బాలీవుడ్ ప్రముఖ గాయకుడు కృష్ణకుమార్ కున్నాథ్ హఠాన్మరణం చెందారు. ఆయన వయసు 53 సంవత్సరాలు. కేకేగా చిరపరిచితమైన ఆయన కోల్‌కతాలోని నజురుల్ మంచా ఆడిటోరియంలో ప్రదర్శన ఇచ్చారు. కేకే పాటలకు స్టెప్పులేసిన అభిమానులు.. ఆ సంతోష సంబరాల్లో ఇంకా మునిగితేలుతుండగానే ఆయన మరణవార్త నమ్మలేకపోతున్నారు. కొన్ని గంటల వ్యవధిలోనే ఆయన మరణించారన్న వార్త వెలువడంతో ఇప్పటికీ ఇది నిజమేనా..? అన్న ప్రశ్న ఆయన అభిమానులు రేకెత్తుతోంది. 53ఏళ్ల కృష్ణ కుమార్ కున్నథ్, అభిమానులు 'కేకే' అని ప్రేమతో పిలిచుకుంటారు.
కోల్‌కతాలోని నజురుల్ మంచా ఆడిటోరియంలో ప్రదర్శన తరువాత కొన్ని గంటల వ్యవధిలో తన హోటల్లో ఒక్కసారిగా అనారోగ్యానికి గురయ్యారు. అక్కడే చివరికి తుదిశ్వాస విడిచారు. ఆయతే అస్వస్థతకు గురికావడంతో వెంటనే ఆయనను సీఎంఆర్ఐ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు కేకే అప్పటికే మరణించినట్టు ధ్రువీకరించారు. 1990 లలో ‘పాల్’, ‘యారోన్’ సినిమాల్లో ఆయన పాడిన పాటలు సంచలనం సృష్టించాయి. యువతలో ఆయన పాటలకు విపరీతమైన క్రేజ్ ఉండేది. స్కూల్, కాలేజీ, కల్చరల్ ఈవెంట్స్‌లో ఎక్కువగా ఈ పాటలు వినిపించేవి.
హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, మరాఠి, బెంగాలీ సహా పలు భాషల్లోనూ పాటలు పాడారు. కేకే మరణవార్త ఆయన అభిమానులను, ప్రముఖులు, సన్నిహితులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. కేకే మృతిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన పాటలు అన్ని రకాల భావోద్వేగాలను ప్రతిబింబిస్తాయని, అన్ని వయసుల వారిని అలరిస్తాయని అన్నారు. ఆయన పాటల ద్వారా ఎప్పటికీ కేకేను గుర్తుంచుకుంటామని అన్నారు. కేకే కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
చాలా విచారకరమని, కేకే మృతి వార్త తనను షాక్‌కు గురిచేసిందని బాలీవుడ్ ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్ అన్నారు. కేకే మృతి తీరని లోటని పేర్కొన్నారు. కేకే పాటలు, ఆయన గాత్రం ఎప్పటికీ మనతోనే ఉంటాయని గాయకుడు పాపాన్ అంగారాగ్ ట్వీట్ చేశారు. దేవుడు ఆయన కుటుంబానికి ధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు. కేకే మరణవార్త వినాల్సి రావడం విషాదకరమని, జీవితం ఎంత దుర్భలమైందో ఆయన మరణం మరోమారు గుర్తు చేసిందని టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నట్టు పేర్కొన్నాడు.
#WATCH | Singer KK died hours after a concert in Kolkata on May 31st. The auditorium shares visuals of the event held some hours ago. KK was known for songs like 'Pal' and 'Yaaron'. He was brought dead to the CMRI, the hospital told.
— ANI (@ANI) May 31, 2022
Video source: Najrul Manch FB page pic.twitter.com/YiG64Cs9nP
(And get your daily news straight to your inbox)
Aug 04 | టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘సీతారామం’ ఒకటి. ఈ మధ్య కాలంలో ఈ సినిమాకు ఏర్పడిన బజ్ మరేసినిమాకు ఏర్పడలేదు. ఇప్పటికే ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే విడుదలైన... Read more
Aug 04 | నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ టైమ్ ట్రావెల్ చిత్రం ‘బింబిసార’. గత కొన్నాళ్లుగా చక్కని హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోకు లభించిన చక్కని టైమ్ ట్రావెల్ చిత్రం కలసిరానుందని సినీవిశ్లేషకులు చెబుతున్నారు.... Read more
Aug 04 | తమిళ హీరో కార్తి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘యుగానికి ఒక్కడు’ సినిమా నుండి గతేడాది విడుదలైన ‘సుల్తాన్’ వరకు ఈయన ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతూ వస్తున్నాయి.... Read more
Aug 04 | దక్షిణాదిన నయనతార తర్వాత అంతటి ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకున్న నటి సాయి పల్లవి. ముఖ్యంగా టాలీవుడ్లో ఈమె క్రేజ్ టైర్2 హీరోలకు సమానంగా ఉంది. గ్లామర్‌కు అతీతంగా సినిమాలను చేస్తూ అటు యూత్‌లో ఇటు ఫ్యామిలీ... Read more
Aug 04 | నటన ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ ఇటు హీరోగా అటు క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినీరంగంలో దూసుకుపోతున్న నటుడు సత్యదేవ్. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినిమా రంగంలోకి అడగుపెట్టి ఒక్కో మెట్టు ఎక్కుతూ ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు... Read more