మెగాస్టార్ చిరంజీవి.. మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో కలసి నటిస్తున్న చిత్రం ఆచార్య. అన్ని సినిమాల మాదిరిగానే ఈ చిత్రంపై కూడా కరోనా ప్రభావం తీవ్రంగానే పడింది. అనేక బ్రేకులు మధ్య కొనసాగిన ఈ సినిమా షూటింగ్ మొత్తానికి తుది అంకానికి చేరుకుని పోస్టు ప్రోడక్షన్స్ పనులలో వుంది. ఇక ఇదే సమయంలో ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 4న విడుదల చేస్తామని ఇదివరకే ప్రకటించిన చిత్ర యూనిట్.. దీంతో అటు ప్రమోషన్స్ వర్క్ కూడా జరుపుకునే పనిలో ఉంది. ఇందులో భాగంగా చిత్రబృందం ముందస్తుగా చెప్పినట్లుగానే ఇవాళ సానా కష్టం లిరికల్ వీడియోను విడుదల చేసింది.
సంగీత దర్శకుడు మణిశర్మ- మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్‌కు టాలీవుడ్ అదిరిపోయే క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. మరోలా చెప్పాలంటే మణిశర్మ బీట్లకు చిరంజీవి డాన్స్ మూవ్ మెంట్స్ కలిసి ధియేటర్లలో అభిమానులచేత ఈలలు వేయించడం.. కెవ్వుకేకలు పెట్టించడం పరిపాటిగా మారిన విషయం కూడా తెలిసిందే. అయితే తాజాగా అచార్య చిత్రంతో ఈ కాంబినేషన్ మధ్య అదిరిపోయే కాంపిటీషన్ కూడా మళ్లీ ఏర్పడనుందన్న విషయం ఈ లిరికల్ వీడియోతో తేటతెల్లం అవుతోంది. ‘ఆచార్య’ చిత్రంలో చిరు అభిమానులకు మరోమారు పండగ వాతావరణాన్ని తీసుకురానుందని కూడా ఫిక్స్ అయ్యింది.
ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని ‘లాహే లాహే’, ‘నీలాంబరి’ పాటలు విశేషంగా అలరించాయి. ఇప్పుడా జాబితాలోకి మరో హుషారైన గీతం చేరింది. ఈ సినిమాలోని ‘సానా కష్టం వచ్చిందే మందాకినీ’ అనే స్పెషల్ సాంగ్ లిరికల్ వీడియోను సినీయూనిట్ ఇవాళ విడుదల చేసింది. మణిశర్మ సంగీతం, చిరంజీవి స్టెప్పులు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. మణిశర్మ మ్యూజిక్ మ్యాజిక్ కు చిరంజీవి డాన్స్ మూవ్ మెంట్లు చాలా రోజుల తరువాత మళ్లి జతకలిసింది. ఈ పాటలో చిరుకి జోడీగా రెజీనా సందడి చేసింది. భాస్కరభట్ల రవికుమార్ రచించిన ఈ పాటను రేవంత్, గీతామాధురి ఆలపించారు.
దేవాదాయ శాఖ నేపథ్యంలో కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. చిరంజీవి తనయుడు, నటుడు రామ్‌చరణ్.. సిద్ధ అనే కీలక పాత్ర పోషించారు. చిరుకు జోడీగా కాజల్, చరణ్‌కు జంటగా పూజాహెగ్డే నటించారు. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడెక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా ఫిబ్రవరి 4న విడుదలకానుంది. ఇందులో చిరు సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. నిరంజన్ రెడ్డి దీనికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మణిశర్మ సంగీతం సమకూరుస్తుండగా.. తిరు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
May 27 | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపోందుతున్న చిత్రానికి పవర్ ఫుల్ టైటిల్ ను అనుకుంటున్నారన్న ఊహాగానాలు చిత్రపురిలో వినిపిస్తున్నాయి. ఈ సినిమాతో తెలుగులో నేరుగా చిత్రాన్ని రూపొందిస్తున్న శంకర్... Read more
May 27 | ప్రయోగాత్మక కథలను.. నటనకు అస్కారమున్న పాత్రలను అందులోనూ యాక్షన్ సన్నివేశాల్లో నటించే స్కోప్ వున్న చిత్రాలను ఎంచుకోవడంలో విశ్వనటుడు కమల్ హాసన్ ఎప్పుడూ ముందుంటారు. చిత్రం ఎలాంటిదైనా ఆయాపాత్రలలో పరకాయ ప్రవేశం చేసిరా అన్నట్లుగా... Read more
May 26 | చిత్రరంగంపై మక్కువతో ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలివచ్చి దర్శకుడిగా మారిన అనిల్ రావిపూడి సినిమాలు.. అనుకున్నది అనుకున్నట్టుగా రూపోందించి సత్తాను చాటుకున్నారు. ఈ క్రమంలో కామెడీ సీక్వెల్ చిత్రాను తెరకెక్కించేందుకు ఆయన తన ప్రాధాన్యతను చూపుతున్నారు.... Read more
May 26 | తెలుగు సినీ పరిశ్రమలో వరుసగా విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత ఎం. రామకృష్ణారెడ్డి క్రితంరోజు రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. చెన్నైలో తుదిశ్వాస విడిచారు. 1948 మార్చి... Read more
May 25 | నాగచైతన్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 'థ్యాంక్యూ' సినిమా రూపొందింది. విభిన్నమైన ప్రేమకథా చిత్రం ఇది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా, ఇండియాలోను .. విదేశాల్లోను షూటింగును జరుపుకుంది. తమన్ సంగీతాన్ని సమకూర్చిన... Read more