మెగాస్టార్ చిరంజీవి.. మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో కలసి నటిస్తున్న చిత్రం ఆచార్య. అన్ని సినిమాల మాదిరిగానే ఈ చిత్రంపై కూడా కరోనా ప్రభావం తీవ్రంగానే పడింది. అనేక బ్రేకులు మధ్య కొనసాగిన ఈ సినిమా షూటింగ్ మొత్తానికి గుమ్మడి కాయ కొట్టేసి.. పోస్టు ప్రోడక్షన్స్ పనులను పూర్తి చేసుకుని విడుదలకు సిద్దంగా వుంది. ముందుగా ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 4న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ఇదివరకే ప్రకటించినా.. కరొనా మూడవ దశ నేపథ్యంలో వాయిదా వేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక ఇప్పటికే పలు చిత్రాలు పూర్తై విడుదలకు సిద్దంగా వున్న నేపథ్యంలో చిరంజీవి తన చిత్రాన్ని ఫిబ్రవరి 4కు బదులు ఏప్రిల్ 29కి వాయిదా వేసుకున్నారు. ఈ మేరకు చిత్రబృందం అధికారికంగా స్పష్టతను ఇచ్చింది.
ఇక ఈ చిత్రానికి సంగీత దర్శకుడు మణిశర్మ సంగీతాన్ని సమకూర్చుతున్నారు. మణిశర్మ బీట్లకు చిరంజీవి డాన్స్ మూవ్ మెంట్స్ కలిస్తే ధియేటర్లలో అభిమానుల చేత ఈలలు వేయించడం.. కెవ్వుకేకలు పెట్టించడం పరిపాటిగా మారిన విషయం కూడా తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని ‘లాహే లాహే’, ‘నీలాంబరి’ పాటలు విశేషంగా అలరించాయి. ఇప్పుడా జాబితాలోకి మరో హుషారైన గీతం చేరింది. ఈ సినిమాలోని ‘సానా కష్టం వచ్చిందే మందాకినీ’ అనే స్పెషల్ సాంగ్ లిరికల్ వీడియోను సినీయూనిట్ ఇవాళ విడుదల చేసింది. మణిశర్మ సంగీతం, చిరంజీవి స్టెప్పులు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి.
ఈ చిత్రంలోని ప్రత్యేక పాటలో చిరుకి జోడీగా రెజీనా సందడి చేసింది. భాస్కరభట్ల రవికుమార్ రచించిన ఈ పాటను రేవంత్, గీతామాధురి ఆలపించారు. దేవాదాయ శాఖ నేపథ్యంలో కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. చిరంజీవి తనయుడు, నటుడు రామ్‌చరణ్.. సిద్ధ అనే కీలక పాత్ర పోషించారు. చిరుకు జోడీగా కాజల్, చరణ్‌కు జంటగా పూజాహెగ్డే నటించారు. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడెక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా ఏప్రిల్ 29న విడుదలకానుంది. ఇందులో చిరు సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. నిరంజన్ రెడ్డి దీనికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మణిశర్మ సంగీతం సమకూరుస్తుండగా.. తిరు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
#Acharya on 29th April In Theatres pic.twitter.com/ptYGJnzPoQ
— Aakashavaani (@TheAakashavaani) January 31, 2022
(And get your daily news straight to your inbox)
Aug 08 | టాలీవుడ్ యువ హీరో ఆది సాయికుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘తీస్మార్ ఖాన్’. కళ్యాణ్ జీ గోగన దర్శకత్వం వహిస్తున్నాడు. ఆర్ఎక్స్ 100 ఫేం పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా నటించింది. ఇవాళ మేకర్స్ తీస్మార్... Read more
Aug 04 | టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘సీతారామం’ ఒకటి. ఈ మధ్య కాలంలో ఈ సినిమాకు ఏర్పడిన బజ్ మరేసినిమాకు ఏర్పడలేదు. ఇప్పటికే ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే విడుదలైన... Read more
Aug 04 | నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ టైమ్ ట్రావెల్ చిత్రం ‘బింబిసార’. గత కొన్నాళ్లుగా చక్కని హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోకు లభించిన చక్కని టైమ్ ట్రావెల్ చిత్రం కలసిరానుందని సినీవిశ్లేషకులు చెబుతున్నారు.... Read more
Aug 04 | తమిళ హీరో కార్తి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘యుగానికి ఒక్కడు’ సినిమా నుండి గతేడాది విడుదలైన ‘సుల్తాన్’ వరకు ఈయన ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతూ వస్తున్నాయి.... Read more
Aug 04 | దక్షిణాదిన నయనతార తర్వాత అంతటి ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకున్న నటి సాయి పల్లవి. ముఖ్యంగా టాలీవుడ్లో ఈమె క్రేజ్ టైర్2 హీరోలకు సమానంగా ఉంది. గ్లామర్‌కు అతీతంగా సినిమాలను చేస్తూ అటు యూత్‌లో ఇటు ఫ్యామిలీ... Read more