Bimbisara: Kalyan Ram StealsThe Show Being A Ruthless King ఆసక్తిరేపుతున్న కల్యాణ్ రామ్ ‘బింబిసార’ ట్రైల‌ర్

Bimbisara trailer nandamuri kalyan ram s movie looks like a tackier version of magadheera

Bimbisara Trailer, Bimbisara Trailer Glimpse, Bimbisara Latest, Nandamuri Kalyan Ram, Vashist, Hari Krishna K, NTR Arts, Bimbisara Movie, Kalyan Ram Latest Movie, Kalyan Ram Bimbisara, Bimbisara, ntr arts, NTR, Kalyan Ram, Tollywood, Movies, Entertainment

The trailer of Bimbisara, starring Nandamuri Kalyan Ram in the lead role, was released on Monday. At first glance, the film seems to be riffing off on everything that director SS Rajamouli has done so far. The trailer introduces us to Emperor Bimbisara who seems to have ruled his lands with an iron fist. Bimbisara has all the tendencies of a megalomaniac as we hear him saying, “I am the God and I’m the devil.”

‘బింబిసారుడంటేనే మ‌ర‌ణ శాస‌నం..’ ఆసక్తిరేపుతున్న కళ్యాణ్ రామ్ ట్రైల‌ర్

Posted: 07/04/2022 06:58 PM IST
Bimbisara trailer nandamuri kalyan ram s movie looks like a tackier version of magadheera

నంద‌మూరి హీరో క‌ల్యాణ్‌రామ్ టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం బింబిసార. మగధ రాజ్యాన్ని ప‌రిపాలించిన హర్యాంక వంశస్థుడు బింబిసారుని జీవిత క‌థ‌తో సోషియో ఫాంట‌సీ బ్యాక్ డ్రాప్‌లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి వ‌శిష్ఠ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. తాజాగా క‌ల్యాణ్‌రామ్ అండ్ టీం మూవీ ల‌వ‌ర్స్ కోసం అదిరిపోయే అప్‌డేట్ ట్రైల‌ర్ రూపంలో అందించింది. ఇవాళ బింబిసార ట్రైల‌ర్‌ను లాంఛ్ చేశారు.

‘ రాక్ష‌సులెరుగ‌ని రావ‌ణ రూపం..శత్రువులు గెల‌వ‌లేని కురుక్షేత్ర యుద్దం..త్రిగ‌ర్త‌ల సామ్రాజ్యాధిప‌తి బింబిసారుని విశ్వ‌రూపం అంటూ బ్యాక్ డ్రాప్‌లో టైటిల్ రోల్‌ను ఎలివేట్ చేస్తూ సాగుతున్న సంభాష‌ణ‌లు సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి. బింబిసారుడంటేనే మ‌ర‌ణ శాస‌నం…ఇక్క‌డ రాక్ష‌సుడైనా..భ‌గ‌వంతుడైనా ఈ బింబిసారుడొక్క‌డే’ అని చెబుతున్న డైలాగ్స్ సినిమాపై అంచ‌నాలు పెంచుతున్నాయి.

అత్యంత భారీ బ‌డ్జెట్‌తో హై టెక్నిక‌ల్ వ్యాల్యూస్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో కేథ‌రిన్ ట్రెసా, సంయుక్తా మీన‌న్ ఫీ మేల్ లీడ్ రోల్స్ లో న‌టిస్తున్నారు. ఈ ప్రాజెక్టును నందమూరి తారకరామారావు ఆర్ట్స్ బ్యానర్ పై కే హ‌రికృష్ణ నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తుండ‌గా..చిరంత‌న్ భ‌ట్ మ్యూజిక్ అందిస్తున్నాడు.ఈ ప్రాజెక్టుకు తమ్మిరాజు ఎడిటింగ్‌..కాగా కిరణ్ కుమార్ మన్నే ఆర్ట్ డైరెక్టర్‌.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles