ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా మరో వివాదంలో చిక్కుకుంది. ఛీటింగ్ కేసులో ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. సోనాక్షి సిన్హాపై మొరదాబాద్‌కు చెందిన ఈవెంట్ మేనేజర్ ప్రమోద్ శర్మ ఫ్రాడ్ కేసు పెట్టారు. తాను ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనేందుకు సోనాక్షి సిన్హా.. రూ.37 లక్షల రెమ్యునరేషన్ తీసుకుందని, కానీ తాను ఆ ఈవెంట్‌లో పాల్గొనలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనివల్ల తీవ్ర నష్టం వచ్చిందని ప్రమోద్ శర్మ పోలీసులను ఆశ్రయించారు.
ఇదే విషయంలో డబ్బులు తిరిగి చెల్లించాలని సోనాక్షి మేనేజర్‌ను ఎన్నిసార్లు కోరినా స్పందించలేదని ప్రమోద్ శర్మ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ కేసులో సోనాక్షి సిన్హా గతంలో ఒకసారి మొరదాబాద్‌కు వచ్చి వివరణ కూడా ఇచ్చింది. కానీ ఆ తర్వాత విచారణకు హాజరు కాలేదు. దీంతో న్యాయస్థానం ఆమెకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
సల్మాన్ ఖాన్, సోనాక్షి సిన్హా రహస్యంగా వివాహం చేసుకున్నారని ఇటీవల ఒక ఫొటో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అయితే అది మార్పింగ్ ఫొటో అని తెలిసింది. దీనిపై సోనాక్షి కూడా ఘాటుగానే స్పందించింది. రియల్ ఫొటోకు, మార్ఫింగ్ ఫొటోకు తేడా తెలియట్లేదా అని సీరియస్ అయ్యింది. ఇదిలా ఉంటే సల్మాన్‌తో కలిసి ఇటీవల ద-బాంగ్ టూర్‌కు వెళ్లొచ్చింది సోనాక్షి సిన్హా. ఈ టూర్‌లో పూజా హెగ్డే, దిశా పటానీ కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం హ్యూమా ఖురేషితో కలిసి డబుల్ ఎక్స్ ఎల్, రితేష్ దేశ్ ముఖ్‌తో కాకుడా చిత్రాల్లో నటిస్తోంది సోనాక్షి సిన్హా.
(And get your daily news straight to your inbox)
Aug 08 | టాలీవుడ్ యువ హీరో ఆది సాయికుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘తీస్మార్ ఖాన్’. కళ్యాణ్ జీ గోగన దర్శకత్వం వహిస్తున్నాడు. ఆర్ఎక్స్ 100 ఫేం పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా నటించింది. ఇవాళ మేకర్స్ తీస్మార్... Read more
Aug 04 | టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘సీతారామం’ ఒకటి. ఈ మధ్య కాలంలో ఈ సినిమాకు ఏర్పడిన బజ్ మరేసినిమాకు ఏర్పడలేదు. ఇప్పటికే ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే విడుదలైన... Read more
Aug 04 | నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ టైమ్ ట్రావెల్ చిత్రం ‘బింబిసార’. గత కొన్నాళ్లుగా చక్కని హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోకు లభించిన చక్కని టైమ్ ట్రావెల్ చిత్రం కలసిరానుందని సినీవిశ్లేషకులు చెబుతున్నారు.... Read more
Aug 04 | తమిళ హీరో కార్తి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘యుగానికి ఒక్కడు’ సినిమా నుండి గతేడాది విడుదలైన ‘సుల్తాన్’ వరకు ఈయన ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతూ వస్తున్నాయి.... Read more
Aug 04 | దక్షిణాదిన నయనతార తర్వాత అంతటి ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకున్న నటి సాయి పల్లవి. ముఖ్యంగా టాలీవుడ్లో ఈమె క్రేజ్ టైర్2 హీరోలకు సమానంగా ఉంది. గ్లామర్‌కు అతీతంగా సినిమాలను చేస్తూ అటు యూత్‌లో ఇటు ఫ్యామిలీ... Read more