మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపోందుతున్న చిత్రానికి పవర్ ఫుల్ టైటిల్ ను అనుకుంటున్నారన్న ఊహాగానాలు చిత్రపురిలో వినిపిస్తున్నాయి. ఈ సినిమాతో తెలుగులో నేరుగా చిత్రాన్ని రూపొందిస్తున్న శంకర్ పరిశీలనలో పాత చిత్ర టైటిల్ ఉందన్న గుసగుసలు షికార్లు కొడుతున్నాయి. భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా చకచకా షూటింగు జరుపుకుంటోంది. ఇటీవలే వైజాగ్ షెడ్యూల్ ను పూర్తి చేశారు. వచ్చేనెల 2వ వారం నుంచి హైదరాబాద్ లో మరో షెడ్యూల్ ను మొదలెట్టనున్నట్టు చెబుతున్నారు. అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.
ఈ సినిమా కోసం మూడు టైటిల్స్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. వాటిలో 'అధికారి' అనే టైటిల్ ను ఖరారు చేయనున్నట్టు సమాచారం. చరణ్ ఐఏఎస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు కనుక, 'అధికారి' టైటిల్ కరెక్టుగా సెట్ అవుతుందని అంటున్నారు. టైటిల్ పవర్ఫుల్ గా ఉండటంతో దాదాపు ఖాయమైనట్టే అని చెబుతున్నారు. ఈ సినిమాలో చరణ్ సరసన నాయికగా కియారా అద్వాని అలరించనుంది. ముఖ్యమైన పాత్రలలో శ్రీకాంత్ .. సునీల్ .. అంజలి కనిపించనున్నారు. తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు.
ఆయన పాటలు ఈ సినిమాకి హైలైట్ గా నిలవనున్నట్టు చెబుతున్నారు. పాటల చిత్రీకరణ కోసం కూడా భారీ స్థాయిలో ఖర్చు చేయనున్నట్టు టాక్. ఈ సినిమాలో తన పాత్రను శంకర్ డిజైన్ చేసిన తీరు చాలా కొత్తగా ఉంటుందనీ, ఇది మామూలుగా వుండదనీ, ఈ పాత్ర తన కెరియర్లో ప్రత్యేకమైన స్థానంలో నిలిచిపోతుందని సునీల్ చెబుతున్నాడు. చరణ్ పాత్ర వెంటనే ఉంటూ ఈ సినిమా మొత్తం తాను కనిపిస్తాననీ, తన పాత్రను గురించి చాలా రోజులు మాట్లాడుకుంటారని ఆయన చెప్పుకొచ్చాడు.
(And get your daily news straight to your inbox)
Jun 29 | యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ కలసి నటించిన మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్. జక్కనగా తెలుగు చిత్రసీమ, ప్రేక్షకులు ముద్గుగా పిలుచుకునే దర్శకదిగ్గజం రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కిన ఈ... Read more
Jun 29 | లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం ‘విక్రమ్’. బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 3న విడుదలై 400 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు అర్జించింది. దాదాపు... Read more
Jun 29 | టాలీవుడ్ అగ్రనిర్మాతలలో ఒకరైన దిల్‌రాజుకు కథలతో పాటు చిత్ర దర్శకులపై వారి కొత్తదనంపై కూడా చాలా పట్టుంది. వారి టేకింగ్, నరేషన్ సహా అన్నింటినీ విన్న తరువాతే ఆయన అడుగు ముందుకు వేస్తారు. సినిమాల... Read more
Jun 29 | టాలీవుడ్ బ్యాచిలర్స్రో ఒకరైన యంగ్ హీరో రామ్ పోతినేని.. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని ఇటీవలే జోరుగా ప్రచారం సాగింది. సామాజిక మాద్యమాల్లో విపరీతంగా ఈ మేర ప్రచారం ఊపందుకుంది. ఎక్కడ చూసినా ఈయన... Read more
Jun 29 | హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం 'హ్యాపీ బర్త్‌డే'. ఈ చిత్రాన్ని దర్శకుడు రితేశ్ రానా రూపోందించగా, ఈ సినిమా జులై 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా... Read more