Nithya Menen to play Key Role in 'Dasara' నాని రుణం తీర్చుకుంటున్న నిత్యామీనన్.!

Nithya menon to play key role in natural star nanis dasara

Nani, natural star, Nithya menen, Keerthi suresh, Dasara, Srikanth Odela, Sudhakar Cherukuri, Nenu Local combination, Ala Modalaindi, Tollywood, Movies, Entertainment

South Indian Glamorous Heroine Nithya Menen to play Key Role in Natural star Nanis' 'Dasara'. Titled as 'Dasara', this movie venture is produced by Sudhakar Cherukuri under his Sri Lakshmi Venkateswara Cinemas banner with debutant director Srikanth Odela.

నాని రుణం తీర్చుకుంటున్న నిత్యామీనన్.!

Posted: 11/01/2021 05:42 PM IST
Nithya menon to play key role in natural star nanis dasara

నిత్యామీనన్ దక్షిణాదిలో మంచిక్రేజ్ ఉన్న హీరోయిన్. అందం, అభినయం అమె సోంతం. తన చిరుమందహాసం, తనలోని భావిన్ని తెలిపే కళ్లతోనే అమె కుర్రాళ్లను కట్టిపడేసింది. ఈ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఎక్కడా కూడా ఆమె ఎక్స్ పోజింగ్ కు చాన్స్ ఇవ్వకుండా.. తన నాచురల్ అందంతోనే స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. సహజ నటిగా సాయిపల్లవికి ముందు వినిపించిన పేరు నిత్యామీనన్. అయితే ఈ మధ్య కాసింత బొద్దుగా తయారుకావడంతో అమెకు సినిమా ఛాన్సులు సన్నగిల్లాయి.

అయితే ప్రస్తుతం అమె ప్రాణ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో ఓ కామియో రోల్ కు ఎవర్ని చేర్చుకుందామా.? అని అలోచించిన అమెకు.. తనతో పాటే కెరీర్ ను ప్రారంభించిన నాచ్యురల్ స్టార్ నాని గుర్తుకు వచ్చాడు. అలా మొదలైంది చిత్రంతో వీరిద్దరూ తమ కెరీర్ ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా, ప్రాణ చిత్రంలో నాని కామియో రోల్ చేయడానికి అంగీకరించడంతో ఆయన రుణాన్ని కూడా నిత్య మీనన్ త్వరలోనే తీర్చుకోనుంది. అదేలా అంటే ఈ డీటైల్స్ లోకి వెళ్లాల్సిందే. నాని, కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా దసరా చిత్రం రూపోందుతున్న విషయం తెలిసిందే. 

అయితే ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించేందుకు నటి అవసరం పడింది. దీంతో నాని.. నిత్యను సంప్రదించగా, అమె అంగీకరించింది. దీంతో నాని రుణాన్ని త్వరగానే తీర్చేసుకుంది నిత్య. ఇంతకీ ఆ సినిమా పేరేంటో తెలుసా.? 'దసరా'. నాని కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాకి, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో కథానాయికగా కీర్తి సురేశ్ ను తీసుకున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'నేను లోకల్' విజయాన్ని సాధించింది. మళ్లీ  ఇప్పుడు ఈ కాంబినేషన్ సెట్  అయింది. ఈ సినిమాలో ముఖ్యమైన గెస్టు రోల్ కోసం నిత్యామీనన్ ను తీసుకున్నారు. ఆమె కెరియర్ నాని సినిమా 'అలా మొదలైంది'తో మొదలైందనే సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nani  natural star  Nithya menen  Keerthi suresh  Dasara  Srikanth Odela  Sudhakar Cherukuri  Tollywood  

Other Articles