sandeep raj to direct star hero in his next స్టార్ హీరో కోసం స్ర్కిప్ట్ రెడీ చేసిన సందీప్ రాజ్

Colour photo director sandeep raj to direct star hero in his next

Colour Photo, director, sandeep raj, star hero, script, Sai Rajesh, Suhas, Chandini, Telugu cinema, movies, entertainment, tollywood

Coming from a first-time director like Sandeep Raj, ‘Colour Photo‘ surprised the trade big time with the kind of positive feel it brought to the releases that went directly for releasing on OTT platforms. Now, director sandeep raj to direct star hero in his next. sources say he is ready with the script and a big banner GA-2 is welcoming him for his project.

స్టార్ హీరో కోసం స్ర్కిప్ట్ రెడీ చేసిన సందీప్ రాజ్

Posted: 04/03/2021 04:18 PM IST
Colour photo director sandeep raj to direct star hero in his next

కలర్ ఫోటో చిత్రంతో తన లోని దర్శకత్వ కోణాన్ని ప్రేక్షకులు ముందు ప్రవేశపెట్టి మంచి మార్కులు సాధించిన దర్శకుడు సందీప్ రాజ్. ఒక్క షార్ట్ ఫిల్మ్ తీసేసి.. సినిమా ఛాన్స్ పట్టేస్తున్నారు. నిజంగా ఇది చాలా శుభపరిణామం. ఇలా కొత్త దర్శకులను ప్రోత్సహించడంలో పెద్ద బ్యానర్లు సైతం ఉత్సాహాన్ని చూపుతుండటం విశేషం. ఇక మారుతున్న కాలానికి అనుగూణంగా సినీ నిర్మాణ సంస్థలు కూడా కొత్త దర్శకులకు అవకాశాలను అందిస్తున్నాయి.

ముఖ్యంగా గీతా ఆర్ట్స్ వారు వరుసగా కొత్త దర్శకులకు అవకాశాలు ఇస్తూ వస్తున్నారు. ఆ బ్యానర్లో సినిమా చేయాలనే ఆశ.. ఆసక్తి కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి దర్శకుడికి ఉండటంతో పాటు యంగ్ హీరోలు కూడా అసక్తిని కనబరుస్తుంటారు. తాజాగా ఆ బ్యానర్లో వర్ధమాన దర్శకుడు సందీప్ రాజ్ అవకాశం దక్కించుకున్నాడు. ఇటీవల ఓటీటీలో విడుదలై మంచి ఆదరణ పొందిన చిత్రాలలో 'కలర్ ఫొటో' ఒకటి. సుహాస్ - చాందినీ చౌదరి జంటగా నటించిన ఈ సినిమాకి సందీప్ రాజ్ దర్శకత్వం వహించాడు.

కథ .. స్క్రీన్ ప్లే .. సంభాషణలపై కూడా ఆయనకి మంచి అనుభవం ఉంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన 'కలర్ ఫొటో'.. యూత్ ను ఒక రేంజ్ లో ఆకట్టుకుంది. ఆ సినిమా చూసిన గీతా ఆర్ట్స్ వారు, తమ బ్యానర్లో ఒక సినిమా చేయమని సందీప్ రాజ్ కి అడ్వాన్స్ ఇచ్చారట. అయితే ఈ సినిమా ఒక మీడియం రేంజ్ హీరోతో ఉండవచ్చని అనుకున్నారు. కానీ ఒక స్టార్ హీరోతో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందనేది తాజా సమాచారం. ఆ స్టార్ హీరో ఎవరనేది త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Colour Photo  director  sandeep raj  star hero  script  Sai Rajesh  Suhas  Chandini  Telugu cinema  tollywood  

Other Articles

Today on Telugu Wishesh