పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - పాన్ ఇండియా నటుడు రానా దగ్గుబాటి కలసి నటిస్తున్న తొలి చిత్రం 'భీమ్లా నాయక్'. సాగర్ చంద్ర కాంబినేషన్లో రూపోందుతున్న ఈ చిత్రం మలయాళంలో భారీ విజయాన్ని అందుకున్న 'అయ్యప్పనుమ్ కోషియుమ్' సినిమాకి రీమేక్ అయినా పవన్-రానా జోడీగా వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ చిత్రంపై అటు మెగా ఫాన్స్, ఇటు దగ్గుబాటి అభిమానుల్లోనూ అంచనాలు పెరిగిపోయాయి. ఇక దీనికి తోడు ఇటీవల విడుదలైన స్నీక్ పీక్ కూడా అభిమానులను ఆకట్టుకోవడంతో పాటు చిత్రంపై అంచనాలను మరింత పెంచింది. పోలీస్ ఆఫీసర్ గా పవన్ కల్యాణ్ నటిస్తున్న ఈ సినిమాలో, రానా మరో ప్రధానమైన పాత్రను పోషిస్తున్నాడు.
పవన్ సరసన నిత్యామీనన్ నటిస్తుండగా, రానా జోడీగా ఐశ్వర్య రాజేశ్ కనిపించనుంది. చిత్రీకరణ పరంగా చివరిదశకు చేరుకున్న ఈ సినిమాకి, తమన్ సంగీతాన్ని అందించాడు. ఫస్టు సింగిల్ ను పవన్ పుట్టినరోజున వదలాలనే ఆలోచనలో ఉన్నారు. ఇక ఈ సినిమా ఆడియో హక్కులను ప్రముఖ ఆడియో సంస్థ భారీ రేటుకు కొనుగోలు చేసినట్టుగా చెబుతున్నారు. ఇందుకోసం వారు 5.04 కోట్లు చెల్లించినట్టుగా తెలుస్తోంది. డ్యూయెట్లు పెద్దగా లేనప్పటికీ, సందర్భానుసారం వచ్చే పాటలు ఆకట్టుకునేలా ఉంటాయని అంటున్నారు. జనవరి 12వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
(And get your daily news straight to your inbox)
May 21 | యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నాడు. విద్యాసాగర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై విడుదలకు ముందే మంచి హైప్ క్రియేట్ అయిన సంగతి తెలిసిందే. మే6న విడుదలైన ... Read more
May 21 | తన పుట్టిన రోజు సందర్భంగా ఇంటికి వచ్చిన అభిమానులను కలవలేకపోయినందకు వారికి క్షమాపణలు చెప్పాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఆ సమయంలో ఇంట్లో లేనని.. అందుకే కలవడం కుదరలేదని..క్షమించాలని కోరారు. ఈ మేరకు తాజాగా... Read more
May 21 | రామ్ హీరోగా లింగుసామి 'ది వారియర్' సినిమాను రూపొందించాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమాలో రామ్ ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఆయన... Read more
May 21 | తెలుగు చిత్రపరిశ్రమలో ప్రస్తుతం సక్సెస్ ఫుల్ చిత్రాల దర్శకుల జాబితా పెరగడం సంతోషమే. విజయవంతమైన చిత్రాలతో ఆ జాబితాలో నిలిచిన మరో దర్శకుడు అనీల్ రావిపూడి. లో ప్రస్తుతం తలెుగు చిత్రఅనిల్ రావిపూడి దర్శకత్వంలో... Read more
May 21 | పవన్ కల్యాణ్ ప్రస్తుతం 'హరి హర వీరమల్లు' సినిమా షూటింగులో బిజీగా ఉన్నారు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఎ.ఎమ్.రత్నం నిర్మిస్తున్నారు. చారిత్రక నేపథ్యంలో నడిచే ఈ కథలో పవన్ సరసన నాయికగా... Read more