Ram charan Rc15 moive latest photos goes viral పంచకట్టులో సైకిల్ పై మెగాపవర్ స్టార్..

Rc15 ram charan and shankar moive latest photos goes viral in social media

Ram Charan, RC 15, Chiranjeevi, Rudraveena, Godavari, Rajahmundry, Andhra Pradesh, Photo leak, RC 15 Flashback Photo, Shanker, S.Thaman, Dil Raju, shirish, Tollywood, Movies, Entertainment

Mega Power star Ram Charan as the hero in the upcoming movie directed by RC15 with the working title ‘RC15’ directed by Director Shankar has received a lot of leaks. However, no matter how much care the film unit takes, photos of the cinema taluka are coming out somewhere. In the latest photo circulating on social media, Ram Charan is riding a bicycle on the banks of the Godavari.

పంచకట్టులో సైకిల్ పై మెగాపవర్ స్టార్.. ఆర్సీ 15 ఫోటో నెట్టింట్లో వైరల్

Posted: 04/05/2022 09:01 PM IST
Rc15 ram charan and shankar moive latest photos goes viral in social media

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌కు సంబంధించిన ఓ షాకింగ్‌ లుక్‌ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ఈ ఫొటో చెర్రి పంచెకట్టులో కనిపించాడు. ఈ తాజా లుక్‌ చూసి చరణ్‌ ఇలా మారిపోయాడేంటి అని అంతా షాక్‌ అవుతున్నారు. అంతేకాదు అచ్చం పల్లెటూరి వ్యక్తిలా పంచె కట్టుకుని సైకిల్‌పై కనిపించాడు. ఈ లుక్ రంగస్థలం చిత్రంలోనిదని అనుకునేందుకు వీలులేదు. ఎందుకంటే అందులో రామ్ చరణ్ ఎక్కడా వైట్ అండ్ వైట్ లో కనిపించలేదు. అయితే అయితే ఈ లుక్‌.. చరణ్‌ తాజా సినిమా (ఆర్సీ15 మూవీ) సెట్‌ నుంచి లీకైనట్లు తెలుస్తోంది. డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో ఆర్సీ15 తెరకెక్కతున్న సంగతి తెలిసిందే.

ఇందులో చరణ్‌ ప్రభుత్వ ఉద్యోగిగా కనిపిస్తాడని మొదటి నుంచి చెబుతున్నారు. అయితే పంచెకట్టుతో ఉన్న ఈ తాజా లుక్‌ను చూసి అంతా ఆలోచనలో పడ్డారు. ఈ తాజా బజ్‌ ప్రకారం ఈ సినిమాలో చరణ్‌ నాలుగు విభిన్న పాత్రల్లో కనిపించానున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. అందులో ఈ లుక్‌ ఒకటని అంటున్నారు. కాగా శంకర్‌ సినిమా అంటే అందులో ఓ ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌ తప్పసరిగా ఉండాల్సిందే. ఆయన దర్శకత్వంలో రూపొంది బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచిన భారతీయుడు, జెంటిల్‌మెన్‌ అపరిచితుడు వంటి చిత్రాల్లో కూడా ఫ్లాష్‌బ్యాక్‌ సీన్స్‌ ఉన్నాయి. అవి ఆ సినిమాకు హైలెట్‌గా నిలిచాయి.

అలాగే ఆర్సీ15లో కూడా 1930 సమయంలో ఓ ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌ ఉందని తెలుస్తోంది. ఈ ఎపిసోడ్‌లో చరణ్‌ ఓ పోలిటికల్‌ లీడర్‌గా కనిపిస్తాడట. ఇందుకు సంబంధించిన షూటింగ్‌ రీసెంట్‌ జరగగా.. ఇప్పుడు లీకైన ఈ ఫొటో ఆ ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలకు సంబంధించినదేనని ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి టైమ్‌లో రిలీజ్‌ చేయాలనే ఆలోచనలో ఉంది చిత్రయూనిట్‌.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Charan  RC 15  Photo leak  RC 15 Flashback Photo  Shanker  S.Thaman  Dil Raju  shirish  Tollywood  

Other Articles

Today on Telugu Wishesh