టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ మంచి స్టోరీ లైన్ ఉన్న చిత్రాలను ఎంచుకుని ఫ్యామిలీ ఆడియన్స్ ను కట్టిపడేసే ప్రయత్నాలు చేస్తుండటం తెలిసిందే. గత కొంత కాలంగా ఈయన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సవ్వడి చేయలేకపోయినా.. ఆయన వెనకడుగు వేయడం లేదు. ఇటీవల శర్వా నటించిన ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ భారీ అంచనాలతో విడుదలైనా ఆడవాళ్లను చిత్రానికి రప్పించలేకపోయింది. ఈ చిత్రం తన కెరీర్లోనే అతిపెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. కాగా, ఇప్పుడు శర్వాకు చక్కని హిట్టు అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలో శర్వా తాజాగా నటించిన ‘ఒకే ఒక జీవితం’ విడుదలకు సిద్ధంగా ఉంది.
శ్రీకార్తిక్ దర్శకత్వం ఈ చిత్రం టైం ట్రావెల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేశాయి. మేకర్స్ తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. శర్వానంద్ ఏదో మ్యూజిక్ కాంపిటేషన్‌కు ప్రాక్టీస్ చేస్తున్నట్లు ట్రైలర్ ప్రారంభమవుతుంది. అంతలోనే రీతూవర్మ ‘కంగ్రాట్స్ ఆది.. ఫస్ట్ రౌండ్లో సెలెక్ట్ అయ్యావ్’ అంటూ శర్వాతో పలికిన సంభాషణ ఆకట్టుకుంటుంది. అయితే కాంపిటేషన్‌లో శర్వా పాడలేక ఇబ్బంది పడుతుంటాడు. అసలు ఎందుకు ఇబ్బంది పడుతున్నాడనేది సినిమా చూస్తే తెలుస్తుంది. మ్యారేజ్ బ్రోకర్‌గా వెన్నెల కిషోర్ ట్రైలర్లో కనింపించాడు.
ఇక ప్రియదర్శి తను ఎలాగైన ఒక పర్ఫెక్ట్ అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలని అనుకుంటుంటాడు. ‘ఏదేమైనా పెళ్ళి కరెక్ట్ టైంలోనే జరగాలిరా’ అంటూ వెన్నెల కిషోర్ డైలాగ్‌తో నాజర్ ఎంట్రీ ఇస్తాడు. నాజర్ ఈ చిత్రంలో సైంటిస్ట్‌గా కనిపించనున్నాడు. టైం ట్రావెల్ మిషన్‌తో నాజర్ ఈ ముగ్గురుని వాళ్ళ బాల్యంలోకి పంపిస్తాడు. అసలు వీళ్ళ పాస్ట్‌లో ఏం జరిగింది? మళ్ళీ వీళ్ళు గతంలోకి ఎందుకు వెళ్ళాలని అనుకున్నారు? అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. శర్వానంద్ తల్లిగా అక్కినేని అమల, జోడీగా రీతూవర్మ నటించింది. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్.ఆర్ ప్రకాష్ బాబు, ఎస్.ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 9న తెలుగు, తమిళంలో విడుదలవుతుంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more