Megastar starts God Father in Ooty ఊటీలో ‘గాడ్ ఫాదర్’కు శ్రీకారం చుట్టిన మెగాస్టార్..

Megastar starts mohan raja s god father in ooty

Chiranjeevi, God Father, Mohan Raja, Chiranjeevi God Father, Chiranjeevi God Father news, Chiranjeevi God Father updates, Chiranjeevi God Father shoot, Chiranjeevi God Father Ooty, Chiranjeevi God Father latest, Chiranjeevi God Father breaking news, Chiranjeevi God Father breaking updates, Chiranjeevi God Father budget, Chiranjeevi God Father release date, Chiranjeevi God Father producers, Chiranjeevi God Father production house, Tollywood, movies, Entertainment

Megastar starts God Father in Ooty: Megastar Chiranjeevi’s God Father is said to be a high intense political drama and it has commenced the second schedule of shoot in Ooty today. God Father is the official remake of the Malayalam hit film Lucifer and Mohan Raja is directing the remake version.

ఊటీలో ‘గాడ్ ఫాదర్’కు శ్రీకారం చుట్టిన మెగాస్టార్ చిరంజీవి..

Posted: 09/22/2021 07:05 PM IST
Megastar starts mohan raja s god father in ooty

రాజకీయాలకు సెలపు ప్రకటించిన చిత్రసీమలోకి రీ-ఎంట్రీ ప్రకటించిన మెగాస్టార్ చిరంజీవి సినిమాల స్పీడ్ పెంచాడు. ఖైదీ నెంబర్ 150 చిత్రం మంచి హిట్ సాధించిన తరువాత సైరా నరసింహారెడ్డితో తన సత్తా చాటాడు. ఇక తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య చిత్రం కూడా పూర్తి చేసిన మెగాస్టార్.. తాజాగా తన తదుపరి చిత్రం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాడు. ఇప్పుటికే తన ఖాతాలో నాలుగుకి పైగా సినిమాలు ఉండటంతో ఒక్కోక్క ప్రాజెక్టును నెమ్మదిగా పట్టాలెక్కించే పనిలో వున్నారాయన. ఇందులో భాగంగా ఆయన గోవాకు వెళ్లారు.

గోవాలో ఒక చక్కని ప్రదేశంలో చిరంజీవి ప్రస్తతం తన 153వ సినిమా షూటింగ్ ను ప్రారంభించారు. దర్శకుడు మోహన్ రాజాతో మలయాళ బ్లాక్ బస్టర్ హిట్ అయిన‌ ‘లూసిఫర్‌’ కు ఇది రీమేక్‌గా తెరకెక్కుతోంది. అయితే చిత్రం మూల కథను మాత్రమే తీసుకుని.. అనేక మార్పులు, చేర్పులు చేసి మంచి కమర్షియల్ చిత్రంగా దీనిని తెరకెక్కిస్తున్నారని వినికిడి. ఇటీవల చిరంజీవి బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన గ్లింప్స్ కి సూపర్భ్ రెస్పాన్స్ వచ్చింది. చిత్ర షూట్ ఇవాళ ఊటీలో ఓ చక్కని ప్రదేశంలో చిరంజీవి ప్రారంభించారు.

పొలిటికల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పలువురు న‌టులు మెరవనున్నారు. ఈ సినిమాలో నటి కుష్భూ ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే సత్యదేవ్‌.. కీల‌క పాత్రలో న‌టిస్తున్నారని సమాచారం. త్వరలోనే మిగిలిన నటీనటుల వివరాలను కూడా చిత్ర బృందం వెల్లడించనుంది. ఈ షూట్ లో చిరు సహా మరికొంతమంది కీలక నటులు కూడా పాల్గొన్నారని సమాచారం. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ మరియు కొణిదెల ప్రొడక్షన్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chiranjeevi  God Father  Mohan Raja  Chiranjeevi God Father  Lucifer remake  Nayanthara  Satyadev  Tollywood  

Other Articles

Today on Telugu Wishesh