'Love Story' Trailer: Perfect chemistry, perfect trailer ఏమోషన్స్ నిండిన గ్రామీణ నేపథ్య ‘లవ్ స్టోరీ’ ట్రైలర్

Sekhar kammula s love story theatrical trailer with perfect chemistry filled with emotions

LoveStory, Theatrical Trailer, Naga Chaitanya, Sai Pallavi, Sekhar Kammula, Pawan Ch, Narayan Das, Puskur Ram Mohan Rao, Sree Venkateswara Cinemas LLP, Tollywood, movies, Entertainment

"So happy to be finally putting this out… Can’t wait to see you all at the theatres again!" wrote Naga Chaitanya, plugging the trailer for 'Love Story', in which he plays a Zumba trainer from a middle-class family. Sai Pallavi, who becomes Chay's friend, is struggling to find a job, a travail that gets a comical depiction in the typical Sekhar Kammula style. She can dance like a dream and how she and her male friend rise against odds is the story.

యువతను విశేషంగా ఆకట్టుకుంటున్న ‘లవ్ స్టోరీ’ ట్రైలర్

Posted: 09/13/2021 12:31 PM IST
Sekhar kammula s love story theatrical trailer with perfect chemistry filled with emotions

శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ఇప్పటివరకు తెరకెక్కిన అన్ని చిత్రాలు ప్రేమ, ఎమోషన్స్, కుబుంబాల బాధ్యత ఇలా అన్నీ సమాంతరంగా మేళమితమై వుంటాయి. అయితే తాజాగా నవయువ సామ్రాట్ నాగ చైతన్య, అల్లరిపిల్లగా ఫిదా చిత్రంలో తెలుగు ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానం ఏర్పర్చుకున్న సాయిపల్లవి జంటగా రూపోందుతున్న రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘లవ్‌స్టోరీ’ మాత్రం గత చిత్రాలకు పూర్తిగా భిన్నంగా వుండనుంది. అయితే ఈ చిత్రంలోనూ అన్నింటినీ ఉండేలా చేసిన శేఖర్ కమ్ముల.. ఏయోషన్స్ కు మాత్రం అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్టు టీజర్ ద్వారా తెలుస్తోంది.

ఫిదా త‌ర్వాత శేఖ‌ర్ క‌మ్ముల నుండి వ‌స్తున్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. వినాయ‌క చ‌వితికి విడుద‌ల కావ‌ల‌సిన ఈ చిత్రం ప‌లు కార‌ణాల వ‌ల‌న వాయిదా ప‌డింది. సెప్టెంబర్‌ 24న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపింది. ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదల చేసిన ‘లవ్‌స్టోరీ’ టీజర్‌, ‘సారంగ దరియా’ పాట యువతను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సారంగద‌రియా పాట అయితే అంచ‌నాల‌ను రెట్టింపు చేసింది. ఇక దీనికి తోడు ‘నీ చిత్రం చూసినా.. చిత్తం తెలిసేనే చిత్తరువైతిరయ్యే’ అనే పాట చిత్ర కథను.. ప్రేమికుల మధ్య ఎడబాటును కూడా తెలియజేస్తోంది.

ఇక తాజాగా చిత్ర ట్రైలర్ విడుద‌ల చేశారు మేక‌ర్స్. సున్నితమైన ప్రేమ కథతో శేఖర్ కమ్ముల మరోసారి హృదయాన్ని తాకేలా సినిమాని తెర‌కెక్కించినట్టు ట్రైల‌ర్ చూస్తే అర్ధ‌మ‌వుతుంది. సినిమాలో డైలాగ్స్, ఎమోష‌న్స్, చైతూ-సాయి ప‌ల్ల‌వి డ్యాన్స్ అదిరిపోనున్నాయ‌ని తాజాగా విడుద‌లైన ట్రైల‌ర్‌ని చూస్తే తెలుస్తుంది. ఈ సినిమాలో రావు రమేశ్ .. దేవయాని .. ఈశ్వరీరావు ముఖ్యమైన పాత్రలను పోషించారు. ప‌వ‌న్ సీహెచ్ సంగీతం అందించారు. ఈ సినిమాను సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వేంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు నిర్మించాయి. నారాయణ దాస్, కే నారంగ్ పుష్కర్ రామ్మోహన్ రావ్ నిర్మాతగా బాధ్యతలు చేపట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles