kollywood actor vikrams cobra movie gets postponed విక్ర‌మ్ ‘కోబ్రా’ విడుద‌ల వాయిదా ప‌డ‌నుందా?

Chiyaan vikram s science fiction thriller cobra delayed again

Chiyaan Vikram, Chiyaan Vikram Cobra, Chiyaan Vikram Cobra movie, Cobra release date, Cobra release date 2022, Cobra new release date, Cobra movie, Cobra Tamil movie, Cobra audio launch, Cobra songs, Ajay Gnanamuthu director, Ponniyin Selvan movie, Ponniyin Selvan part 1, Mani Ratnam AR Rahman, Srinidhi Shetty, Chiyaan Vikram, Cobra, Delayed, release date, Ajay Gnanamuthu, Film, Vikram, postponed, Srinidhi Shetty, Tollywood

Chiyaan Vikram is set to make a comeback to the silver screen with his newest project, Cobra. The science-fiction thriller is helmed by young filmmaker Ajay Gnanamuthu. According to the latest rumours, the release of the movie has been further postponed. Cobra was originally slated to release on August 11, ahead of Independence Day.

విక్ర‌మ్ ‘కోబ్రా’ విడుద‌ల వాయిదా ప‌డ‌నుందా?

Posted: 07/21/2022 12:01 PM IST
Chiyaan vikram s science fiction thriller cobra delayed again

చియాన్ విక్ర‌మ్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు పరిచ‌యం అక్క‌ర్లేని పేరు. ‘శివ‌పుత్రుడు’, ‘అప‌రిచితుడు’, ‘ఐ’ వంటి సినిమాల‌తో ఇక్క‌డ‌ విప‌రీత‌మైన అభిమానాన్ని సంపాదించుకున్నాడు. తెలుగులో విక్ర‌మ్‌కు టాలీవుడ్ హీరోల‌కున్నంత క్రేజ్ ఉంది. అయితే గ‌త కొంత కాలంగా ఈయ‌న న‌టించిన సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర అంత‌గా రాణించ‌డం లేదు. ఈ క్ర‌మంలో కొడుకు ధృవ్‌తో క‌లిసి ‘మ‌హాన్’ చిత్రంలో న‌టించాడు. ఫిబ్ర‌వ‌రిలో నేరుగా అమెజాన్‌లో విడుద‌లైన ఈ చిత్రం మంచి వ్యూవ‌ర్ షిప్‌ను సాధించింది.

అయితే ఈ చిత్రం ఓటీటీలో విడుద‌ల‌వ‌డంతో అభిమానులు తీవ్రంగా నిరాశ‌ప‌డ్డారు. ఈ క్ర‌మంలో ఫ్యాన్స్‌ను ఖుషి చేసేందుకు విక్ర‌మ్ ‘కోబ్రా’తో ప్రేక్ష‌కులు ముందుకు రాబోతున్నాడు. ఇప్ప‌టికే చిత్రం నుండి విడుద‌లైన ప్రచార చిత్రాలు, టీజ‌ర్‌ సినిమాపై భారీ అంచ‌నాల‌ను పెంచేశాయి. ఇక‌ ఈ చిత్రాన్ని ఆగ‌స్టు 11న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ ఇదివ‌ర‌కే ప్ర‌క‌టించారు. అయితే తాజాగా ఈ సినిమా విడుద‌ల వాయిదా ప‌డ‌నుంద‌ని స‌మాచారం. కోబ్రా సినిమాకు సంబంధించిన సీజి వ‌ర్క్ ఇంకా కంప్లీట్ కాలేద‌ట‌.

దాంతో మేకర్స్ సినిమాను పోస్ట్ పోన్ చేయాల‌ని భావిస్తున్నారట‌. త్వ‌ర‌లోనే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది. స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రంలో కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా న‌టించింది. ఏ.ఆర్ రెహ‌మాన్ సంగీత సారథ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్డూడియోస్ ప‌తాకంపై ఎస్‌.ఎస్‌. ల‌లిత్ కుమార్ అత్యంత ప్ర‌తిష్ఠాత్మకంగా నిర్మించాడు. ప్ర‌ముఖ క్రికెటర్ ఇర్ఫాన్ ఖాన్ ఈ చిత్రంలో ప్ర‌తి నాయ‌కుడి పాత్ర‌లో న‌టించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chiyaan Vikram  Cobra  Delayed  release date  Ajay Gnanamuthu  Film  Vikram  postponed  August 31  Srinidhi Shetty  Tollywood  

Other Articles

Today on Telugu Wishesh