AP CM Jagan signs file on cinema ticket price ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ ధరలు పెంచుతూ జీవో జారీ.!

Andhra pradesh government issues go raising cinema ticket price

Andhra Pradesh government, cinema ticket rates, movie ticket rates, Government Order, movie ticket prices, Exhibitors, Theater owners, distributors, film producers, ticket prices, Chiranjeevi, Andhra Pradesh

Andhra Pradesh government has responded positively the cinema ticket rates in the state. The whole industry was looking forward to the new Government Order on movie ticket prices, and now the long-awaited issue about the ticket prices in Andhra Pradesh is resolved.

ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ ధరలు పెంచుతూ జీవో జారీ.!

Posted: 03/07/2022 09:31 PM IST
Andhra pradesh government issues go raising cinema ticket price

టాలీవుడ్ నిర్మాతలు, నటులు, పరిశ్రమ వర్గాలు గత కొన్నాళ్లుగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జీవో రానే వచ్చింది. గతకొంత కాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న సినిమా టికెట్ల వ్యవహారంలో ఎట్టకేలకు ఉపశమనం లభించింది. సినీ ప‌రిశ్ర‌మ‌కు, థియేట‌ర్ల యాజ‌మాన్యాలు, డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు ఆంధ్రప్రదేశ్ ప్ర‌భుత్వం శుభవార్తను అందించింది. ఏపీలో సినిమా టికెట్స్ రేట్లను పెంచుతూ ఇవాళ జీవో జారీచేసింది. తాజా జీవో ప్ర‌కారం టికెట్ క‌నిష్ట ధ‌ర రూ.20గా, గ‌రిష్ట ధ‌ర రూ.250గా నిర్ణ‌యించింది. ప్రాంతాన్ని బ‌ట్టి థియేట‌ర్ల‌ను 4 ర‌కాలుగా విభ‌జించి తాజా టికెట్ల ధ‌ర‌ల‌ను నిర్ణ‌యిచింది.

అయితే ఈ టికెట్ల రేట్ల‌కు జీఎస్టీ ధ‌ర‌లు అద‌నం. ఒక్కో థియేట‌ర్ల‌లో రెండు ర‌కాల టికెట్ల రేట్లుండగా..వాటిని ప్రీమియం, నాన్ ప్రీమియంగా రేట్ల‌ను నిర్దారించారు. ప్ర‌తీ థియేట‌ర్‌లో 25 శాతం సీట్లు నాన్ ప్రీమియం సీట్ల‌కు కేటాయించాల‌ని ఆదేశించింది ప్ర‌భుత్వం. హీరో, డైరెక్ట‌ర్ రెమ్యున‌రేష‌న్ కాకుండా రూ.100 కోట్ల బ‌డ్జెట్ దాటిన సినిమాల‌కు టికెట్ల రేట్ల‌ను పెంచుకునే అవ‌కాశం క‌ల్పించింది ఏపీ ప్ర‌భుత్వం.

టికెట్ల ధ‌ర‌లను క‌నీసం 10 రోజులు పెంచుకునే వీలు క‌ల్పించింది. అయితే 20 శాతం షూటింగ్ ఏపీలో చేసిన చిత్రాల‌కు మాత్ర‌మే తాజా రేట్ల పెంపు వ‌ర్తిస్తుంద‌ని జీవోలో పేర్కొంది ప్ర‌భుత్వం. దీంతోపాటు రోజుకు ఐదు షోల్లో ఒక‌ చిన్న సినిమా వేయాల‌ని నిర్దేశించింది. తాజాగా జారీ చేసిన ఉత్త‌ర్వుల‌తో పాత‌ జీవో నంబ‌ర్ 35 ర‌ద్దైన‌ట్టు ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. ఏపీ ప్ర‌భుత్వం తీసుకున్న ఈ నిర్ణ‌యంతో త్వ‌ర‌లో విడుద‌ల కాబోతున్న రాధేశ్యామ్‌తోపాటు మిగిలిన చిత్రాల‌కు ఊర‌ట ల‌భించిన‌ట్టైంది.

టాలీవుడ్ సినీ ప‌రిశ్ర‌మ‌కు, థియేట‌ర్ల యాజ‌మాన్యాలు, డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు శుభ‌వార్త అందించిన ఏపీ ప్ర‌భుత్వానికి మెగాస్టార్ చిరంజీవికృతజ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. ఏపీలో సినిమా టికెట్స్ రేట్లను పెంచుతూ జీవో జారీచేసిన ఏపీ సీఎం జ‌గ‌న్ కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు మేలు క‌లిగే విధంగా అటు థియేటర్ల మ‌నుగ‌డ‌ను, ప్ర‌జ‌ల‌కు వినోదం అందుబాటులో ఉండాల‌నే సంక‌ల్పాన్ని దృష్టిలో పెట్టుకుని సినిమా టికెట్ల రేట్లు పెంచుతూ జీవోజారీచేసిన సీఎం వైఎస్ జ‌గ‌న్‌కు సినీ ప‌రిశ్ర‌మ త‌ర‌పున కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాఅని ఆయన ట్విట్టర్ లో పోస్టు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles