Samantha item song from Allu Arjun's Pushpa ‘పుష్ప’లో సమంత ఐటెం సాంగ్.. మస్తు మసాలా సాంగ్..!

Samantha s first ever item song from allu arjun s pushpa lyrical video released

Samantha, Oo Antava..Oo Oo Antava, Pushpa, Allu Arjun, Rashmika mandana, sukumar, DSP, Indravathi Chauhan, Samantha news, Samantha English film, Samantha updates, Samantha movies, Samantha upcoming movies, Samantha breaking news, Samantha breaking updates, Samantha lineup of films, Samantha upcoming projects, Tollywood, Movies, Entertainment

Samantha is one of the most sought-after heroines in the Indian film industry. The south queen, instantly accepted to do the glamour song in Allu Arjun and Rashmika Mandanna starrer 'Pushpa - The Rise' directed by Sukumar. The lyric video of the item number 'Oo Solriya Oo Oo Solriya' just landed on the internet.

‘పుష్ప’లో సమంత ఐటెం సాంగ్.. మస్తు మసాలా సాంగ్..!

Posted: 12/10/2021 08:01 PM IST
Samantha s first ever item song from allu arjun s pushpa lyrical video released

హీరో అక్కినేని నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత సినిమాలపై మరింత ఫోకస్ పెట్టింది. వరుస సినిమాలకు సైన్ చేసేస్తూ జోరు చూపిస్తోంది. వివాహ బంధం నుంచి వైదొలిగిన కొన్నాళ్లకే మూడు సినిమాలకు ఒప్పందం చేసుకున్న సామ్.. అటు బాలీవుడ్ సినిమాను కూడా కన్ఫర్మ్ చేసిన విషయం తెలిసిందే. సినిమాలపై సినిమాలతో జోష్ లో వున్న సామ్.. మొట్టమొదటి సారిగా ఐటం సాంగ్‌లో నటించింది.

సమంత.. నటనకు, క్యూట్‌ లుక్స్‌కు ఫిదా కాని ప్రేక్షకులు లేరంటే అతిశయోక్తి కాదేమో! తక్కువకాలంలోనే స్టార్‌ హీరోయిన్‌గా స్టార్ డమ్‌ సంపాదించుకున్న సామ్‌.. అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్లో వస్తున్న క్రేజీ మూవీ పుష్పలో 'ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా..' స్పెషల్‌ సాంగ్‌లో అలరించింది. 'మీ మగబుద్ధే వంకరబుద్ధి..' అంటూ సాగిన ఈ సాంగ్‌ లిరికల్‌ వీడియో శుక్రవారం సాయంత్రం రిలీజైంది.

ఈ పాటలో లంగా జాకెట్‌లో కనిపించిన సమంత తన అందచందాలను ఆరబోస్తూ మరోసారి ఫిదా చేసింది. కాగా ఇప్ప‌టివ‌ర‌కు కెరీర్‌లో ఒక్క‌సారి కూడా స్పెషల్‌ సాంగ్స్ చేయ‌ని సామ్‌ మొద‌టిసారిగా బ‌న్నీ కోసం ఈ సాంగ్‌లో స్టెప్పులేసిన విషయం తెలిసిందే. దీంతో పుష్ప సినిమాకు స‌మంత‌, ఈ స్పెష‌ల్ సాంగ్ మ‌రింత స్పెష‌ల్‌ అట్రాక్షన్‌గా మారింది. కేవలం ఐదు రోజులు మాత్రమే షూటింగ్ చేసిన‌ ఈ పాట కోసం స‌మంత‌ ఏకంగా కోటి 30 లక్షల కోట్లు రెమ్యునరేషన్ అందుకున్న‌ట్లు సోష‌ల్ మీడియాలో వార్త‌లు చక్కర్లు కొడుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles