సుప్రీంహీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న 'రిపబ్లిక్' చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇవాళ విడుదల చేశాడు. 'డెబై నాలుగేళ్లుగా మనం ప్రభుత్వం ఉందనే భ్రమల్లో మనం బతుకుతున్నాం. ప్రభుత్వం అంటే ఏమిటో మనం ఇంకా కనుక్కోవాల్సి ఉంది' అని పోస్టర్ పై రాసి ఉంది. భారత ప్రజాస్వామ్యం నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకులు దేవా కట్టా. రోటిన్ కు భిన్నమైన కథను ఎంచుకున్న సాయి ధరమ్ తేజ్.. ఈ చిత్రాన్ని ఓకే చేసినట్టు సరిగ్గా గణతంత్ర దినోత్సవం రోజునే ప్రకటించిన విషయం తెలిసిందే.
మరోవైపు ఈ పోస్టర్ పై రామ్ చరణ్ ప్రశంసలు కురిపించాడు. పోస్టర్ ఎంతో ఆకట్టుకుందని చెప్పాడు. తన సోదరుడు సాయి ధరమ్ తేజ్, దేవా కట్ట, యూనిట్ సభ్యులందరికీ ఆల్ ది బెస్ట్ అని చెప్పాడు. పోస్టర్ ను విడుదల చేసిన రామ్ చరణ్ కు సాయి ధరమ్ తేజ్ ధన్యవాదాలు తెలిపాడు. పోస్టర్ ను లాంచ్ చేస్తావా? అని అడిగిన క్షణంలోనే ఓకే చెప్పేస్తాడని అనుకోలేదని చెప్పాడు. నీ సపోర్ట్ నాకు ఎంతో గొప్పదని కొనియాడాడు. ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ ఐఏఎస్ అధికారి పాత్రలో మెరియనున్నారని సమాచారం.
ఈ చిత్రంలో ప్రముఖ నటి ఐశ్వర్య రాజేశ్, సీనియర్ నటుడు జగపతి బాబు, సీనియర్ నటి రమ్యకృష్ణ, సుబ్బరాజు, రాహుల్ రామకృష్ణ, సాయిధీనా తదితరలు కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని జే.భగవాన్, జే పుల్లారావులు సంయుక్తంగా జేబి ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. విభిన్నమైన కథను ఎంచుకుని దేవా కట్టా దర్శకత్వంలో ఈ చిత్రం ఫస్ట్ లుక్ తోనే ప్రభుత్వంపై సెటైరికల్ కోట్ తో అంచనాలను అందుకుంటోంది.
(And get your daily news straight to your inbox)
Aug 08 | టాలీవుడ్ యువ హీరో ఆది సాయికుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘తీస్మార్ ఖాన్’. కళ్యాణ్ జీ గోగన దర్శకత్వం వహిస్తున్నాడు. ఆర్ఎక్స్ 100 ఫేం పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా నటించింది. ఇవాళ మేకర్స్ తీస్మార్... Read more
Aug 04 | టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘సీతారామం’ ఒకటి. ఈ మధ్య కాలంలో ఈ సినిమాకు ఏర్పడిన బజ్ మరేసినిమాకు ఏర్పడలేదు. ఇప్పటికే ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే విడుదలైన... Read more
Aug 04 | నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ టైమ్ ట్రావెల్ చిత్రం ‘బింబిసార’. గత కొన్నాళ్లుగా చక్కని హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోకు లభించిన చక్కని టైమ్ ట్రావెల్ చిత్రం కలసిరానుందని సినీవిశ్లేషకులు చెబుతున్నారు.... Read more
Aug 04 | తమిళ హీరో కార్తి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘యుగానికి ఒక్కడు’ సినిమా నుండి గతేడాది విడుదలైన ‘సుల్తాన్’ వరకు ఈయన ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతూ వస్తున్నాయి.... Read more
Aug 04 | దక్షిణాదిన నయనతార తర్వాత అంతటి ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకున్న నటి సాయి పల్లవి. ముఖ్యంగా టాలీవుడ్లో ఈమె క్రేజ్ టైర్2 హీరోలకు సమానంగా ఉంది. గ్లామర్‌కు అతీతంగా సినిమాలను చేస్తూ అటు యూత్‌లో ఇటు ఫ్యామిలీ... Read more