Get ready for Khaidi sequel! సీక్వెల్ తో వచ్చే ఏడాదిలో వస్తానంటున్న ‘ఖైధీ’

Producer sr prabhu conforms khaidi s sequel

Karthi, Khaidi, Khaidi sequel, Karthi Birthday, Khaidi producer SR Prabhu, Lokesh kanagaraj, Mani Ratnam’s Ponniyin Selvan, PS Mithran’s Sardar, Kamal Haasan’s Vikram, Vijay’s next film, Kathi's next film, tollywood, Entertainment, Movies

Khaidi can be considered as one of the landmark films in the career of hero Karthi. Talking about this much-anticipated sequel, Khaidi’s producer SR Prabhu said that there will definitely be a second part for this movie. He said that it will go on the floors once Karthi and director Lokesh Kanagaraj get done with their respective projects.

సీక్వెల్ తో వచ్చే ఏడాదిలో వస్తానంటున్న ‘ఖైధీ’

Posted: 05/27/2021 12:54 PM IST
Producer sr prabhu conforms khaidi s sequel

అవారా చిత్రంలో పరిచయం అయినా ఊపిరి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన తమిళ హీరో కార్తి ఆ తరువాత ఖైదీ చిత్రంలో తనలోని నటనతో అభిమానులను సోంతం చేసుకున్నాడు. ఆయన నటించిన పలు చిత్రాలు తెలుగులో కూడా విడుదల కావడం ఇక్కడి ప్రక్షకులు కూడా వాటిని అదరించడంతో అవి హిట్ చిత్రాలుగా నిలిచాయి. వాటిలో 'ఖైదీ' స్థానం ప్రత్యేకమనే చెప్పాలి. ఎస్.ఆర్. ప్రభు నిర్మాణంలో .. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది.

భారీ బడ్జెట్ చిత్రాలే బాక్సాఫీసు వద్ద బోల్తా కొడుతున్న తరుణంలో అత్యల్ప బడ్జెట్ తో తీసిని చిత్రం భారీ విజయాన్ని అందుకోవడం గోప్పవిషయమే. ఒక పోలీస్ స్టేషన్ సెట్ .. ఒక అనాథ బాలికల హాస్టల్ సెట్ .. సింగిల్ కాస్ట్యూమ్ లో హీరో. ఒక్క లారీ. అంతేకాదు పట్టుమని పది మంది క్యారెక్టర్ అర్టిస్టులు. ఇంత తక్కువ బడ్జెట్ లో లోకేశ్ కనగరాజ్ చిత్రీకరించిన ఈ సినిమా అటు తమిళంతో పాటు తెలుగు, మళయాళం సహా ఇతర భాషల్లోనూ వసూళ్ల వర్షాన్ని కురిపించింది. హీరోయిన్ .. రొమాంటిక్ పాటలు .. కామెడీ లేకపోయినా ఘన విజయాన్ని అందుకుంది.

అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ వస్తే బాగుంటుందని కార్తి అభిమానులు భావించారు. సీక్వెల్ తప్పకుండా ఉంటుందని ఇటీవల ఒక వేదికపై కార్తి చెప్పాడు కూడా. అయితే ఆ తరువాత ఎక్కడా ఈ ప్రస్తావన లేకపోవడంతో, ఈ ప్రాజెక్టు ఉండదనే అంతా అనుకున్నారు. కానీ తాజాగా నిర్మాత ఎస్.ఆర్. ప్రభు మాట్లాడుతూ, ఈ సినిమాకి సీక్వెల్ ఉందని స్పష్టం చేశాడు. సీక్వెల్ కి సంబంధించిన స్క్రిప్ట్ రెడీ అవుతోందనీ .. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని అన్నాడు. ప్రస్తుతం 'సర్దార్' సినిమా చేస్తున్న కార్తి, ఆ తరువాత 'ఖైదీ' సీక్వెల్ కి రానున్నాడన్న మాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Karthi  Khaidi  Khaidi sequel  Karthi Birthday  SR Prabhu  Lokesh kanagaraj  Ponniyin Selvan  Sardar  tollywood  

Other Articles