‘chukkala melam’ song from ‘Sridevi Soda Center’ ‘సోడాల శ్రీదేవి’ ఫస్ట్ లుక్ టీజర్.. ఆనంది అదుర్స్.!

Chukkala melam song from sudheer babu sridevi soda center

Sridevi Soda Center, chukkala melam dikkula thaalam, Sudheer Babu, Anandhi, Karuna Kumar, Mani Sharma, Kalyan Chakravarthy, 70mm Entertainments, Vijay Chilla, Shashi Devireddy, Tollywood, movies, Entertainment

Sridevi Soda Center is one of the upcoming films in Telugu. Sudheer Babu is playing the lead role. Karuna Kumar of ‘Palasa 1978’ fame is the director. The makers presented the lyrical video of chukkala melam dikkula thaalam today, written by Kalyan Chakravarthy, sung by Anurag Kulkarni.

‘శ్రీదేవి సోడా సెంటర్’ నుంచి ‘చుక్కలమేళం’ సాంగ్.!

Posted: 08/17/2021 01:54 PM IST
Chukkala melam song from sudheer babu sridevi soda center

టాలెంటెడ్ బ్యూటీ ఆనంది ఈ ఏడాది జాంబిరెడ్డి సినిమాతో టాలీవుడ్ క‌మ్ బ్యాక్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ వ‌రంగ‌ల్ భామ ప్ర‌స్తుతం సుధీర్ బాబు హీరోగా న‌టిస్తోన్న విలేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ‘శ్రీదేవి సోడా సెంట‌ర్’ సినిమాలో న‌టిస్తోంది. ప‌లాస ఫేం క‌రుణకుమార్ డైరెక్ష‌న్ లో తెర‌కెక్కుతొన్న తాజా చిత్రం విడుదలకు సిద్దంగా వుంది. ఈ నెల 27న ప్రపంచ తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా మేక‌ర్స్ ఈ మూవీ నుంచి మరో లిరికల్ వీడియో సాంగ్ ను విడుద‌ల చేశారు.

'చుక్కల మేళం .. దిక్కుల తాళం .. ఒక్కటయే ఈ సంబరం .. ఆ సాంతం నీ సొంతం' అంటూ ఈ పాట సాగుతోంది. ఖవాలి  వరుసల్లో మణిశర్మ ఈ బాణీ కట్టారు. ఈ తరహా పాటలు బాగా చేస్తారనే పేరు మణిశర్మకు ఉంది. కల్యాణ్ చక్రవర్తి సాహిత్యం .. అనురాగ్ కులకర్ణి గాత్రంతో ఈ పాట సాగింది. ఈ చిత్రంలోసోడాల శ్రీదేవి పాత్ర‌లో క‌నిపించిన ఆనంది.. ఈ పాటలో మాత్రం పదహారణాల తెలుగుదనంతో కట్టిపడేసేలా అందమైన కుందనపు బొమ్మలా కనిపించింది.

మరోవైపు సుధీర్ బాబు కూడా గడ్డంతో పాటు కొత్త లుక్ తో కనిపిస్తున్నారు. 84 బోట్లతో చిత్రీకరించిన క్లైమాక్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. 70 ఎంఎం ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్ పై విజ‌య్ చిల్లా, శ‌శి దేవిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ స్టోరీతో ప‌లాస సినిమా తెర‌కెక్కించి మంచి హిట్టు కొట్టాడు కరుణ కుమార్. ఈ సినిమా స‌క్సెస్ తో అగ్ర నిర్మాత‌ల దృష్టిని ఆక‌ర్షించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh