Pawan kalyans panja story

Pawan Kalyans Panja story,Pawan Kalyan Panja First Look Posters.Panja First Look Wallpapers,Panja Movie New posters,Pawan Kalyan's Panja First Look Stills,Panja stills

Pawan Kalyans Panja story

Panja.GIF

Posted: 12/06/2011 07:54 PM IST
Pawan kalyans panja story

Pawan Kalyans Panja story

పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా విష్ణువర్థన్ దర్శకత్వంలో సంఘమిత్ర ఆర్ట్, ఆర్కామీడియా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘పంజా’. అన్ని కార్యక్షికమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈ నెల 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సన్నద్ధం అవుతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నిర్మాతలు శోభు యార్లగడ్డ, నీలిమా తిరుమలశెట్టి, ప్రసాద్ దేవినేని, నగేష్‌ముంతా .టైటిల్ అందరినీ ఆకట్టుకుంటోంది.

 పవన్‌తో సినిమా అనుకున్నప్పుడు ఈ చిత్రానికి దర్శకుడిగా విష్ణువర్ధన్ పేరును పవన్‌కల్యాణే సూచించారు. ఇలాంటి స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు నిర్మాణ పరంగా కొత్తవారే న్యాయం చేయగలరని పవన్‌కల్యాణ్ మాకు అవకాశం ఇచ్చారు.మాఫియా బ్యాక్‌వూడాప్‌లో నడిచే ప్రేమ కథాచివూతమిది. వవన్‌కల్యాణ్ పాత్ర పేరు జయ్‌దేవ్. కోల్‌కత్తా నేపథ్యంలో కథ నడుస్తుంది.యాక్షన్, రొమాన్స్, ఎంటర్‌టైన్‌మెంట్ అన్నీ సమపాళ్లలో వుంటాయి. . కథానుగుణంగా ‘పంజా’ అనే టైటిల్‌పెట్టాం.

దర్శకుడు విష్ణువర్ధన్ మొదట ఈ చిత్రానికి ‘షాడో’ అనే టైటిల్‌ను సూచించారు. అయితే ఈ చిత్రంలో కథానాయకుడు పవన్‌కల్యాణ్ దృక్పథాన్ని ప్రతిబింబించేలా సింబాలిక్‌గా వుంటుందని ‘పంజా’ అని టైటిల్ నిర్ణయించాం. పంజా టైటిల్ అందరికీ నచ్చింది.  యాక్షన్‌తో పాటు ఎంటర్‌టైన్‌మెంట్  ఈ చిత్రంలో యాక్షన్‌తో పాటు వినోదం కూడా సమపాళ్లలో వుంటుంది.

మొదటి అర్థభాగమంతా అలీ, రెండో భాగమంతా బ్రహ్మానందం వినోదాన్ని పండిస్తారు. దర్శకుడు విష్ణువర్థన్ స్టైలిష్‌గా సినిమాని తెరకెక్కించాడు. విజువల్‌గా ప్రతీ ఫ్రేమ్ చాలా గ్రాండ్‌గా వుండేలా శ్రద్ధ తీసుకున్నారు. ఈ చిత్రంలో జాకీవూషాఫ్ ప్రతినాయకుడి పాత్రను పోషించాడు. అడివి శేష్ కూడా విలన్‌గా కనిపిస్తాడు.ఎక్కువ శాతం చిత్రీకరణ కలకత్తాలో,కొంత భాగం దుబాయ్‌లో జరిపాం. పొల్లాచ్చిలో పాటతో పాటు కొంత టాకీ చిత్రీకరించాం.

 రియలిస్టిక్ యాక్షన్... బాలీవుడ్‌లో ‘క్రిష్’ సినిమాకి యాక్షన్ సీక్వెన్సెస్ రూపకల్పన చేసిన శ్యాన్‌కౌషల్ ఈ చిత్రానికి ఫైట్స్ సమకూర్చుతున్నాడు. యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ చాలా రియలిస్ట్‌గా వుంటాయి. పవన్‌కల్యాణ్ యాక్షన్ ఎపిసోడ్స్‌పై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు.యువన్‌శంకర్ రాజా బాణీలు శ్రోతల్ని బాగా ఆకట్టుకుంటున్నాయి. ఆడియో పెద్ద విజయం సాధించింది. ముఖ్యంగా ‘పాపారాయుడు’ పాట విశేషంగా ఆకట్టుకుంటోంది. రీరికార్డింగ్ కూడా ప్రధానాకర్షణగా వుంటుంది.

హీరోయిన్లు అంజలీ, కొత్తవారైనా బాగా పెర్‌ఫార్మ్ చేశారు. కొత్తవారైతే ప్రేక్షకుల్లో ఆసక్తి వుంటుందని హీరోయిన్స్‌గా వారిని తీసుకున్నాం. కథానుగుణంగా ఇద్దరికీ సమాన ప్రాధాన్యత వుంటుంది. ఈ సినిమా విషయంలో పవన్‌కల్యాణ్ అందించిన సహకారం మరువలేనిది. కలకత్తాలో 55 రోజుల పాటు అవిక్షిశాంతంగా చిత్రీకరణలో పాల్గొన్నారు. మోకాలికి గాయమైన లెక్కచేయకుండా షూటింగ్‌లో పాల్గొన్నారు. మొత్తం 110 రోజుల్లో చిత్రీకరణ పూర్తిచేశాం. ప్రతి విభాగంలో హేమాహేమీలైన సాంకేతిక నిపుణులు ఈ సినిమా కోసం పనిచేశారు.

పంజా ఓ బ్రాండ్ అయిపోయింది... యూత్‌లో పంజా ఓ బ్రాండ్ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. పంజా టీ షర్ట్సు, హ్యాండ్‌బ్యాండ్స్‌కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమా తమిళ వెర్షన్‌ను నెలరోజుల్లో సిద్ధం చేస్తాం. బాలీవుడ్ రీమేక్ హక్కుల్ని కూడా చాలా మంది అడుగుతున్నారు. ఈ నెల 9న భారీ స్థాయిలో ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chiranjeevi helps ap cm kiram reddy
Ysr congress president y s jaganmohan reddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more