తెలుగు పరిశ్రమ దాన్ని రెట్టింపు చేసింది కాబట్టి అందుకే ఈ రెండు భాషల్లోనూ నయన సినిమాలు చేయాలనుకుంటుందని కోలివుడ్ వర్గాలు అంటున్నాయి.

నాగార్జునతో ఈ మలబార్ బ్యూటీ చేయబోతున్న సినిమా రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ అట. ఇదిలా ఉంటే... ఇటీవలే తమిళంలో అజిత్ సరసన ఓ చిత్రంలో నటించడానికి నయనతార అంగీకరించారనే వార్త కోలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది. విష్ణువర్థన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుందని సమాచారం.

ఇటీవల ఈ చిత్రకథ, పాత్ర గురించి నయనతార దగ్గర విష్ణువర్థన్ చెప్పారని సమాచారం. నయనతార ఇందులో నటించడానికి సుముఖంగానే ఉన్నారట. త్వరలో అధికారికంగా సంతకం చేస్తారని తెలుస్తోంది. ఈ చిత్రంలో నటించడానికిగాను నయనతార తీసుకోబోతున్న పారితోషికం కోటిన్నరకు కాస్త తక్కువ అని కోలీవుడ్‌వారు అంటున్నారు. మరికొన్ని సినిమాలకు సంబంధించి చర్చలు కూడా జరుగుతున్నాయట. ఎలా లేదన్నా నయనతార ఈ ఏడాది మూడు, నాలుగు సినిమాలు కమిట్ అయ్యే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

నయన తార మాత్రం సీతమ్మ దేవి నన్ను కాపాడిందని చెబుతుందట. అంటే శ్రీరామ రాజ్యం సినిమా తరువాత నయన సినిమాల్లో నటించదని అందరి తెలిసిందే. అయితే.. ప్రభుతో నయన పెళ్లి ఆగిపోవటం చాలా మంచిదట. ప్రభు పెళ్లి నుండి సీతమ్మ కాపాడి, నయన ను కేరీర్ చూసుకోమని చెప్పిందని, అందుకే ఆమె సినిమాల్లో నటిస్తుందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Yuvraj could return to cricket in 10 weeks
Priyanka gandhi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more