Nani's Ante Sundaraniki teaser released నవ్వులు పూయిస్తున్న నాని.! ‘అంటే సుందరానికి’ టీజర్ రిలీజ్..

Ante sundaraniki teaser nani and nazriya in a breezy romance

Ante Sundaraniki, Nani, Nazriya Fahadh, Naresh, Rohini, Nadiya, Harshavardhan, Rahul Ramakrishna, Vivek Sagar, Vivek Athreya, Mythri Movie Makers, Naveen Yerneni, Ravi Shankar, Tollywood, Movies, Entertainment

From the day the movie, then the title was announced, Ante Sundaraniki generated lots of inquisitiveness among movie buffs. While Nani is known for his impeccable comic timing, Vivek Athreya is known for making coming of age entertainers in his own style. Raising the bar further high, the makers came up with teaser of the movie which lives up to all the hype around it.

నవ్వులు పూయిస్తున్న నాని.! ‘అంటే సుందరానికి’ టీజర్ రిలీజ్..

Posted: 04/20/2022 06:58 PM IST
Ante sundaraniki teaser nani and nazriya in a breezy romance

శ్యామ్ సింగరాయ్ లాంటి వైవిధ్య చిత్రంలో నటించి మెప్పించి.. మంచి హిట్ అందుకున్న న్యాచురల్ స్టార్ నాని.. ఈ సారి ‘అంటే సుందరానికి’ చిత్రంతో ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమాతో రాబోతున్నారు. ఇప్పటికే అటు క్లాసు, ఇటు మాస్ తో పాటు మరోవైపు ఫ్యామిలీ అడియన్స్ ను కూడా తన ఫ్యాన్ క్లబ్ లో చేర్చుకుంటూ ముందుకెళ్తున్న నాని.. ఇక కామెడి జోనర్ ను ఇష్టపడే అడియన్స్ ను కూడా అకర్సించేందుకు ప్లాన్ చేశాడు. అంటే సుందరానికి చిత్రానికి సంబంధించిన ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, గ్లింప్స్ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ చిత్రంలో నాని సరసన రాజా రాణి ఫేమ్ నజ్రియా నటిస్తోంది.

కట్టుబాట్లను పాటించే బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువకుడి పాత్రను పోషించింది. నజ్రియా లీలా అనే క్రిస్టియన్ అమ్మాయి పాత్రలో నటించింది. వీరిద్దరి మధ్య ప్రేమకథను చాలా వినోదాత్మకంగా తెరకెక్కించినట్లు టీజర్ చూస్తేనే తెలుస్తోంది. నరేశ్ ఇందులో నాని తండ్రిగా నటించారు. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ఆసక్తికరంగా ఉంది. ఇదే సమయంలో లవ్ స్టోరీని కూడా దర్శకుడు బాగా నడిపించాడని టీజర్ చూస్తే తెలుస్తోంది. నజ్రియా లీలా థామస్ పాత్రలో నటించగా.. నాని పాత్ర పేరు K.P.V.S.S.P.R సుందర ప్రసాద్.

మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా లాంటి వైవిధ్యమైన చిత్రాలను తెరకెక్కించిన వివేక్ ఆత్రేయ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యర్నేని, యలమంచిలి రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ సినిమా జూన్ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.ఈ చిత్రంతో పాటు ప్రస్తుతం నాని శ్రీకాంత్ ఓదెల్ల దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు దసరా అనే ఆసక్తికరమైన టైటిల్‌ను పెట్టారు. ఈ సినిమా తెలంగాణ నేపథ్యంలో సాగనుంది. తొలిసారిగా నాని ఈ చిత్రం కోసం తెలంగాణ యాసలో మాట్లాడనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh