Pawan Kalyan leads the fight in justice for women వకీల్ బొమ్మను ఇరగదీసిన పవర్ స్టార్

Pawan kalyan s vakeel saab trailer promises gripping courtroom drama

Pawan Kalyan Vakeel Saab trailer, watch Vakeel Saab trailer, Vakeel Saab trailer review, Vakeel Saab plot, Vakeel Saab release date, pawan kalyan new filmvakeel saab, vakeel saab poster, pawan kalyan, Anjali, Nivetha Thomas, Ananya Nagalla, Sriram Venu, Dil Raju, Boney Kapoor, Tollywood, movies, entertainment

Producer Boney Kapoor on Monday released the much-awaited trailer of Vakeel Saab, which stars Telugu superstar Pawan Kalyan in the lead role. “Ultimately Justice will win when you’ve the right person on your side (sic),” tweeted Bollywood’s hit producer, while sharing the trailer.

అంచనాలు అమాంతం పెంచేసిన పవర్ స్టార్ ‘వకీల్ సాబ్’ ట్రైలర్.!

Posted: 03/29/2021 07:31 PM IST
Pawan kalyan s vakeel saab trailer promises gripping courtroom drama

ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టిస్తోన్న 'వ‌కీల్ సాబ్' సినిమా వచ్చే నెల (ఏప్రిల్) 9న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రం నుంచి ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ముగ్గరమ్మయిలకు అండగా నిలిచే వకీల్ పాత్రలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. రోటిన్ కు భిన్నంగా న్యాయవాది పాత్రలో మెరువనున్నారు. ఇప్పటికే చిత్రానికి సంబంధించిన పాటలు, పోస్టర్లతో అంచానాలను భారీగా పెంచేసిన చిత్రం.. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ తో ఇక అదిరిపోయింది. ఏప్రిల్ 9 ఎఫ్పుడెప్పుడు వస్తుందా.? అంటూ అభిమానులు నీరిక్షిస్తున్నారంటే పవన్ చిత్రానికి వున్న క్రేజ్ అది.

పింక్ చిత్రానికి రిమేక్ గా తెలుగులో పవన్ కల్యాణ్ చేస్తున్నారని అనగానే ఈ చిత్రాన్ని హిందీలో చూడనివారు కూడా చూసి.. బాగుంది అని కితాబిచ్చారు. మరి ఇలా చూసిన చిత్రాన్ని మరోమారు పవన్ కల్యాణ్ చేసినా చూడటానికి రెడీ అయ్యారంటేనే అది ఆయనకున్న స్టార్ ఇమేజ్ తప్పితే మరోటి కాదు. అయితే కథలో చేసిన స్వల్ప మార్పులు కూడా ఈ చిత్రన్ని అభిమానుల్లో రక్తికట్టించేలా చేస్తున్నాయి.  ‘మీరు వర్జినా.. అని అమ్మాయిలను అడగొచ్చు.. మేం అబ్బాయిలను అడగొద్దా’ అంటూ కోర్టులో పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ వాదిస్తూ ప్రత్యర్థి వర్గం న్యాయవాది అబ్జక్షన్ చెప్పడం ఆకట్టుకుంది.

అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ల కీలక పాత్రధారులుగా కనిపిస్తున్నారు. ‘మీరు వర్జినా..?. అందరికీ వినబడేట్టు గట్టిగా చెప్పండి’ అంటూ ప్రకాశ్‌ రాజ్‌ నివేథాను ప్రశ్నిస్తుండడంతో ట్రైలర్‌ ప్రారంభమవుతుంది. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్నప్పటికీ ట్రైలర్ లో మాత్రం కనిపించలేదు. న్యాయవాది పాత్రలో పవన్‌ ఆకట్టుకున్నారు. పవన్ కు ప్రత్యర్థి న్యాయవాదిగా ప్రకాశ్ రాజ్‌ కనిపిస్తున్నారు. అత్యాచార ఘటనపై కోర్టులో జరిగే వాదోపవాదనలు సినిమాలో కీలకంగా ఉండనుంది. వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో రూపోందిన ఈ చిత్రం ట్రైలర్ అభిమానులలో అంచనాలను ఉవ్వెత్తకు చేర్చింది.

శ్రీవేంకటేశ్వర సినీ క్రియేషన్స్‌ బ్యానర్ పై దిల్‌రాజ్‌, శిరీశ్‌ ఈ సినిమాను నిర్మిస్తుండగా తమన్‌ సంగీతం అందిస్తున్నాడు. బోనీ కపూర్‌ సమర్పణలో చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా ఏప్రిల్‌ 9వ తేదీన భారీ స్థాయిలో విడుదల కానుంది. అమెజాన్ ప్రైమ్ డిజిటల్ రైట్స్ ను తీసుకోగా.. శాటిలైట్ రైట్స్‌ను జీ తెలుగు కొనేసింది. ఈ సినిమాపై పవన్‌ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో.. వస్తున్న ఈ చిత్రంలో పవన్ సరసన శ్రుతిహాసన్ నటిస్తుండగా... ప్రకాశ్ రాజ్, నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles