టాలీవుడ్ లో మరో హీరో పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు. అక్కినేని నాగేశ్వర్ రావు పెద్ద మనుమడు సుమంత్ ఇప్పుడు రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు. తమ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలైన పవిత్ర అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు. కరోనా నేపథ్యంలో ఇరు కుటుంబ పెద్దలు, అత్యంత సన్నిహితుల మధ్య ఈ వివాహం జరుగనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు సుమంత్, పవిత్రల వెడ్డింగ్ కార్డు నెట్టింట వైరల్ అవుతోంది.
సుమంత్ కుమార్ వెడ్స్ పవిత్ర వివాహానికి ఇదే మా ఆహ్వానం అంటూ ఆ శుభలేఖ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ కార్డులో SP అనే అక్షరాలను హైలైట్ చేస్తూ తీర్చిదిద్దారు. అయితే ఈ ఇన్విటేషన్ కార్డులో పెళ్లి తేదీ, వివాహ వేదిక వంటి వివరాలు లేకపోవడంతో సుమంత్ పెళ్లిపై కొద్దిగా సస్పెన్స్ నెలకొంది. సుమంత్‌కు 2004లో నటి కీర్తిరెడ్డితో వివాహం జరిగింది. ఈమె పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన తొలి ప్రేమ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది. అయితే ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో రెండేళ్లలోపే విడాకులు తీసుకున్నారు.
ఆ తర్వాత కీర్తి రెడ్డి రెండో పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయింది. కానీ సుమంత్ మాత్రం సింగిల్‌గా ఉన్నాడు. ఈ క్రమంలో సుమంత్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సుమంత్ పెళ్లి కార్డు నెట్టింట వైరల్‌గా మారింది. అక్కినేని నాగేశ్వరరావు మనుమడిగా ప్రేమకథ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు సుమంత్. ఆ తర్వాత సత్యం, గోదావరి, గోల్కొండ హైస్కూల్, మళ్లీ రావా వంటి చిత్రాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం సుమంత్ అనగనగా ఒక రౌడీ చిత్రంలో నటిస్తున్నాడు.
వీరి పెళ్లిపత్రిక ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ముక్కుసూటిగా మాట్లాడే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా తనదైన శైలిలో స్పందించారు. సుమంత్ తో ఉన్న సన్నిహిత్యంతో ఆయన 'ఒక సారి అయ్యాక కూడా నీకింకా బుద్ధి రాలేదా సుమంత్? నీ ఖర్మ, ఆ పవిత్ర ఖర్మ. అనుభవించండి' అని ట్వీట్ చేశాడు.
(And get your daily news straight to your inbox)
Aug 08 | టాలీవుడ్ యువ హీరో ఆది సాయికుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘తీస్మార్ ఖాన్’. కళ్యాణ్ జీ గోగన దర్శకత్వం వహిస్తున్నాడు. ఆర్ఎక్స్ 100 ఫేం పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా నటించింది. ఇవాళ మేకర్స్ తీస్మార్... Read more
Aug 04 | టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘సీతారామం’ ఒకటి. ఈ మధ్య కాలంలో ఈ సినిమాకు ఏర్పడిన బజ్ మరేసినిమాకు ఏర్పడలేదు. ఇప్పటికే ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే విడుదలైన... Read more
Aug 04 | నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ టైమ్ ట్రావెల్ చిత్రం ‘బింబిసార’. గత కొన్నాళ్లుగా చక్కని హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోకు లభించిన చక్కని టైమ్ ట్రావెల్ చిత్రం కలసిరానుందని సినీవిశ్లేషకులు చెబుతున్నారు.... Read more
Aug 04 | తమిళ హీరో కార్తి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘యుగానికి ఒక్కడు’ సినిమా నుండి గతేడాది విడుదలైన ‘సుల్తాన్’ వరకు ఈయన ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతూ వస్తున్నాయి.... Read more
Aug 04 | దక్షిణాదిన నయనతార తర్వాత అంతటి ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకున్న నటి సాయి పల్లవి. ముఖ్యంగా టాలీవుడ్లో ఈమె క్రేజ్ టైర్2 హీరోలకు సమానంగా ఉంది. గ్లామర్‌కు అతీతంగా సినిమాలను చేస్తూ అటు యూత్‌లో ఇటు ఫ్యామిలీ... Read more