Mega Hero Varun Tej writes emotional post ‘గని’ చిత్ర బృందానికి మెగా ప్రిన్స్ ప్రశంసలు..

Mega hero varun tej writes emotional post on ghani movie

Ghani, Mega prince Varun Tej, Emotional post, social media, producer, Ghani Team members, Team Efforts, Success, F3, Tollywood, movies, Entertainment

Mega prince Varun Tej has achieved fame by exhibiting his own acting abilities and entertaining a huge number of people. He is active on social media, where he often shares the latest news about his films and family activities. Recently, the actor who starred in the film Ghani posted an emotional note in which he praised the producer in particular, as well as all of the members of the Ghani team, for their efforts in making the film a success.

‘గని’ చిత్రంపై మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎమోషనల్ పోస్ట్

Posted: 04/12/2022 06:21 PM IST
Mega hero varun tej writes emotional post on ghani movie

టాలీవుడ్ వెండితెరపై యాక్షన్‌ చిత్రాలతో తన సత్తాను చాటుదామని వచ్చిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కు ఆ చిత్రాలను పక్కనబెడితే రోమాంటిక్ చిత్రాలు అందించిన హిట్లు ట్రెండ్ సెట్ చేసాయి. ఫిదా, తొలి ప్రేమ, గద్దలకొండ గణేశ్ వంటి లవ్‌స్టోరీలతో హిట్స్‌ సాధించిన వరుణ్‌ ఈసారి యాక్షన్‌ తో పాటు స్పోర్ట్స్ జోనర్ లోని చిత్రంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఏప్రిల్‌ 8న విడుదలైన గని బాక్సాఫీస్‌ దగ్గర అంతగా ప్రభావం చూపలేకపోయింది. వీకెండ్స్‌లోనూ పెద్దగా కలెక్షన్లు రాబట్టలేక డిజాస్టర్‌గా మిగిలింది.

అయితే వరుసగా అఖండ, పుష్ఫ, భీమ్లా నాయక్, ఆర్ఆర్ఆర్ చిత్రాలు విడుదల కావడం కూడా ఓ కారణం కావచ్చు. ఇదే ఏప్రిల్ నెలలో అటు కోలీవుడ్ ప్రముఖ నటుడు విజయ్ బీస్ట్, కన్నడ సూపర్ స్టార్ యశ్ కేజీఎఫ్ చిత్రాలు కూడా విడుదల కానున్నాయి. ఇదే క్రమంలో ఈ నెలలోనే 29న మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ నటించిన ఆచార్య చిత్రం కూడా విడుదల కానుంది. ఈ ప్రభావం కూడా గని సినిమాపై పడింది. అయితే చిత్రం అనుకున్నంత మేర హిట్ కాకపోవడంతో వరుణ్‌ తేజ్‌ ఎమోషనల్‌ నోట్‌ షేర్‌ చేశాడు.

'ఎన్నో ఏళ్లుగా మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు నేను సర్వదా విధేయుడిని. గని మూవీ నిర్మాణంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ, మరీ ముఖ్యంగా నిర్మాతలకు చాలా థ్యాంక్స్‌. ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. ఒక మంచి సినిమాను మీ ముందుకు తీసుకువచ్చేందుకు చాలా శ్రమించాము. కానీ మా ఆలోచనలను అనుకున్నరీతిలో తెరపై చూపించలేకపోయాము. మిమ్మల్ని ఎంటర్‌టైన్‌ చేయాలనే ఉద్దేశ్యంతోనే నేను ప్రతి సినిమా చేస్తాను. ఈ క్రమంలో కొన్నిసార్లు గెలుస్తాను, మరికొన్నిసార్లు సినిమా ఫలితాల నుంచి నేర్చుకుంటాను. ఏదేమైనా కష్టపడి పనిచేయడం మాత్రం ఆపను' అంటూ ట్వీట్‌ చేశాడు వరుణ్‌ తేజ్‌.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles